కార్ సభ ఎన్నికలు 2014లో నెగ్గిన ఫ్లూయిడిక్ హ్యుందాయ్ వెర్నా

By Ravi

లోక్ సభ, రాజ్యసభ ఎన్నికలు తెలుసు కానీ, ఈ కార్ సభ ఎన్నికలు ఏంటనుకుంటున్నారా..? భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మరియు ప్రథమ అగ్రగామి వాహనాల ఎగుమతి సంస్థ అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా, ఇటీవల 'కార్ సభ ఎలక్షన్స్ 2014' పేరిచ ఎక్స్‌క్లూజివ్ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఇటీవలి జాతీయ ఎన్నికల నేపథ్యాన్ని పురస్కరించుకొని హ్యుందాయ్ ఈ విశిష్ట క్యాంపైన్‌ను ప్రారంభించింది. హ్యుందాయ్ తమ కార్ సభ ఎన్నికలు 2014 కార్యక్రమాన్ని దేశపు ఐటి రాజధాని బెంగుళూరులో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ టెక్ పార్కుల నుంచి ఐటి ఉద్యోగులను హ్యుందాయ్ ఆహ్వానించింది.


ఈ కార్యక్రమంలో, హ్యుందాయ్ దేశీయ విపణిలో ఆఫర్ చేస్తున్న ఉత్పత్తులలో తమ ఫేవరేట్ వాహనాన్ని ఎంచుకోవాల్సిందిగా కంపెనీ సదరు ఐటి ఉద్యోగులను కోరింది. ఇందులో ఎక్కువ మంది హ్యుందాయ్ ఫ్లూయిడిక్ వెర్నాకు ఓటు వేయటంతో కార్ సభ ఎలక్షన్స్ 2014లో ఈ మోడల్ విజేతగా నిలిచింది.

హ్యుందాయ్ వెర్నా 2014 సంవత్సరానికి ఉత్తమ కారు అవార్డును కూడా గెలుచుకున్న విషయం తెలిసినదే. బెంగుళూరులోని దాదాపు 8 టెక్ పార్కులకు చెందిన ఉద్యోగులు ఈ ఓటింగ్ క్యాంపైన్‌లో పాల్గొన్నారు. సుమారు 4,00,000 మంది పైగా హ్యుందాయ్ అభిమానులు ఇందులో పాల్గొని తమకు నచ్చిన కారుకు ఓటు వేశారు.

Fluidic Hyundai Verna

భారత మార్కెట్లో ఫ్లూయిడిక్ హ్యుందాయ్ వెర్నా ధరలు రూ.7.18 లక్షల నుంచి రూ.11.52 లక్షల రేంజ్‌లో (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. పెట్రోల్ వెర్షన్‌లో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కూడా అందుబాటులో ఉంది.

ఈ క్యాంపైన్‌తో పాటుగా ఇందులో పాల్గొన్న ఓటర్లను సర్‌ప్రైజ్ చేసేందుకు హ్యుందాయ్ ఓ లాటరీ సిస్టమ్‌ను నిర్వహించింది. ఈ లాటరీలో నెగ్గిన వారికి బెంగుళూరులోని ప్రీమియం రెస్టారెంట్‌లో క్యాండిల్ లైట్ డిన్నర్‌కు తీసుకువెళ్లింది. 104 ఎఫ్ఎమ్ రేడియో ఛానెల్ ఈ క్యాంపైన్‌కు భాగస్వామిగా వ్యవహరించింది.

Most Read Articles

English summary
South Korean automobile manufacturer Hyundai is India's largest exporter of vehicles. They are second behind Maruti Suzuki in manufacturing the highest number of passenger vehicles in the subcontinent of India. The manufacturer recently organised a Hyundai exclusive called 'Car Sabha Elections 2014'.
Story first published: Wednesday, July 9, 2014, 15:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X