2016 నాటికి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

By Ravi

అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ ఇండియా దేశీయ విపణిలో తయారు చేస్తున్న ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను పరిచయం చేయనుంది. ప్రస్తుత ఈకోస్పోర్ట్‌తో పోల్చుకుంటే డిజైన్, ఫీచర్లలో కొద్దిపాటి మార్పుల చేర్పులతో రానున్న కొత్త అప్‌గ్రేడెడ్ ఈకోస్పోర్ట్‌ను ముందుగా విదేశీ మార్కెట్లలో విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఫేస్‌లి‌ఫ్ట్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌లో కొత్త ఎడ్జ్ గ్రిల్, స్టాండర్డ్ డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఎలక్ట్రానిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లతో లభ్యమయ్యే ఆస్కారం ఉంది. ఫోర్డ్ కంపెనీకి ఇండియా ఇప్పటికే ఎక్స్‌పోర్ట్ హబ్‌గా ఉంది. భారత్‌లో ఫోర్డ్ మొత్తం 1.3 లక్షల ఈకోస్పోర్ట్ వాహనాలను ఉత్పత్తి చేస్తే అందులో దాదాపు 35 శాతం వాహనాలను ఎగుమతి చేసింది. గడచిన సంవత్సరంలో ఫోర్డ్ 50,000 లకు పైగా ఈకోస్పోర్ట్ వాహనాలను ఇండియాలో విక్రయించింది.


అధిక డిమాండ్ కారణంగా, గడచిన సంవత్సరం ఆగస్ట్ నెలలో ఈకోస్పోర్ట్ బుకింగ్‌లను నిలిపివేసిన ఫోర్డ్, తాజాగా ఈ నెలలో బుకింగ్‌లను తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసినదే. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు చెన్నైలోని ఫోర్డ్ ఇండియా ప్లాంట్‌లో కంపెనీ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా మూడు షిఫ్టులను ప్రారంభించి ఈ మోడల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది.

కాగా.. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ ఇంజన్స్‌‌లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న మూడు ఇంజన్ ఆప్షన్లనే కొనసాగించనున్నారు. వీటిలో ఒకటి 1.5 లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 112 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభ్యమవుతుంది.

డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో ఉపయోగించిన 1.5 లీటర్, 4-సిలిండర్ డీజిల్ గరిష్టంగా 91 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభ్యమవుతుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ అందుబాటులో లేదు.

టాప్-ఎండ్ పెట్రోల్ వేరియంట్ ఈకోస్పోర్ట్‌ మాత్రం 1.0 లీటర్ ఫోర్డ్ ఈకోబూస్ట్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇది గరిష్టంగా 125 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభ్యమవుతుంది. ఇందులో కూడా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ అందుబాటులో లేదు.

Most Read Articles

English summary
According to recent report, Ford will introduce the EcoSport facelift by 2016. The Ford EcoSport facelift is expected to come with host cosmetic and feautue upgrades.
Story first published: Friday, May 23, 2014, 16:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X