గుల్ పనాగ్‌కి ఆమె భర్త ఇచ్చిన కానుకేంటో తెలుసా..?

ప్రముఖ బాలీవుడ్ నటి గుల్ పనాగ్ ఇటీవలే తన భర్త నుంచి ఓ 'స్వచ్ఛమైన' కానుకను అందుకుంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రమోట్ చేయాలనే ఉద్దేశ్యంతో గుల్ పనాగ్ భర్త రిషి అట్టారి ఆమెకు ఓ 'మహీంద్రా ఈ2ఓ' ఎలక్ట్రిక్ కారును కానుకగా ఇచ్చారు. ఇప్పటి వరకూ ఆడి వంటి విలాసవంతమైన కార్లను నడిపిన గుల్ పనాగ్ ఇకపై ఈ2ఓ ఎలక్ట్రిక్ కారులో ప్రయాణించనున్నారు.

ఇది కూడా చదవండి: మహీంద్రా ఈ2ఓ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

మహీంద్రా ఈ2ఓ ప్రీమియం వేరియంట్‌లో ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, లాంగ్ రేంజ్ (ఒక్కసారి చార్జింగ్ చేస్తే 120 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు), ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, రియర్ కెమెరా, పార్కింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లున్నాయి. మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

గుల్ పనాగ్ మహీంద్రా ఈ2ఓ

భర్త కానుకగా ఇచ్చిన మహీంద్రా ఈ2ఓ కారుతో ఫొటోలకు ఫొజిలిస్తున్న సెలబ్రిటీ గుల్ పనాగ్. తర్వాతి స్లైడ్‌లలో ఈ2ఓ విశిష్టతలను తెలుసుకోండి.

గుల్ పనాగ్ మహీంద్రా ఈ2ఓ

మహీంద్రా ఈ2ఓ కారులోని ఎలక్ట్రిక్ మోటార్లు లిథియం ఐయాన్ బ్యాటరీలతో పనిచేస్తాయి. ఈ బ్యాటరీలు సాంప్రదాయ యాసిడ్ బ్యాటరీలతో పోల్చుకుంటే 4 రెట్లు తేలికైనవి మరియు 3 రెట్లు సౌకర్యవంతమైనవి. అంతేకాకుండా ఇవి మంచి పెర్ఫామెన్స్‌ను, ధీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉంటాయి.

గుల్ పనాగ్ మహీంద్రా ఈ2ఓ

మహీంద్రా ఈ2ఓ కేవలం 5 గంటల్లోనే పూర్తిగా ఛార్జ్ అవుతుంది. పూర్తి ఛార్జ్‌పై 100 కిలోమీటర్ల రేంజ్ వరకూ ప్రయాణించవచ్చు (లాంగ్ రేజ్ 120 కి.మీ. ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. అలాగే క్విక్ చార్జింగ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో ఉపయోగించిన బ్యాటరీల శక్తి సాధారణ సెల్‌ఫోన్లలో ఉపయోగించే 3-4 వేల బ్యాటరీలలో ఉండే శక్తితో సమానం.

గుల్ పనాగ్ మహీంద్రా ఈ2ఓ

ఈ కారును ఐఫోన్, ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ వంటి స్మార్ట్ ఫోన్లతో కనెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్ ద్వారా మహీంద్రా ఈ2ఓ కారును కంట్రోల్ చేయవచ్చు. ఒకవేళ పార్కింగ్ స్థలంలో కారును లాక్ చేయటం మర్చిపోయి వెళ్లిపోతే స్మార్ట్ ఫోన్ మొబైల్ స్క్రీన్‌పై ఒక్క బటన్‌ను ప్రెస్ చేయటం ద్వారా కారును లాక్ చేయవచ్చు.

గుల్ పనాగ్ మహీంద్రా ఈ2ఓ

ఈ కారును ఐఫోన్, ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ వంటి స్మార్ట్ ఫోన్లతో కనెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్ ద్వారా మహీంద్రా ఈ2ఓ కారును కంట్రోల్ చేయవచ్చు. ఒకవేళ పార్కింగ్ స్థలంలో కారును లాక్ చేయటం మర్చిపోయి వెళ్లిపోతే స్మార్ట్ ఫోన్ మొబైల్ స్క్రీన్‌పై ఒక్క బటన్‌ను ప్రెస్ చేయటం ద్వారా కారును లాక్ చేయవచ్చు.

గుల్ పనాగ్ మహీంద్రా ఈ2ఓ

ఈ కారులో 6.2 ఇంచ్ టచ్‌స్క్రీన్ మల్టీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఎమ్‌పి3, ఆడియో వీడియో ప్లేయర్ మాదిరిగా పనిచేయటమేకాకుండా, కారులోని కంప్యూటింగ్ సిస్టమ్‌కు దీనిని అనుసంధానం చేయటం జరుగుతుంది. ఇది నావిగేషన్ సిస్టమ్‌లా కూడా పనిచేస్తుంది.

గుల్ పనాగ్ మహీంద్రా ఈ2ఓ

ఈ అధునాత నావిగేషన్ సిస్టమ్ సాయంతో, కారులోని బ్యాటరీ సాయంతో ఎంత దూరం ప్రయాణించవచ్చు, ప్రయాణించే మార్గంలో ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడెక్కడున్నాయ్, సింగిల్ ట్రిప్‌లో ఎంత దూరం ప్రయాణించవచ్చు, రౌండప్‌ ట్రిప్‌లో ఎంత దూరం ప్రయాణించవచ్చు తదితర విషయాలను తెలుసుకోవచ్చు.

గుల్ పనాగ్ మహీంద్రా ఈ2ఓ

మహీంద్రా ఈ2ఓ పూర్తిగా ఆటోమేటిక్ కారు (క్లచ్‌, గేర్లు ఉండవు). ఇది కేవలం 3.9 మీటర్ల టర్నింగ్ రేడియస్‌ను మాత్రమే కలిగి ఉండి, సిటీ రోడ్లకు చక్కగా సరిపోతుంది. ఈ కారులో ఎత్తుగా ఉండే రోడ్లపై సౌకర్యవంతమైన ప్రయాణం కోసం హిల్ హోల్డ్ ఫీచర్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి

గుల్ పనాగ్ మహీంద్రా ఈ2ఓ

ఒకవేళ మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారులో బ్యాటరీ ఛార్జ్ పూర్తిగా ఖాలీ అయిపోతే, రివైవ్ అనే బటన్‌ను ప్రెస్ చేయటం ద్వారా సుమారు 8-10 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

Most Read Articles

English summary
Bollywood star Gul Panag gets a new “Mahindra Reva e2o” as birthday gift from her husband.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X