ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఫోర్డ్ ఫిగో 2015 మోడల్ ఆవిష్కరణ!?

By Ravi

అమెరికన్ ఆటో దిగ్గం ఫోర్డ్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న తమ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ ఫిగోను అప్‌గ్రేడ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో పెరుగుతున్న పోటీని సమవర్థవంతంగా ఎదుర్కునేలా ఫోర్డ్ మోటార్స్ తమ ఫిగో కారుకు ఆధునిక హంగులు జోడిస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, కంపెనీ అభివృద్ధి చేసిన ఓ 2015 మోడల్ ఫిగోను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించే అవకాశం ఉంది.

ఫోర్డ్ ఫిగో భారత మార్కెట్లో విడుదలైన సమయంలో, ఆ మోడల్ అమ్మకాలు జోరుగా సాగాయి. అయితే, దీని డిజైన్ ఇంకా అప్‌గ్రేడ్ కాకపోవటం, ఇదే సమయంలో కొత్త డిజైన్ కలిగిన ఇతర బ్రాండ్‌లకు చెందిన కార్లు అందుబాటులోకి రావటంతో ఫిగో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో, ఫోర్డ్ ఫిగోకు పూర్వవైభవం కల్పించేదుకు ఫోర్డ్ మోటార్స్ ఓ కొత్త మోడల్‌ను తయారు చేస్తోంది.

ఫోర్డ్ ఫిగో ఇతర దేశాల్లో 'ఫోర్డ్ కా' (Ford Ka) పేరుతో అమ్ముడుపోతుంది. ఈ మోడల్‌ను ఆధారంగా చేసుకొని ఫోర్డ్ తాజాగా బ్రెజిల్‌లో ఓ అధునాత కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. ఈ కాన్సెప్ట్ నుంచి స్ఫూర్తి పొంది నెక్స్ట్ జనరేషన్ ఫోర్డ్ ఫిగో/కా మోడల్‌ను తయారు చేయనున్నారు. ఈ కొత్త ఫిగోకు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో తెలుసుకుందాం రండి..!

2015 ఫోర్డ్ ఫిగో

కొత్త 2015 ఫోర్డ్ ఫిగో కంపెనీ యొక్క గ్లోబల్ డిజైన్ ఫిలాసఫీని ఆధారంగా తయారు చేసుకొని డిజైన్ చేయనున్నారు. దీని ఫ్రంట్ గ్రిల్ ఆస్టన్ మార్టిన్ మాదిరిగా అనిపిస్తుంది. రీడిజైన్డ్ హెడ్‌ల్యాంప్స్ (ఈ కాన్సెప్ట్ లోని ఎల్ఈడి ల్యాంప్స్ ప్రొడక్షన్ వెర్షన్‌లో ఉండకపోవచ్చు), కొత్త బంపర్స్, కొత్త టెయిల్ ల్యాంప్ డిజైన్ వంటి మార్పులను ఇందులో ప్రధానంగా చెప్పుకోవచ్చు.

2015 ఫోర్డ్ ఫిగో

ఈ కొత్త ఫోర్డ్ ఫిగో కారును బి562 అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తున్నారు. దీనిని బూ2ఈ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయనున్నారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీని తయారు చేస్తున్నారు. అంతేకాదు, ఇదే ప్లాట్‌ఫామ్‌పై ఫోర్డ్ ఫిగోను ఆధారంగా చేసుకొని ఓ కాంపాక్ట్ సెడాన్‌ను కూడా తయారు చేయనున్నారు. ఇది ప్రస్తుత ఫోర్డ్ క్లాసిక్ స్థానాన్ని భర్తీ చేయనుంది.

2015 ఫోర్డ్ ఫిగో

కొత్త 2015 ఫోర్డ్ ఫిగో కారులో యాంత్రికపరంగా కూడా మార్పులు ఉండే అవకాశం ఉంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఇందులో ఫోర్డ్ నుంచి అత్యంత పాపులర్ అయిన 1.0 లీటర్ ఈకోబూస్ట్ పెట్రోల్ ఇంజన్‌ను అలాగే 1.5 లీటర్ టిడిసిఐ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది.

2015 ఫోర్డ్ ఫిగో

కొత్త 2015 ఫోర్డ్ ఫిగో కారును గుజరాత్‌లోని సనంద్‌లో ఫోర్డ్ ఇండియా నిర్మిస్తున్న కొత్త ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నారు. సరమైన ధర, ఈకోబూస్ట్ ఇంజన్, మోడ్రన్ డిజైన్‌లో ఇది కొనుగోలుదారులను ఆకట్టుకోనుంది.

Most Read Articles

English summary
The next gen Ford Figo, also sold as Ka in other markets including South America, has been revealed in concept form in Brazil. In its concept guise the 2015 model year Ka reveals what is to become the next-gen Figo that will be launched in India either late next year or early 2015.
Story first published: Thursday, November 14, 2013, 12:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X