స్టీరింగ్ లేదు.. యాక్సిలరేటర్ లేదు.. బ్రేక్స్ లేవు.. ఇదేం కారు?

అంతర్జాల దిగ్గజం గూగుల్ గత కొంత కాలంగా డ్రైవర్ రహిత (డ్రైవర్‌లెస్ లేదా సెల్ఫ్ డ్రైవింగ్) కార్లను అభివృద్ధి చేసే పనిలో ఉన్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, గూగుల్ తమ తొలి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ప్రోటోటైప్‌ను ఆవిష్కరించింది. అంతేకాదు, గూగుల్ ఈ కారును సామాన్య ప్రజానీకానికి డెమోనిస్ట్రేట్ కూడా చేసి చూపించింది.

ఇప్పటికే అనేక ఆటోమొబైల్ కంపెనీలు డ్రైవర్ రహిత కార్లను అభివృద్ధి చేస్తున్నాయి. అయితే, అవన్నీ కూడా ఇప్పటికే అందుబాటులో ఉన్న కార్లను మోడిఫై చేసి డ్రైవర్ రహిత కార్లుగా మారుస్తున్నాయి. కానీ గూగుల్ మాత్రం పూర్తిగా ప్రారంభ దశ నుంచి ఓ కారును తయారు చేసింది. ఇందుకోసం గూగుల్ కాలిఫోర్నియాకు చెందిన టెక్ దిగ్గజం శాంటా క్లారాతో చేతులు కలిపింది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ప్రోటోటైప్ ఆవిష్కరణ

కాలిఫోర్నియాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం శాంటా క్లారాతో కలిసి గూగుల్ ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ప్రోటోటైప్‌ను డిజైన్ చేసింది. ఇది బగ్ ఆకారంలో ఉంటుంది.

గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ప్రోటోటైప్ ఆవిష్కరణ

గూగుల్ తయారు చేసిన ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కారులో స్టీరింగ్ వీల్, బ్రేక్స్, యాక్సిలరేటర్ ఉండవు. ఇవన్నీ కూడా కారులో ఉండే సాఫ్ట్‌వేర్, మెకానిక్స్ ద్వారా కంట్రోల్ చేయబడుతాయి.

గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ప్రోటోటైప్ ఆవిష్కరణ

కారు పైభాగంలో మరియు ముందు వెనుక భాగాల్లో సెన్సార్లు, హెచ్‌డి సరౌండ్ కెమెరాలను ఇందులో ఉపయోగించారు. వీటి సాయంతో పాటుగా మ్యాప్స్ సాయంతో కారు దానంతట అదే దిశానిర్దేశం చేసుకుంటుంది.

గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ప్రోటోటైప్ ఆవిష్కరణ

ఈ కారులో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. ఇందులో కూర్చున్న వారు చేయాల్సిందల్లా రెండు సీట్లకు మధ్యలో ఉన్న స్టార్ట్/స్టాప్ బటన్‌ను ప్రెస్ చేయటమే.

గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ప్రోటోటైప్ ఆవిష్కరణ

గూగుల్ కారు ఇంటీరియర్స్‌ను చాలా సింపుల్‌గా ఉంచారు. ఇందులో ప్యాసింజర్ సీట్ల ముందు కొంత లగేజ్ ఉంచుకునేందుకు స్థలం ఉంటుంది.

గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ప్రోటోటైప్ ఆవిష్కరణ

కారు ఏ రూట్లో వెళ్తుందో తెలిపేందుకు ఓ పెద్ద స్క్రీన్ ఉంటుంది. ప్రారంభ దశ కావటంతో ఈ డ్రైవర్ రహిత కారును వేగాన్ని గంటకు గరిష్టం 25 మైళ్ల (40 కెఎమ్‌పిహెచ్)కు మాత్రమే పరిమితం చేశారు.

గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ప్రోటోటైప్ ఆవిష్కరణ

అయితే, గూగుల్ కో-ఫౌండర్ సెర్గీ బ్రిన్ తెలిపిన సమాచారం ప్రకారం, భవిష్యత్తులో ప్రొడక్షన్ మోడల్‌ను గరిష్టంగా గంటకు 100 మైళ్ల (160 కెఎమ్‌పిహెచ్) వేగంతో పరుగులు తీసేలా అభివృద్ధి చేయనున్నారు.

గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ప్రోటోటైప్ ఆవిష్కరణ

ప్రస్తుతం గూగుల్ డ్రైవర్‌లెస్ కారు టెస్టింగ్ దశలో ఉంది. ఈ మోడల్‌ను సాధారణ రోడ్లపై టెస్ట్ చేసేందుకు గూగుల్‌కు ఆమోదం కూడా లభించింది. మరికొంత కాలం పాటు గూగుల్ ఈ కార్లను టెస్టింగ్ చేయనుంది.

గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ప్రోటోటైప్ ఆవిష్కరణ

గూగుల్ త్వరలోనే ఇలాంటి 100 ప్రోటోటైప్ కార్లను తయారు చేయనుంది. టెస్టింగ్ దశ విజయవంతంగా పూర్తయ్యి, అన్ని సెక్యూరిటీ సమస్యలు పరిష్కరించబడినట్లయితే, మరో రెండేళ్లలోనే ఇవి మనకు అందుబాటులోకి వస్తాయి.

వీడియో

గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ప్రోటోటైప్ డెమోను మీరు కూడా ఈ వీడియోలో చూడండి.

Most Read Articles

English summary
Google has been working on self driving cars for quite some time now and the search giant has also demonstrated the still developing technology in test cars. However, till now, these have been donor cars, modified to run as autonomous vehicles. What Google has now done is different because it has built its own car specifically for the purpose and demonstrated it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X