ఫోర్డ్ ఇండియా నుంచి రానున్న అప్‌గ్రేడెడ్ ఫియస్టా సెడాన్

By Ravi

అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ ఇండియా, భారత మార్కెట్లో అందిస్తున్న ఫియస్టా సెడాన్‌లో ఓ సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను వచ్చే ఏడాది ఆరంభంలో భారత మార్కెట్లో విడుదల చేయనుంది. యూరోపియన్, అమెరికన్ మార్కెట్లలో లభ్యమవుతున్న కొత్త ఫియస్టాను ఫోర్డ్ భారత్‌కు పరిచయం చేయనుంది.

ఈకోస్పోర్ట్ సక్సెస్‌తో జోరుమీదున్న ఫోర్డ్, సరికొత్త ఉత్పత్తులను మార్కెట్‌కు పరిచయం చేయటం ద్వారా ఇక్కడి మార్కెట్లో తమ వాటాను మరింత పెంచుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే, గడచిన సంవత్సరం చివర్లో బ్రెజిల్‌లో జరిగిన సావ్ పాలో ఆటో షోలో ఫోర్డ్ మోటార్స్ ఆవిష్కరించిన కొత్త ఫోర్డ్ ఫియస్టా సెడాన్‌ను భారత్‌లో విడుదల చేసేందుకు కంపెనీ స్ననాహాలు చేస్తుంది.

ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న ఫోర్డ్ ఫియస్టాతో పోల్చుకుంటే 2014 ఫోర్డ్ ఫియస్టా ఇంటీరియర్, ఎక్స్టీరియర్‌లలో అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి. యూరోపియన్ వెర్షన్ ఫియస్టా డిజైన్ యధాతధంగా భారత్‌లో విడుదస చేసే అవకాశం ఉంది. అయితే, యూరోపియన్ వెర్షన్ ఫియస్టాలో లభ్యమయ్యే కొన్ని ఫీచర్లు ఇండియన్ వెర్షన్ ఫియస్టాలో ఉండకపోవచ్చని తెలుస్తోంది.

ఈ సరికొత్త అప్‌గ్రేడెడ్ ఫియస్టాకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఫ్రంట్ డిజైన్

ఫ్రంట్ డిజైన్

కొత్త ఫోర్డ్ ఫియస్టాలో సరికొత్త ఫ్రంట్ గ్రిల్, ఎయిర్-డ్యామ్స్, వీల్ అర్చెస్, ఫ్రంట్ బానెట్‌పై కనిపించే బాడీ లైన్స్ వంటి మార్పుల వల ఈ కారు మంచి స్పోర్టీ లుక్‌ను కలిగి ఉంటుంది. హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్‌ను రీడిజైన్ చేశారు. అయితే సైడ్ ప్రొఫైల్‌లో మాత్రం పెద్దగా చెప్పుకోదగిన మార్పులు ఏవీ లేవు. సరికొత్త డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్, కొద్దిగా మార్పు చేసిన వీల్ ఆర్చెస్‌లు చెప్పుకోదగిన మార్పులు.

రియర్ డిజైన్

రియర్ డిజైన్

సరికొత్త టెయిల్ ల్యాంప్ క్లస్టర్, రీడిజైన్ చేయబడిన రియర్ బూట్ డోర్, రియర్ బంపర్‌లు ప్రధానంగా చెప్పుకోదగినవి.

ఇంటీరియర్స్

ఇంటీరియర్స్

కొత్త 2014 ఫోర్డ్ ఫియస్టాలో ఇంటీరియర్ల పరంగా కూడా అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి. మరింత ప్రీమియం లుక్, కంఫర్ట్ ఫీల్‌ను ఇచ్చేలా ఈ కారులోని ఇంటీరియర్స్‌ను అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది.

సేఫ్టీ ఫీచర్స్

సేఫ్టీ ఫీచర్స్

ఎలక్ట్రానికి స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పి), ముందు వైపు డ్యూయెల్ స్టేజ్ ఎయిర్‌బ్యాగ్స్, డ్రైవర్ క్నీ ఎయిర్‌బ్యాగ్ (మోకాలు రక్షణ కోసం), అధనపు భద్రత కోసం సైడ్ ఇంపాక్ట్ అండ్ సైడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి భద్రతా ఫీచర్లు ఈ కారు సొంతం. సురక్షితమైన మరియు సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం ఇది ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)తో లభిస్తుంది.

ఇంటెలిజెంట్ ఫీచర్స్

ఇంటెలిజెంట్ ఫీచర్స్

కారు దొంగతనానికి గురికాకుండా ఉండేందుకు రూపొందించిన యాంటీ-థెఫ్ట్ మెకానిజం, టైరులో గాలిని గుర్తించే టైర్ ప్రెజర్ మోనిటరింగ్ వంటి ఇంటెలిజెండ్ ఫీచర్లు కొత్త ఫియస్టా సొంతం.

ఇన్ఫోటైన్‌మెంట్

ఇన్ఫోటైన్‌మెంట్

ఇందులో స్మార్టఫోన్‌‌తో కారును అనుసంధానించేందుకు గాను ఫోర్ట్ సింగ్ టెక్నాలజీ, ఇన్‌బిల్ట్ నావిగేషన్ సిస్టమ్, మైకీ ప్రోగ్రామబల్ కీ ఫీచర్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ రేడియో మొదలైనవి చెప్పుకోదగినవి.

1.0 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్ లేదు

1.0 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్ లేదు

అప్‌గ్రేడెడ్ 2014 ఇండియన్ వెర్షన్ ఫోర్డ్ ఫియస్టాలో అనేక అవార్డులను సొంతం చేసుకున్న 1.0 లీటర్ ఫోర్డ్ ఈకోబూస్ట్ ఇంజన్‌ను ఉపయోగించే సూచనలు కనిపించడం లేదు (గ్లోబల్ వెర్షన్‌లో ఇది అందుబాటులో ఉంది). దీనికి బదులు 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్లను ఉపయోగించవచ్చని అంచనా.

Most Read Articles

English summary
In 2014 Ford Fiesta sedan will finally shed its old face take to Ford family's new design which is sported by the latest Ford Fiesta model in European and the US market. The new Ford design was revealed in Amsterdam late last year.
Story first published: Friday, August 23, 2013, 14:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X