2015 జెనీవా మోటార్ షో: శాంగ్‌యాంగ్ టివోలి గ్లోబల్ డెబ్యూ

By Ravi

భారత ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా స్వాధీనం చేసుకున్న కొరియన్ కార్ కంపెనీ శాంగ్‌యాంగ్, తమ మొట్టమొదటి కాంపాక్ట్ ఎస్‌యూవీ 'శాంగ్‌యాంగ్ టివోలి' (Ssangyong Tivoli)ని ఈ ఏడాది ఆరంభంలో దక్షిణ కొరియా మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా.. శాంగ్‌యాంగ్ ఈ గ్లోబల్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రస్తుతం జెనీవాలో జరుగుతున్న అంతర్జాతీయ ఆటో షోలో ప్రదర్శనకు ఉంచింది.

జెనీవాను వేదికగా చేసుకొని శాంగ్‌యాంగ్ తమ టివోలి కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రపంచానికి పరిచయం చేసింది. రానున్న రోజుల్లో ఈ మోడల్ మరిన్ని అంతర్జాతీయ మార్కెట్లలో లభ్యం కానుంది. కొరియాలో ఈ మోడల్‌కు ఇప్పటికే మంచి గిరాకీ ఉంది. గడచిన జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 10,000 యూనిట్లకు పైగా టివోలి కార్లను శాంగ్‌యాంగ్ విక్రయించింది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

2015 జెనీవా మోటార్ షో: శాంగ్‌యాంగ్ టివోలి గ్లోబల్ డెబ్యూ

శాంగ్‌యాంగ్ టివోలి డ్యూయెల్-టోన్ బాడీ, రూఫ్ ఆప్షన్స్ కలిగి ఉంటుంది. కార్ యజమానుల వ్యక్తిగత అభిరుచి ప్రకారం వీటిని ఎంచుకునే అవకాశం ఉంటుంది.

2015 జెనీవా మోటార్ షో: శాంగ్‌యాంగ్ టివోలి గ్లోబల్ డెబ్యూ

శాంగ్‌యాంగ్ టివోలి బ్లాక్, రెడ్, వైట్, సిల్వర్ బాడీ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కస్టమర్లు ఈ కలర్ ఆప్షన్లకు తగినట్లుగా వింగ్ మిర్రర్స్, రూఫ్, రియర్ స్పాయిలర్‌లను కస్టమర్లు తమకు నచ్చిన కలర్‌లో ఎంచుకోవచ్చు.

2015 జెనీవా మోటార్ షో: శాంగ్‌యాంగ్ టివోలి గ్లోబల్ డెబ్యూ

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్లను అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దారు. ఇది 1795 మి.మీ. వెడల్పును (ఈ సెగ్మెంట్లో కెల్లా వెడల్పైనది) కలిగి ఉండి, విశాలమైన ఇంటీరియర్ స్పేస్‌ను ఆఫర్ చేస్తుంది. ఇందులో 423 లీటర్ల బూట్ స్పేస్ (ఈ సెగ్మెంట్లో కెల్లా ఎక్కువ)ను కలిగి ఉంటుంది.

2015 జెనీవా మోటార్ షో: శాంగ్‌యాంగ్ టివోలి గ్లోబల్ డెబ్యూ

ఇంకా ఇందులో ఫల్ ఫ్లాట్ ఫోల్డింగ్ సెకండ్ రో సీట్స్, డి-కట్ స్టీరింగ్ వీల్, 3.5 ఇంచ్ డిస్‌ప్లేతో కూడిన సిక్స్ కలర్ ఇన్ఫోటైన్‌మెంట్ క్లస్టర్, మూడు విభిన్న ఇంటీరియర్ కలర్ థీమ్స్ (రెడ్, బ్లాక్, బీజ్), సెమీ బకెట్ సీట్స్ వంటి కీలక ఫీచర్లున్నాయి.

2015 జెనీవా మోటార్ షో: శాంగ్‌యాంగ్ టివోలి గ్లోబల్ డెబ్యూ

శాంగ్‌యాంగ్ టివోలి కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఉపయోగించిన 1.6 లీటర్ ఇంజన్ గరిష్టంగా 126 పిఎస్‌ల శక్తిని, 160 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 12.3 కి.మీ. మైలేజీని, ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 12 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

2015 జెనీవా మోటార్ షో: శాంగ్‌యాంగ్ టివోలి గ్లోబల్ డెబ్యూ

ప్రతి టివోలి కాంపాక్ట్ ఎస్‌యూవీలో కూడా స్మార్ట్ స్టీర్ అనే ఫీచర్ ఉంటుంది. ఇందులో మూడు డ్రైవింగ్ మోడ్స్ (నార్మల్, కంఫర్ట్, స్పోర్ట్) ఉంటాయి. డ్రైవర్ తన ఇష్టానికి తగినట్లుగా ఈ డ్రైవింగ్ మోడ్స్‌ను ఎంచుకోవచ్చు.

2015 జెనీవా మోటార్ షో: శాంగ్‌యాంగ్ టివోలి గ్లోబల్ డెబ్యూ

శాంగ్‌యాంగ్ టివోలి మోడల్‌ను అత్యధిక ధృడత్వం కలిగిన (హెచ్ఎస్ఎస్) స్టీల్‌తో తయారు చేశారు. దీని బాడీ నిర్మాణంలో దాదాపు 71.4 శాతం ఈ మెటీరియల్‌నే ఉపయోగించారు. అలాగే, షాషీలో ఆల్ట్రాహై స్ట్రెన్త్ స్టీల్ (యూహెచ్ఎస్ఎస్)ను ఉపయోగించారు. దీని ఫలితంగా, ఇది ఈ సెగ్మెంట్లో కెల్లా ధృడమైన కారుగా ఉంటుంది.

2015 జెనీవా మోటార్ షో: శాంగ్‌యాంగ్ టివోలి గ్లోబల్ డెబ్యూ

సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో పెద్ద డిస్క్ బ్రేక్‌లు, మల్టీ ఫంక్షనల్ ఈఎస్‌పి (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, టిపిఎమ్ఎస్ (టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్), ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, ఏబిఎస్, ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లున్నాయి.

2015 జెనీవా మోటార్ షో: శాంగ్‌యాంగ్ టివోలి గ్లోబల్ డెబ్యూ

ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే.. దీనిని మోడ్రన్ స్మార్ట్ ఫోన్లతో కనెక్ట్ చేసుకునే విధంగా డిజైన్ చేయబడి ఉంటుంది. ఇందులో 7-ఇంచ్ డిస్‌ప్లేతో కూడిన టచ్‌స్క్రీన్ ఉంటుంది. ఇది ఇన్ఫోటైన్‌మెంట్‌గానే కాకుండా రివర్స్ పార్కింగ్ సిస్టమ్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఇందులోని ఆరు స్పీకర్లు అత్యుత్తమ ఆడియో అనుభూతిని అందిస్తాయి.

Most Read Articles

English summary
South-Korean automobile manufacturer has launched its compact SUV the Tivoli in its home, at the beginning of 2015. Ssangyong had confirmed this model will be offered in several international markets. Now they have unveiled their Tivoli at 2015 Geneva Motor Show.
Story first published: Wednesday, March 4, 2015, 15:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X