జూన్ 10న ఫియట్ లీనియా టి-జెట్ సెడాన్ విడుదల

By Ravi

ఇటలీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫియట్ ఇండియా, గతంలో భారత మార్కెట్లో అందించి ప్రస్తుతం నిలిపివేసిన పెర్ఫామెన్స్ వెర్షన్ సెడాన్ లీనియా టి-జెట్‌ను తిరిగి మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. డీలర్‌షిప్ నెట్‌వర్క్ షేరింగ్ టాటా మోటార్స్ భాగస్వామ్యం నుంచి విడిపోయిన తర్వాత ఫియట్ భారత మార్కెట్లో శరవేగంగా పావులు కదుపుతుంది.

ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాలలో తమ ఉత్పత్తుల కోసం ఎక్స్‌క్లూజివ్ డీలర్‌షిప్ కేంద్రాలను ప్రారంభిస్తున్న ఫియట్, తాజాగా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లీనియా టి-జెట్ సెడాన్‌ను విడుదల చేయనుంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, జూన్ 10, 2013న ఈ కొత్త టర్బో చార్జ్‌డ్ వెర్షన్ ఫియట్ లీనియా టి-జెట్ సెడాన్ మార్కెట్లో విడుదల కానుంది. గతకొద్ది కాలంగా ఇంటర్నెట్లో ఈ కారు హాట్ టాపిక్‌గా ఉంది.

Fiat Linea T Jet

వాస్తవానికి ఈ సరికొత్త ఫియట్ లీనియా టి-జెట్ సెడాన్ గడచిన మార్చి నెలలో మార్కెట్లో విడుదల కావల్సి ఉన్నప్పటి, పలు కారణాల వలన అది జూన్ నెలకు వాయిదా పడింది. ఫియట్ పునఃపరిచయం చేయనున్న ఈ లీనియా టి-జెట్ వేరియంట్లో శక్తివంతమైన 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది ఈ సెగ్మెంట్లో లభిస్తున్న కార్ల కన్నా ఉత్తమ పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేయనుంది.

ఫియట్ లీనియా టి-జెట్‌లో 1,368 సీసీ, ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చనున్నారు. ఇది గరిష్టంగా 11.5 బిహెచ్‌పిల శక్తిని, 207 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇంకా ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, జిపిఎస్ అండ్ శాటిలైట్ నావిగేషన్, స్పోర్టీ అల్లాయ్ వీల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, విలాసవంతమైన లెథర్ సీట్స్ వంటి ఫీచర్లతో ఇది లభ్యం కానుంది. ఈ ఫవర్‌ఫుల్ లీనియాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Most Read Articles

English summary
Italian automotive manufacturer Fiat India is all set to relaunch the much awaited Fiat T-Jet sedan on June 10, 2013. According sources, the new Fiat Linea T-Jet will have 1,368 cc four cylinder petrol engine, producing peak power and torque in excess of 112.5 bhp at 5,000 rpm along with 207 Nm at 2,200 rpm.
Story first published: Saturday, June 8, 2013, 17:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X