ఫోర్డ్ మస్టాంగ్ రైట్ హ్యాండ్ డ్రైవ్ వెర్షన్ షురూ, ఇండియాకు వచ్చేనా?

By Ravi

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పాపులర్ అయిన అమెరికన్ ఫోర్డ్ మస్టాంగ్ కార్లు త్వరలోనే ఏషియా మార్కెట్లలో కూడా విడుదల కాబోతున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ మోటార్స్ అందిస్తున్న ఈ కండలు తిరిగిన (మజిక్యులర్) 'ఫోర్డ్ మస్టాంగ్' (Ford Mustang)లో కంపెనీ ఓ రైట్-హ్యాండ్ డ్రైవ్ (కుడి చేతి వైపు స్టీరింగ్) కలిగిన వెర్షన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు గతంలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ప్రచురించిన సంగతి తెలిసినదే.

కాగా.. కంపెనీ ఇప్పుడు తమ రైట్ హ్యాండ్ డ్రైవ్ వెర్షన్ కలిగిన నెక్స్ట్ జనరేషన్ మస్టాంగ్ కారును అధికారికంగా ఆవిష్కరించింది. ఫోర్డ్ మస్టాంగ్ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కేవలం లెఫ్ట్-హ్యాండ్ డ్రైవ్ (ఎడమ చేతి వైపు స్టీరింగ్) కలిగిన వెర్షన్లో మాత్రమే లభిస్తోంది. ఇందులో రైట్-హ్యాండ్ డ్రైవ్‌ను పరిచయం చేయబోవటం ఇదే మొట్టమొదటి సారి. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న (ప్రత్యేకించి ఏషియా) మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని ఫోర్డ్ ఇందులో ఈ కొత్త వెర్షన్‌ను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఫోర్డ్ మస్టాంగ్ రైట్ హ్యాండ్ డ్రైవ్ వెర్షన్ షురూ, ఇండియాకు వచ్చేనా?

ఫోర్జ్ తమ 2015 మస్టాంగ్ కారును 25 కొత్త మార్కెట్లలో విడుదల చేయాలని యోచిస్తోంది. ఇవన్నీ రైట్ హ్యాండ్ డ్రైవ్ కలిగిన మార్కెట్లే. సాధారణ స్పోర్ట్స్ కార్ల కన్నా ఫోర్డ్ మస్టాంగ్ విభిన్నంగా ఉంటుంది. భారీగా కనిపించే ఈ కారు అంతే భారీ పెర్ఫామెన్స్‌ను కలిగి ఉంటుంది. ధృడమైన నిర్మాణం దీని సొంతం. అందుకే ఈ కారును కండలు తిరిగిన కారు (మజిక్యులర్ కార్)అని ముద్దుగా పిలుస్తుంటారు.

ఫోర్డ్ మస్టాంగ్ రైట్ హ్యాండ్ డ్రైవ్ వెర్షన్ షురూ, ఇండియాకు వచ్చేనా?

కొత్త ఫోర్డ్ మస్టాంగ్ కారును ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని ఫోర్డ్ భావిస్తోంది. ఈ కారు 2-డోర్ కూపే (2 మరియు 2+2 సీటింగ్), హ్యాచ్‌బ్యాక్, ఫాస్ట్‌బ్యాక్ మరియు కన్వర్టిబల్ బాడీ స్టయిల్స్‌లో లభిస్తుంది. స్టాండర్డ్ ఫోర్డ సెడాన్ సెడాన్ వేరియంట్ మస్టాంగ్ అస్సలు తయారే కాలేదు.

ఫోర్డ్ మస్టాంగ్ రైట్ హ్యాండ్ డ్రైవ్ వెర్షన్ షురూ, ఇండియాకు వచ్చేనా?

కొత్త 2015 ఫోర్డ్ మస్టాంగ్ మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. అవి -

1) 2.3 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్

2) 3.7 లీటర్ వి6 ఇంజన్

3) 5.0 లీటర్ వి8 ఇంజన్

ఫోర్డ్ మస్టాంగ్ రైట్ హ్యాండ్ డ్రైవ్ వెర్షన్ షురూ, ఇండియాకు వచ్చేనా?

మస్టాంగ్‌ను తొలిసారిగా ఏప్రిల్ 17, 1964లో న్యూయార్క్‌లో విడుదల చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ డజన్ల కొద్దీ స్పెషల్ ఎడిషన్లు, మోడిఫైడ్ మస్టాంగ్‌లు చాలానే పుట్టుకొచ్చాయి.

Most Read Articles

English summary
Ford has officially revealed it has commenced testing of a right hand drive Mustang. This is the first time the manufacturer is preparing a right hand drive version of its iconic Mustang. They are working on the 2015 Mustang with a prototype right hand drive version.
Story first published: Thursday, August 21, 2014, 9:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X