ఫియట్ అవెంచురా వేరియంట్స్, ఫీచర్లు లీక్!

By Ravi

ఇటాలియన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫియట్ ఇండియా మరికొద్ది రోజుల్లోనే భారత మార్కెట్లో తమ సరికొత్త క్రాసోవర్ 'ఫియట్ అవెంచూరా' (Fiat Avventura)ను విడుదల చేయనున్న చేయనున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, విడుదలకు ముందే ఫియట్ అవెంచురా కారుకు సంబంధించిన వేరియంట్లు మరియు ఆయా వేరియంట్లలో లభించే ఫీచర్ల వివరాలు ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి.

ఫియట్ ఇండియా ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త పుంటో ఇవో ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేసిన ఈ కొత్త అవెంచురా క్రాసోవర్ యాక్టివ్, డైనమిక్, ఎమోషన్ అనే మూడు వేరియంట్లలో లభ్యం కానుంది. ఫియట్ అవెంచురా క్రాసోవర్ వేరియంట్లలో లభించే ఫీచర్లను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఫియట్ అవెంచురా వేరియంట్స్, ఫీచర్లు

ఫియట్ అవెంచురా వేరియంట్లు, వాటి ఫీచర్లను తర్వాతి స్లైడ్‌లలో తెలుసుకోండి.

ఫియట్ అవెంచురా యాక్టివ్

ఫియట్ అవెంచురా యాక్టివ్

ఈ వేరియంట్లో సెంట్రల్ లాకింగ్, రియర్ స్పాయిలర్, రియర్ ఫాగ్ ల్యాంప్స్, డ్యూయెల్ టోన్ డ్యాష్‌బోర్డ్, ఫ్రంట్ పవర్ విండోస్ (ఆటో-డౌన్ ఫంక్షన్‌తో), రిమోట్ కీలెస్ ఎంట్రీ, ఇన్‌క్లైనోమీటర్, కంపాస్, ఇండికేటర్లతో కూడిన సైడ్ వ్యూ మిర్రర్స్, ఫాలోమి ల్యాంప్స్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, క్లచ్ ఫుట్ రెస్ట్, డబుల్ ఫోల్డబిల్ రియర్ సీట్స్ వంటి ఫీచర్లున్నాయి.

ఫియట్ అవెంచురా డైనమిక్

ఫియట్ అవెంచురా డైనమిక్

డైనమిక్ వేరియంట్లో.. యాక్టివ్ వేరియంట్లో లభించే అన్ని ఫీచర్లకు అదనంగా.. ఈబిడితో కూడిన ఏబిఎస్ (డీజిల్ ఇంజన్లో మాత్రమే), డోర్ హాజర్డ్ వార్నింగ్, బాడీ కలర్డ్ ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ఫ్యాబ్రిక్ డోర్ ట్రిమ్, రియర్ పవర్ విండోస్, హైట్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, ఆడియో సిస్టమ్ (స్పీడ్ సెన్సింగ్ వాల్యూమ్ కంట్రోల్స్‌తో), యూఎస్‌బి, ఆక్స్-ఇన్ సపోర్ట్, ఎక్స్‌టర్నల్ టెంపరేచర్ డిస్‌ప్లే, ప్రాక్టికల్ బూట్ ల్యాంప్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

ఫియట్ అవెంచురా ఎమోషన్

ఫియట్ అవెంచురా ఎమోషన్

ఎమోషన్ వేరియంట్లో.. డైనమిక్ వేరియంట్లో లభించే అన్ని ఫీచర్లకు అదనంగా.. ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, అధునాతన 3-పాయింట్ ఈఎల్ఆర్ సీట్‌బెల్ట్స్, హైట్ అడ్జస్టబల్ ఫ్రంట్ సీట్ బెల్ట్స్, లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్ అండ్ గేర్ షిఫ్ట్ నాబ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసి వెంట్స్, రియర్ డిఫాగ్గర్ విత్ వైపర్, 60:40 రియర్ స్ప్లిట్ సీట్స్, బ్లూ అండ్ మి వాయిస్ రికగ్నైజేషన్ విత్ ఎస్ఎమ్ఎస్ రీడవుట్ ఫంక్షన్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

ఇతర స్మార్ట్ ఫీచర్లు

ఇతర స్మార్ట్ ఫీచర్లు

ఫియట్ అవెంచురా క్రాసోవర్ ప్రమాదవశాత్తు రోడ్డుపై నుంచి క్రిందకు దొర్లిపోయినట్లయితే, ఇంజన్‌కు ఆటోమేటిక్‌గా ఇంధన సరఫరా నిలిచిపోయేలా ఏర్పాటు చేశారు. ఇందులోని ప్రత్యేక డ్యూయెల్ స్టేజ్ ఎయిర్‌బ్యాగ్స్ ప్రమాద తీవ్రతను బట్టి, దానికి అనుకూలంగా స్పందిస్తాయి.

కలర్ ఆప్షన్స్కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్కలర్ ఆప్షన్స్

ఫియట్ అవెంచురా ఆరు రంగులలో (జాఫెరానో ఆరెంజ్, బ్రోన్కో టాన్, ఎగ్జోటికా రెడ్, మినిమనల్ గ్రే, హిప్‌హాప్ బ్లాక్, వోకల్ వైట్) లభిస్తుంది.

లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం..

లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం..

ఫియట్ అవెంచురా క్రాసోవర్ ఇంజన్ పెర్ఫార్మెన్స్, మైలేజ్, ధర మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. లేటెస్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Fiat India is all set launch its crossover Avventura in October 2014. The Italian manufacturer has showcased the Fiat Avventura at the 2014 Auto Expo held in New Delhi. Here is few exclusive details about the all new Avventura.
Story first published: Monday, October 6, 2014, 9:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X