2015 జెనీవా మోటార్ షో: నిస్సాన్ స్వే కాన్సెప్ట్ కారు ఆవిష్కరణ

By Ravi

మార్చ్ 3, 2015వ తేదీ నుంచి ప్రారంభమైన అంతర్జాతీయ జెనీవా మోటార్ షోలో అనేక కార్ కంపెనీలు సరికొత్త కాన్సెప్ట్ వాహనాలను ఆవిష్కరిస్తున్నాయి. తాజాగా జపాన్‌కి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ కూడా ఇదివరకు టీజ్ చేసిన తమ సరికొత్త కాన్సెప్ట్ కారు 'నిస్సాన్ స్వే' (Nissan Sway) పరదాలను ఈ ఆటో షోలో తొలగించింది.

ప్రస్తుతం నిస్సాన్ అందిస్తున్న మైక్రా హ్యాచ్‌బ్యాక్‌కు ఇది ఓ కంప్లీట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అనే పుకార్లు వినిపిస్తున్నాయి. నిస్సాన్ స్వే కాన్సెప్ట్ కారు చూడటానికి చాలా ఫ్యూచరిస్టిక్ లుక్‌ని, మోడ్రన్ డిజైన్‌ని కలిగి ఉంటుంది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

2015 జెనీవా మోటార్ షో: నిస్సాన్ స్వే కాన్సెప్ట్ కారు ఆవిష్కరణ

నిస్సాన్ స్వే కాన్సెప్ట్ కారును సరికొత్త డిజైన్ లాంగ్వేజ్‌తో తీర్చిదిద్దారు. ఈ కారును ఆధారంగా చేసుకొని నెక్స్ట్ జనరేషన్ మైక్రా కారును యూరప్‌లో డిజైన్ చేసే అవకాశం ఉంది.

2015 జెనీవా మోటార్ షో: నిస్సాన్ స్వే కాన్సెప్ట్ కారు ఆవిష్కరణ

నిస్సాన్ స్వే కాన్సెప్ట్ కారులోని వి-మోషన్ గ్రిల్ అండ్ బంపర్స్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్ అండ్ డేటైమ్ రన్నింగ్ లైట్స్ చాలా ఆకర్షనీయంగా కనిపిస్తాయి.

2015 జెనీవా మోటార్ షో: నిస్సాన్ స్వే కాన్సెప్ట్ కారు ఆవిష్కరణ

ఫ్లోయింగ్ డిజైన్ థీమ్‌తో నిస్సాన్ స్వే కాన్సెప్ట్ కారును డిజైన్ చేశారు, ఫలితంగా ఈ కారు చలనంలో లేకపోయినప్పటికీ ఇది చలనంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇందులోని అల్లాయ్ వీల్స్ డిజైన్ కూడా చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది.

2015 జెనీవా మోటార్ షో: నిస్సాన్ స్వే కాన్సెప్ట్ కారు ఆవిష్కరణ

నిస్సాన్ స్వే రియర్ డిజైన్‌ను గమనిస్తే, దీని టెయిల్ ల్యాంప్స్‌ను బూమరాంగ్ నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసినట్లుగా అనిపిస్తుంది. వెనుక బంపర్‌లో కలిసిపోయినట్లుగా ఉండే డ్యూయెల్ ట్రాపేజోయిడల్ ఎగ్జాస్ట్ పోర్ట్స్ ఇందులో మరో అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.

2015 జెనీవా మోటార్ షో: నిస్సాన్ స్వే కాన్సెప్ట్ కారు ఆవిష్కరణ

నిస్సాన్ స్వే కాన్సెప్ట్ కారు ఇంటీరియర్స్ చాలా ఫ్యూచరిస్టిక్‌గా ఉంటాయి. దీని ఇంటీరియర్‌ను బట్టి చూస్తుంటే ఇదొక ఆటోమేటిక్ కారు అనిపిస్తుంది.

Most Read Articles

English summary
Nissan has unveiled it highly anticipated compact hatchback, the Sway. The vehicle has been revealed at 2015 Geneva Motor Show. It is a glimpse into the future product offerings by the Japanese manufacturer.
Story first published: Wednesday, March 4, 2015, 15:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X