ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎమర్జెన్సీ అసిస్ట్.. అసలు ఏంటిది..?

By Ravi

త్వరలో భారత మార్కెట్లో విడుదల కానున్న ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో హైలైట్ కేవలం '1.0 లీటర్ ఈకోబూస్ట్' ఇంజన్ మాత్రమే కాదండోయ్, ఇందులో మరొక అధునాతన సేఫ్టీ ఫీచర్ కూడా ఉంది. ఈ సేఫ్టీ ఫీచర్ పేరు 'ఎమర్జెన్సీ అసిస్ట్'. ఈ సేఫ్టీ ఫీచర్‌లో భాగంగా మీ మొబైల్‌ను కారులోని సింక్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. అత్యవసర సమయాల్లో ప్రమాదం జరిగిన క్షణాల్లోనే ఇది ఆటోమేటిక్ 108, 100 వంటి ఎమర్జెన్సీ సర్వీసులను అలెర్ట్ చేస్తుంది.

భారత్‌లో ఈ తరహా సేఫ్టీ ఫీచర్‌తో లభ్యం కానున్న ఏకైక మోడల్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ అని, ఆ ఘతన సంస్థకే దక్కనుందని ఫోర్డ్ ఇండియా పేర్కొంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎయిర్‌బ్యాగ్ ఓపెన్ అయినా లేదా ఫ్యూయెల్ పంప్ ఆటోమేటిక్‌గా మూసుకుపోయినా ఈ సేఫ్టీ ఫీచర్ పనిచేసి ఎమర్జెన్సీ సర్వీసులకు జిపిఎస్ సాయంతో ప్రమాదం జరిగిన ప్రాంతంతో సహా సందేశాలను చేరవేస్తుంది. ప్రమాదం జరిగిన 10 సెకండ్ల వ్యవధిలోనే ఎమర్జెన్సీ సర్వీసులకు కాల్ వెళ్తుంది.

ఒకవేళ ప్రమాదం చిన్నదే అయి ఉండి, ఎమర్జెన్సీ సర్వీసుల అవసరం లేదనుకున్నపుడు డ్రైవర్ ఈ కాల్‌ను వెళ్లకుండా నిరోధించుకునే సదుపాయం కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. ఫోర్డ్ ఎమర్జెన్సీ అసిస్ట్ సిస్టమ్ ఒక ఉచిత సర్వీస్, ఇందుకు ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు. డ్రైవర్ వద్ద బ్లూటూత్ కనెక్షన్ ఉండే స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఒకవేళ డ్రైవర్ ఫోన్ మర్చిపోయినా లేదా కనెక్ట్ చేయటం మర్చిపోయినా ప్రయాణం ప్రారంభించే ముందుగానే కారులో సిస్టమ్ డ్రైవర్‌ను అలెర్ట్ చేస్తుంది. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో క్రింది చిత్రాల్లో తెలుసుకుందాం రండి..!

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎమర్జెన్సీ అసిస్ట్

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎమర్జెన్సీ అసిస్ట్

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎమర్జెన్సీ అసిస్ట్

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎమర్జెన్సీ అసిస్ట్

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎమర్జెన్సీ అసిస్ట్

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎమర్జెన్సీ అసిస్ట్

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎమర్జెన్సీ అసిస్ట్

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎమర్జెన్సీ అసిస్ట్

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎమర్జెన్సీ అసిస్ట్

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎమర్జెన్సీ అసిస్ట్

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎమర్జెన్సీ అసిస్ట్

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎమర్జెన్సీ అసిస్ట్

Most Read Articles

English summary
When Ford launches the EcoSport in India, the EcoBoost engine will not be the only highlight of the car. Ford will also introduce its Sync infotainment system based Emergency Assist feature for the first time in India.
Story first published: Wednesday, May 8, 2013, 17:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X