గూగుల్ డ్రైవర్‌లెస్ కారులో మ్యాన్యువల్ కంట్రోల్స్ తప్పనిసరి!

By Ravi

ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఈ ఏడాది మే నెలలో తమ డ్రైవర్ రహిత (డ్రైవర్‌లెస్ లేదా సెల్ఫ్ డ్రైవింగ్) ప్రోటోటైప్ కారును ఆవిష్కరించి, ఈ కారును అమెరికాలో సామాన్య ప్రజానీకానికి డెమోనిస్ట్రేట్ చేసి చూపించిన సంగతి తెలిసినదే. అయితే, గూగుల్ కారుకు ఆదిలోనే చుక్కెదురైంది. గూగుల్ తయారు చేసిన ఈ కారులో స్టీరింగ్, బ్రేక్స్, యాక్సిలరేటర్‌లు ఉండవు, అవన్నీ యాంత్రికంగా నియంత్రించబడుతాయి. ఇప్పుడే ఇదే గూగుల్ కార్లను రోడ్లపై అనుమతించేందుకు అడ్డంకిగా మారుతోంది.

డ్రైవర్‌లెస్ కారైనా సరే, అందులో తప్పనిసరిగా మ్యాన్యువల్ కంట్రోల్ ఉండాల్సిందేనని కాలిఫోర్నియాకి చెంది మోటార్ వాహనాల విభాగం ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ అవసరమైనప్పుడు డ్రైవర్ కారును తన స్వతహాగా కంట్రోల్ చేసే విధంగా మ్యాన్యువల్ కంట్రోల్స్‌‍ను కూడా ఇలాంటి అటానమస్ (డ్రైవర్ రహిత) కార్లలో ఏర్పాటు చేయాలని వారు సూచించారు. ఈ నేపథ్యంలో గూగుల్ తమ డ్రైవర్‌లెస్ కారును తిరిగి మరోసారి మ్యాన్యువల్ కంట్రోల్స్‌ను చేర్చి అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గూగుల్ కాలిఫోర్నియాకు చెందిన టెక్ దిగ్గజం శాంటా క్లారాతో చేతులు కలిపి ఈ ప్రోటోటైప్ కారును తయారు చేసింది. ఈ డ్రైవర్‌లెస్ కారుకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

గూగుల్ డ్రైవర్‌లెస్ కారు

కాలిఫోర్నియాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం శాంటా క్లారాతో కలిసి గూగుల్ ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ప్రోటోటైప్‌ను డిజైన్ చేసింది. ఇది బగ్ (పేడ పురుగు) ఆకారంలో ఉంటుంది.

గూగుల్ డ్రైవర్‌లెస్ కారు

గూగుల్ తయారు చేసిన ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కారులో స్టీరింగ్ వీల్, బ్రేక్స్, యాక్సిలరేటర్ ఉండవు. ఇవన్నీ కూడా కారులో ఉండే సాఫ్ట్‌వేర్, మెకానిక్స్ ద్వారా కంట్రోల్ చేయబడుతాయి. కానీ, ఈ విషయాన్ని కాలిఫోర్నియా మోటార్ వాహన అధికారులు అంగీకరించడం లేదు. ఇందులో తప్పనిసరిగా మ్యాన్యువల్ కంట్రోల్స్ ఉండి తీరాల్సిందేనని వారు కోరుతున్నారు.

గూగుల్ డ్రైవర్‌లెస్ కారు

కారు పైభాగంలో మరియు ముందు వెనుక భాగాల్లో సెన్సార్లు, హెచ్‌డి సరౌండ్ కెమెరాలను ఇందులో ఉపయోగించారు. వీటి సాయంతో పాటుగా మ్యాప్స్ సాయంతో కారు దానంతట అదే దిశానిర్దేశం చేసుకుంటుంది. అయితే, కొత్తగా డెవలప్ చేయబోయే కారును రెగ్యులర్ కారు మాదిరిగానే డ్రైవర్ జోక్యంతో మ్యాన్యువల్‌గా డ్రైవ్ చేసుకునే వెసలుబాటు ఉంటుంది.

గూగుల్ డ్రైవర్‌లెస్ కారు

గూగుల్ తయారు చేసిన ఈ అటానమస్ కారులో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. ఇందులో కూర్చున్న వారు చేయాల్సిందల్లా రెండు సీట్లకు మధ్యలో ఉన్న స్టార్ట్/స్టాప్ బటన్‌ను ప్రెస్ చేయటమే.

గూగుల్ డ్రైవర్‌లెస్ కారు

గూగుల్ కారు ఇంటీరియర్స్‌ను చాలా సింపుల్‌గా ఉంచారు. ఇందులో ప్యాసింజర్ సీట్ల ముందు కొంత లగేజ్ ఉంచుకునేందుకు స్థలం ఉంటుంది.

గూగుల్ డ్రైవర్‌లెస్ కారు

కారు ఏ రూట్లో వెళ్తుందో తెలిపేందుకు ఓ పెద్ద స్క్రీన్ ఉంటుంది. ప్రారంభ దశ కావటంతో ఈ డ్రైవర్ రహిత కారును వేగాన్ని గంటకు గరిష్టం 25 మైళ్ల (40 కెఎమ్‌పిహెచ్)కు మాత్రమే పరిమితం చేశారు.

గూగుల్ డ్రైవర్‌లెస్ కారు

అయితే, గూగుల్ కో-ఫౌండర్ సెర్గీ బ్రిన్ తెలిపిన సమాచారం ప్రకారం, భవిష్యత్తులో ప్రొడక్షన్ మోడల్‌ను గరిష్టంగా గంటకు 100 మైళ్ల (160 కెఎమ్‌పిహెచ్) వేగంతో పరుగులు తీసేలా అభివృద్ధి చేయనున్నారు.

గూగుల్ డ్రైవర్‌లెస్ కారు

ప్రస్తుతం గూగుల్ డ్రైవర్‌లెస్ కారు టెస్టింగ్ దశలో ఉంది. ఈ మోడల్‌ను సాధారణ రోడ్లపై టెస్ట్ చేసేందుకు గూగుల్‌కు ఆమోదం కూడా లభించినప్పటికీ, తాజాగా వీటికి మ్యాన్యువల్ కంట్రోల్స్ ఉండాలనే మెలిక పెట్టడంతో ఈ కార్ల టెస్టింగ్ మరికొంత కాలం జాప్యమయ్యే ఆస్కారం ఉంది.

గూగుల్ డ్రైవర్‌లెస్ కారు

గూగుల్ త్వరలోనే ఇలాంటి 100 ప్రోటోటైప్ కార్లను తయారు చేయనుంది. టెస్టింగ్ దశ విజయవంతంగా పూర్తయ్యి, అన్ని సెక్యూరిటీ సమస్యలు పరిష్కరించబడినట్లయితే, మరో రెండేళ్లలోనే ఇవి మనకు అందుబాటులోకి వస్తాయి.

వీడియో

గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ప్రోటోటైప్ డెమోను మీరు కూడా ఈ వీడియోలో చూడండి.

Most Read Articles

English summary
The "auto" in Google's autonomous car program may be forced to be a little downgraded because of a ruling by California's Department of Motor Vehicles, which requires drivers to able to take "immediate physical control" of the vehicle if necessary.
Story first published: Monday, August 25, 2014, 17:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X