వచ్చే ఏడాదిలో జీప్ బ్రాండ్; భారత్‌కు 11 కొత్త మోడళ్లు: ఫియట్

By Ravi

ఇటాలియన్-అమెరికన్ కంపెనీ ఫియట్ క్రైస్లర్ కంపెనీ రానున్న ఐదేళ్లలో 12 కొత్త మోడళ్లను భారత మార్కెట్‌కు పరిచయం చేయనుంది. ఇందులో 9 మోడళ్లను భారత్‌లోనే అసెంబుల్ చేస్తామని, మిగిలిన 3 మోడళ్లను విదేశాల నుంచి భారత్‌కు దిగుమతి చేసుకుంటామని కంపెనీ పేర్కొంది. కాగా.. వచ్చే ఏడాదిలోనే తమ పాపులర్ 'జీప్' (JEEP) బ్రాండ్‌ను భారత్‌లో ప్రవేశపెడతామని ఫియట్ క్రైస్లర్ తెలిపింది.

అంతేకాకుండా, జీప్ బ్రాండ్ వాహనాలను భారత్‌లో తయారు చేస్తామని కూడా కంపెనీ తెలిపింది. మరోవైపు ఈ ఏడాదిలోనే తమ పెర్ఫార్మెన్స్ బ్రాండ్ అబార్త్ (Abarth)ను కూడా ఇండియాలో ప్రవేశపెడతామని, ఈ బ్రాండ్ క్రింద తమ లగ్జరీ కాంపాక్ట్ కార్ అబార్త్ 500 మోడల్‌ను ఈ ఏడాదిలోనే విడుదల చేస్తామని కంపెనీ పేర్కొంది.

Fiat Chrysler To Launch Jeep Brand

అలాగే, గడచిన ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో తాము ఆవిష్కరించిన ఫియట్ అవెంచురా (Avventura) కాంపాక్ట్ ఎస్‌యూవీని కూడా 2014లోనే విడుదల చేస్కామని ఫియట్ క్రైస్లర్ వివరించింది. ప్రస్తుతం ఫియట్ భారత మార్కెట్లో విక్రయిస్తు గ్రాండే పుంటో హ్యాచ్‌బాక్ మరియు లినియా మిడ్-సైజ్ సెడాన్‌లలో కూడా ఈ ఏడాది రిఫ్రెష్డ్ మోడళ్లను అందుబాటులోకి తెస్తామని జీప్ బ్రాండ్ హెడ్, ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఏపిఏసి మైక్ మ్యాన్లీ తెలిపారు.

జీప్ బ్రాండ్ క్రింద 2015లో వ్రాంగ్లర్ మరియు గ్రాండ్ చిరోకీ మోడళ్లను ప్రవేశపెడతామని, వీటి తర్వాత అబార్త్ బ్రాండ్ క్రింద అబార్త్ పుంటోను కూడా విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ 3 మోడళ్లలో గ్రాండ్ చిరోకీ, అబార్త్ పుంటోలను స్థానికంగా ఉత్పత్తి చేస్తామని, వ్రాంగ్లర్‌ను మాత్రం దిగుమతి చేసుకుంటామని మైక్ మ్యాన్లీ వివరించారు.

Most Read Articles

English summary
Fiat Chrysler plans to launch 12 models in India in the next five years and will start producing models from the Jeep brand in the country by 2015.
Story first published: Thursday, May 8, 2014, 10:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X