ఫియట్ పుంటో ఇవో విడుదల; ధర రూ.4.55 లక్షలు

By Ravi

ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న పుంటో హ్యాచ్‌బ్యాక్‌లో 'ఫియట్ పుంటో ఇవో' (Fiat Punto Evo) పేరిట అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను నేడు (ఆగస్ట్ 5, 2014) భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో దీని ప్రారంభ ధర రూ.4.55 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్లలో లభ్యం కానుంది.

ఇది కూడా చదవండి: ఫియట్ పుంటో ఇవో టెస్ట్ డ్రైవ్ రివ్యూ

న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఫియట్ ఇండియా తమ కొత్త 2014 పుంటో ఇవో కారును విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో జర్మన్-ఇండియన్ బాలీవుడ్ నటీమణి ఎవెలిన్ శర్మ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కస్టమర్ల అవసరాలకు దృష్టిలో ఉంచుకుని, భారతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈ కారును డిజైన్ చేశామని ఫియట్ ఇండియా అధ్యక్షుడు, ఎండీ నాగేశ్ బసవన్ హల్లీ తెలిపారు.

మరింత సమచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌‌లో పరిశీలించండి..!

ఫియట్ పుంటో ఇవో విడుదల

తర్వాతి స్లైడ్‌లలో సరికొత్త ఫియట్ పుంటో ఇవో ధరలు, ఫీచర్లను తెలుసుకోండి.

పెట్రోల్ వెర్షన్ ధరలు

పెట్రోల్ వెర్షన్ ధరలు

ఫియట్ పుంటో ఇవో యాక్టివ్ (1.2 లీటర్, పెట్రోల్) వేరియంట్ ధర రూ.4.55 లక్షలుగా ఉంటే, పుంటో ఇవో డైనమిక్ (1.2 లీటర్, పెట్రోల్) వేరియంట్ ధర రూ.5.12 లక్షలు గాను మరియు పుంటో ఇవో ఎమోషన్ (1.4 లీటర్, పెట్రోల్) వేరియంట్ ధర రూ.6.65 లక్షలు గాను ఉంది (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

డీజిల్ వెర్షన్ ధరలు

డీజిల్ వెర్షన్ ధరలు

ఫియట్ పుంటో ఇవో యాక్టివ్ (1.3 లీటర్, డీజిల్) వేరియంట్ ధర రూ.5.27 లక్షలుగా ఉంటే, పుంటో ఇవో డైనమిక్ (1.3 లీటర్, డీజిల్) వేరియంట్ ధర రూ.6.21 లక్షలు గాను మరియు పుంటో ఇవో ఎమోషన్ (1.3 లీటర్, డీజిల్) వేరియంట్ ధర రూ.6.83 లక్షలు గాను ఉంది. కాగా 90 హెచ్‌పి స్పోర్ట్ వేరియంట్ ధర రూ.7.19 లక్షలుగా ఉంది (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఫియట్ పుంటో ఇవో విడుదల

కొత్త ఫియట్ పుంటో ఇవో డిజైన్ మరింత సింపుల్‌ ఉంటుంది. ప్రీమియం లుక్ కోసం ఇందులో ఎక్కువ క్రోమ్ గార్నిష్ చేశారు. ఇందులో ఫియట్ లోగోను ఫ్రంట్ గ్రిల్‌‌పై నుంచి బానెట్‌పైకి మార్చారు. ఫ్రంట్ గ్రిల్, ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ క్రోమ్ సరౌండింగ్ ఉంటుంది. ముందు వైపు నుంచి స్పోర్టీ లుక్‌నిచ్చేందుకు గాను దీని హెడ్‌లైట్ డిజైన్‌ను మార్చారు.

ఫియట్ పుంటో ఇవో విడుదల

సైడ్ నుంచి చూస్తే 2014 ఫియట్ పుంటో ఇవో ఇదివరకటి మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది. అయితే, ఇందులో 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్, టర్న్ ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్ వంటి ఫీచర్లున్నాయి. దీని డోర్లు చాలా ధృడంగా అనిపిస్తాయి, నాణ్యతను మరియు సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని దీనిని తయారు చేశారు.

ఫియట్ పుంటో ఇవో విడుదల

వెనుక వైపు టెయిల్ ల్యాంప్స్, రియర్ బంపర్‌‌లను రీడిజైన్ చేశారు. మేము టెస్ట్ డ్రైవ్ చేసిన 90 హెచ్‌పి మోడల్‌కు వెనుక వైపు స్పాయిలర్ కూడా ఉంది. దానిపై హైమౌంట్ బ్రేక్ ల్యాంప్ ఉంటుంది. వెనుక బంపర్‌పై నెంబర్ ప్లేట్‌కు దిగువన క్రోమ్ లైన్, రిఫ్లెక్టర్స్‌కు బదులుగా ఏర్పాటు చేసిన అలెర్ట్ లైట్స్ చుట్టూ క్రోమ్ సరౌండింగ్ కొత్తగా అనిపిస్తుంది. ఈ బంపర్ లైట్లలో కుడివైపు లైట్ ఫాగ్ ల్యాంప్ స్విచ్ ఆన్ చేసినప్పుడు వెలుగుతుంది, ఎడమ వైపు లైట్ రివర్స్ గేర్ వేసినప్పుడు ఆన్ అవుతుంది. వెనుక వైపు వైపర్, డిఫాగ్గర్ ఉంటుంది.

ఫియట్ పుంటో ఇవో విడుదల

కొత్త 2014 ఫియట్ పుంటో ఇవో ఇంటీరియర్స్ రెండు రంగులలో లభిస్తుంది. ఇందులో మొదటిది ఆల్-బ్లాక్ ఇంటీరియర్, ఇది కేవలం 90 హెచ్‌పి మోడల్‌లో మాత్రమే లభిస్తుంది. ఇతర వేరియంట్లు బ్లాక్ విత్ బీజ్ సాఫ్ట్ టచ్ స్పోర్టీ లుకింగ్ ఇంటీరియర్‌తో లభిస్తాయి. 90 హెచ్‌పి వేరియంట్లో క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసి వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు లభిస్తాయి.

Most Read Articles

English summary
Italian car manufacturer Fiat has decided to give its Punto hatchback a much awaited facelift. They have finally lifted the cover of its re-christened Fiat Punto Evo. They have launched both a petrol as well as a diesel engine option.
Story first published: Tuesday, August 5, 2014, 16:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X