జనవరి 2015లో ఫియట్ అబార్త్ 595 కాంపిటీషన్ విడుదల

By Ravi

ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్‌కి చెందిన పెర్ఫామెన్స్ కార్ డివిజన్ అబార్త్ (Abarth) వచ్చే ఏడాది అఫీషియల్‌గా ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఫియట్ అబార్త్ నుండి రానున్న తొలి ఉత్పత్తి '595 కాంపిటీషన్' హ్యాచ్‌బ్యాక్. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ఫియట్ ఇండియా తమ అబార్త్ 500 కారును ప్రదర్శనకు ఉంచింది.

కాగా.. జనవరిలో ఫియట్ విడుదల చేయనున్న అబార్త్ 595 కాంపిటీశన్ మోడల్‌‍ను కూడా ఈ అబార్త్ 500 మోడల్ ఆధారంగా చేసుకొనే తయారు చేశారు. ఫియట్ అబార్త్ కార్లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఈ పెర్ఫార్మెన్స్ కార్లు చూడటానికి చిన్నవిగా ఉన్నప్పటికీ, పెర్ఫార్మెన్స్ పరంగా పెద్ద కార్లతో పోటీ పడుతాయి.

అబార్త్ 595 కాంపిటీషన్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

జనవరిలో ఫియట్ అబార్త్ 595

ఫియట్ అబార్త్ 595 కాంపిటీషన్ మోడల్‌లో 1.4 లీటర్ మల్టీఎయిర్‌‌టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 158 బిహెచ్‌పిల శక్తిని, 201 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

జనవరిలో ఫియట్ అబార్త్ 595

ఈ ఇంజన్ ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇందులో రెండు డ్రైవింగ్ మోడ్స్ (నార్మల్, స్పోర్ట్స్) ఉంటాయి. నార్మల్ మోడ్‌లో ఇది 201 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ని, స్పోర్ట్స్ మోడ్‌లో 230 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

జనవరిలో ఫియట్ అబార్త్ 595

ఈ హై-పెర్ఫార్మెన్స్ హ్యాచ్‌బ్యాక్‌లో బెటర్ రోడ్ గ్రిప్ కోసం 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను ఉపయోగిస్తున్నారు. మరింత మెరుగైన ఏరోడైనమిక్స్ కోసం ఈ కారు ఎత్తును 105 మి.మీ. తగ్గించారు.

జనవరిలో ఫియట్ అబార్త్ 595

అబార్త్ డీకాల్స్, ట్విన్ ఎగ్జాస్ట్, స్పోర్ట్స్ సీట్స్, సన్‌రూఫ్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్స్ వంటి విశిష్టమైన ఫీచర్లు ఈ కారు సొంతం. ఇంకా ఇందులో 7-ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్లిప్ డిఫరెన్షియల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, టార్క్ ట్రాన్స్‌ఫర్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

జనవరిలో ఫియట్ అబార్త్ 595

ఫియట్ ఇండియా తమ అబార్త్ 595 కాంపిటీషన్ సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయించనుంది. ఫలితంగా దేశీయ విపణిలో దీని ధర రూ.26-30 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Fiat India has unveiled the high performance Abarth 500 Competitioze hatchback in India. The new high performance hatchback car to be launched in India by next month. 
Story first published: Monday, December 15, 2014, 10:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X