ఆటో ఎక్స్‌పో 2014: అప్‌గ్రేడెడ్ ఫోర్డ్ ఫియస్టా విడుదల

By Ravi

అమెరికన్ కార్ మేకర్ ఫోర్డ్ అందిస్తున్న ఫియస్టా సెడాన్‌లో ఓ సరికొత్త రిఫ్రెష్డ్ వెర్షన్‌ను 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ఫోర్డ్ తొలిసారిగా ఈ మోడల్‌ను గడచిన సంవత్సరం చివర్లో బ్రెజిల్‌లో జరిగిన సావ్ పాలో ఆటో షోలో అమెరికన్ మార్కెట్ కోసం రూపొందించిన 2013 ఫోర్డ్ ఫియస్టా సెడాన్‌ను కంపెనీ ఆవిష్కరించింది.

ఇదే మోడల్‍ను ఆధారంగా చేసుకొని ఫోర్డ్ తమ ఫియస్టా సెడాన్‌ను ఇండియన్ మార్కెట్‌కు అనుగుణంగా మోడిఫై చేసింది. అమెరికన్ వెర్షన్ ఫియస్టాతో పోల్చుకుంటే, ఇండియన్ వెర్షన్ ఫియస్టాలో ఫీచర్లలో తప్ప డిజైన్ పరంగా పెద్దగా చెప్పుకోదగిన మార్పులేవీ లేవు.

కొత్త ఫోర్డ్ ఫియస్టాకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

అప్‌గ్రేడెడ్ ఫోర్డ్ ఫియస్టా

కొత్త ఫోర్డ్ ఫియస్టాలో సరికొత్త ఫ్రంట్ గ్రిల్, ఎయిర్-డ్యామ్స్, వీల్ అర్చెస్, ఫ్రంట్ బానెట్‌పై కనిపించే బాడీ లైన్స్ వంటి మార్పుల వల ఈ కారు మంచి స్పోర్టీ లుక్‌ను కలిగి ఉంటుంది.

అప్‌గ్రేడెడ్ ఫోర్డ్ ఫియస్టా

దీని హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్‌ను రీడిజైన్ చేశారు. అయితే సైడ్ ప్రొఫైల్‌లో మాత్రం పెద్దగా చెప్పుకోదగిన మార్పులు ఏవీ లేవు. సరికొత్త డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్, కొద్దిగా మార్పు చేసిన వీల్ ఆర్చెస్‌లు చెప్పుకోదగిన మార్పులు. మొత్తమ్మీద సైడ్ నుంచి చూస్తే 2011 ఫియస్టాకు, 2013 ఫియస్టాకు పెద్దగా మార్పు అనిపించదు.

అప్‌గ్రేడెడ్ ఫోర్డ్ ఫియస్టా

ఇక వెనుక వైపు డిజైన్ విషయానికి వస్తే, సరికొత్త టెయిల్ ల్యాంప్ క్లస్టర్, రీడిజైన్ చేయబడిన రియర్ బూట్ డోర్, రియర్ బంపర్‌లు చెప్పుకోదగినవి. ఇంకా ఇందులో, ఎలక్ట్రానికి స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పి), ముందు వైపు డ్యూయెల్ స్టేజ్ ఎయిర్‌బ్యాగ్స్, డ్రైవర్ క్నీ ఎయిర్‌బ్యాగ్ (మోకాలు రక్షణ కోసం), అధనపు భద్రత కోసం సైడ్ ఇంపాక్ట్ అండ్ సైడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి భద్రతా ఫీచర్లు ఈ కారు సొంతం.

అప్‌గ్రేడెడ్ ఫోర్డ్ ఫియస్టా

సురక్షితమైన మరియు సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం ఇది ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)తో లభిస్తుంది. ఇంకా, కారు దొంగతనానికి గురికాకుండా ఉండేందుకు రూపొందించిన యాంటీ-థెఫ్ట్ మెకానిజం, టైరులో గాలిని గుర్తించే టైర్ ప్రెజర్ మోనిటరింగ్ వంటివి అధనపు ఫీచర్లను జోడించారు.

Most Read Articles

English summary
US based auto major Ford India has revealed the facelifted Fiesta seda today at the Auto Expo 2014. Take a look.
Story first published: Wednesday, February 5, 2014, 12:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X