ఏ గేరులో నడుపుతున్నారో చూపించే 'గేర్ షిఫ్టర్ నాబ్'

మీ ఏ గేరులో కారు నడుపుతున్నారో మీకు తెలుసా..? ఒక్కోసారి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏ గేరులో వెళ్తున్నామో తెలుసుకోవటం కష్టమవుతుంది. అందుకే, మనం ఏ గేరులో వెళుతున్నామో డిజిటల్‌గా తెలిపేలా డిజిటల్ డిస్‌ప్లేతో కూడిన గేర్‌ నాబ్‌ను తయారు చేసింది చైనాకు చెందిన గ్యాస్‌‌లాక్ కంపెనీ. 'ఇండికేటర్' (Indy-Cator)గా పిలిచే ఈ యూనివర్సల్ ఎల్‌సిడి గేర్ డిస్‌ప్లే నాబ్‌ను మ్యాన్యువల్ గేర్‌బాక్సుల కోసం తయారు చేశారు.

గేర్ నాబ్‌పై ఉండే డిజిటల్ డిస్‌ప్లే ద్వారా మనం ఏ గేరులో వాహనం నడుపుతున్నది సులువుగా తెలుసుకునే వీలుంటుంది. డ్రైవింగ్ సమయంలో మరింత సురక్షితను, మంచి ఫ్యూయెల్ ఎఫీషియన్సీని సాధించేందుకు దోహతపడుతుందని తయారీదారులు చెబుతున్నారు.


ఈ ఇండికేటర్ డిజిటల్ ఎల్‌సిడి గేర్ నాబ్ విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు తమ కారు ఇంటీరియర్ స్టయిల్‌కు తగినట్లుగా ఇండికేటర్ గేర్ నాబ్‌ను ఎంచుకోవచ్చు.

ఇండికేటర్ గేర్ నాబ్‌ను ఆన్‌బోర్డ్ నెట్‌వర్క్‌లో ఇన్‌స్టాల్ చేయటం కూడా చాలా సులువు. కొత్తగా వచ్చిన బ్లాక్ ఎడిషన్ గేర్ నాబ్ సాఫ్ట్ టచ్ సర్ఫేస్‌ను కలిగి ఉండి సున్నితంగా గేరు మార్చేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో ఎల్‌సిడి డిస్‌ప్లే చుట్టూ ఉండే శాటిన్ క్రోమ్ ప్లేటెడ్ అల్యూమినియం రింగ్ ప్రీమియం లుక్‌నిస్తుంది. ఇది ఎలాంటి కారు ఇంటీరియర్ స్టయిల్‌కైనా ఫిట్ అవుతుంది.

Gaslock Indy Cator Gear Knob 3

కారు మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌లోని గేర్ నాబ్‌ను ఈ ఇండికేటర్ గేర్ నాబ్‌తో రీప్లేస్ చేసుకుంటే, మీరు ఏ గేరును ఉపయోగిస్తూన్నారోనని ఇది బ్లూ లేదా గ్రీన్ ఎల్ఈడి డిస్‌ప్లేతో చూపిస్తుంది. కొత్తగా కారు నడిపే వారికి ఈ డిజిటల్ గేర్ నాబ్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అనుభవజ్ఞులైన డ్రైవర్లు తాము ఏ గేరులో కారును నడుపుతున్నారనేది వారికి సులువుగానే తెలిసిపోతుంది.

అయితే, ఈ ఇండికేటర్ గేర్ నాబ్‌ను ఉపయోగించడం వలన ఇది ప్రస్తుతం ఉపయోగిస్తున్న గేర్ గురించి విజువల్ రిమైండర్‌ను ఇచ్చి, మైలేజ్ పెంచుకునేందుకు దోహదపడుతుంది. మైలేజ్ విషయంలో ఇంజన్ వేగం కీలకమైన అంశం. అడాప్టెడ్ డ్రైవింగ్ స్టైల్ ద్వారా 15 శాతం ఇంధన వినియోగాన్ని తగ్గించుకునేందుకు ఈ ఇండికేటర్ గేర్ నాబ్ సహకరిస్తుంది.

Indy Cator Gear Knob

కారు బ్రాండ్‌తో సంబంధం లేకుండా, సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (రివర్స్ గేర్ లాకింగ్ మెకానిజంతో కూడిన గేర్ లివర్స్ కోసం మినహా) వరకు ఇది అన్నిరకాల మ్యాన్యువల్ గేర్‌బాక్సులకు సెట్ అవుతుంది.
Most Read Articles

English summary
GASLOCK has presented the INDY-CATOR at the “2009 Shanghai Show” for the first time in Asia. You can get the first shifter knob with digital gear-display with different display colors and different styles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X