యూరప్ మార్కెట్ల కోసం లిమిటెడ్ ఎడిషన్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్

By Ravi

అమెరికన్ ఆటో దిగ్గజం ఫోర్డ్, భారత మార్కెట్లో ఉత్పత్తి చేస్తున్న ఈకస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కేవలం దేశీయ మార్కెట్లో విక్రయించడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లకు సైతం ఎగుమతి చేస్తున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో తాజాగా యూరప్ మార్కెట్ కోసం, ఫోర్డ్ ఇండియా ఓ లిమిటెడ్ ఎడిషన్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని తయారు చేసింది.

ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ పేరు పాంథర్ బ్లాక్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్. బెర్లిన్‌లో జరుగుతున్న ఐఎఫ్ఏ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో కంపెనీ యూరో స్పెక్ ఈకోస్పోర్ట్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ పాంథర్ బ్లాక్ కాంపాక్ట్ ఎస్‌యూవీని టైటానియం వేరియంట్లో కేవలం 500 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేయనున్నారు.

Ford EcoSport Panther Black Titanium Limited Edition

ఈ స్పెషల్ ఎడిషన్ ఫొటోను గమనిస్తే, దీనిని పాంథర్ బ్లాక్ కలర్‌లో పెయింట్ చేశారు. మరింత స్పోర్టీ లుక్ కోసం 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌కు బదులుగా 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ జోడించారు. ఇంకా, లెథర్ ఇంటీరియర్స్, ఫోర్డ్ సింక్ యాప్‌లింక్ మరియు ఆడియోటెకా నుంచి 12 నెలల అపరిమిత ఆడియో బుక్ డౌన్‌లోడ్ ప్యాకేజ్‌లను కూడా ఈ స్పెషల్ ఎడిషన్‌లో ఆఫర్ చేయనున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈకోస్పోర్ట్ పాంథర్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను కేవలం ఫోర్డ్ అఫీషియల్ ప్యాన్‌బుక్ పేజ్ నుంచి మాత్రమే బుక్ చేసుకోగలరు. మొత్తం 500 యూనిట్లలో యూకే కొనుగోలుదారుల కోసం కేవలం 120 యూనిట్లను మాత్రమే ఆఫర్ చేయనున్నారు. యూకేలో రెగ్యులర్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ధర 14,995 (15.69 లక్షలు) యూరోలు ఉండగా, ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ధర 16,995 (17.78 లక్షలు) యూరోలుగా ఉంది.

Most Read Articles

English summary
At the ongoing IFA Consumer electronics show in Berlin Ford announced the details of the Euro spec EcoSport, bookings for which will start with a limited edition model of the EcoSport. Dubbed Panther Black, this model will be limited to just 500 units and will be released only in the Titanium trim.
Story first published: Thursday, September 5, 2013, 19:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X