ఫేస్‌లిఫ్ట్ కాప్టివాను విడుదల చేసిన జనరల్ మోటార్స్

By Ravi

అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న కాప్టివా ఎస్‌యూవీలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 2013 జెనీవా మోటార్ షోలో జనరల్ మోటార్స్ తొలిసారిగా అప్‌గ్రేడెడ్ కాప్టివాను ఆవిష్కరించింది.

కొత్త 2013 చెవర్లే కాప్టివా ఇప్పుడు మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఎల్‌టి వేరియంట్), ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (ఎల్‌టిజెడ్ వేరియంట్) ఆప్షన్లతో అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో విడుదలైన అప్‌గ్రేడెడ్ చెవర్లే కాప్టివా ప్రారంభ ధర రూ.23.50 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

ఈ సరికొత్త చెవర్లే కాప్టివా ఎస్‌యూవీకి సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఇంజన్స్

ఇంజన్స్

చెవర్లే కాప్టివా ఎస్‌యూవీలో 2.2 లీటర్, ఫోర్ సిలిండర్, విసిడిఐ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు, ఇది గరిష్టంగా 188 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మరొక డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. అది, 2.0 లీటర్ డీజిల్ ఇంజన్. ఈ రెండు ఇంజన్లు కూడా ఆల్-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్‌లో లభ్యం కానున్నాయి.

ఎక్స్టీరియర్స్

ఎక్స్టీరియర్స్

కొత్త 2013 చెవర్లే కాప్టివా ఎక్స్టీరియర్ మార్పుల విషయానికి వస్తే, కొత్త లో బంపర్, కొత్త ఫాగ్‌ల్యాంప్స్, క్రోమ్ గార్నిష్, కొత్త డిజైన్, కొత్త క్రోమ్ ఫినిష్డ్ ఫ్రంట్ గ్రిల్, కొత్త ఎల్ఈడి స్టాప్ టెయిల్ లైట్స్, 18-ఇంచ్ 6-స్పోక్ అల్లాయ్ వీల్స్ వంటి మార్పులను ప్రధానంగా గమనించవచ్చు.

ఇంటీరియర్స్

ఇంటీరియర్స్

అలాగే, ఇంటీరియర్లను గమనిస్తే, సరికొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, జెట్ బ్లాక్ లెథర్ సీట్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్, హై-ఎండ్ మ్యూజిక్ సిస్టమ్ వంటి మార్పులున్నాయి.

ఇంటెలిజెంట్ ఫీచర్స్

ఇంటెలిజెంట్ ఫీచర్స్

సాంకేతికపరమైన అప్‌గ్రేడ్స్ అంశం తీసుకుంటే, ఈ కొత్త కాప్టివాలో ట్రాక్షన్ కంట్రోల్, డీసెంట్ కంట్రోల్, రియర్ పార్క్ అసిస్ట్ సిస్టమ్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, క్రూయిజ్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లున్నాయి.

వేరియంట్లు - ధరలు

వేరియంట్లు - ధరలు

2013 చెవర్లే కాప్టివా ఎల్‌టి (మ్యాన్యువల్) - రూ.23.50 లక్షలు

వేరియంట్లు - ధరలు

వేరియంట్లు - ధరలు

2013 చెవర్లే కాప్టివా ఎల్‌టిజెడ్ (ఆటోమేటిక్) - రూ.26.00 లక్షలు

Most Read Articles

English summary
Amidst all the troubles GM India is presently facing it has managed to introduce the Chevrolet Captiva facelift in India, but it decided to do so with zero fanfare. The only indication is the updated Chevy website.
Story first published: Friday, August 16, 2013, 12:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X