నాలుగో త్రైమాసికంలో రానున్న కాంపాక్ట్ అంబాసిడర్

By Ravi

హిందూస్థాన్ మోటార్స్ అందిస్తున్న అంబాసిడర్ కారులో ఓ కాంపాక్ట్ వేరియంట్‌ను విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్ స్పార్క్ ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ కాంపాక్ట్ అంబాసిడర్ కారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా హిందుస్థాన్ మోటార్స్ సీఈఓ ఉత్తమ్ బోస్ వెల్లడించారు.

పరిశ్రమ వర్గాల సమాచారం కాంపాక్ట్ వెర్షన్ అంబాసిడర్ రూ.4 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. హిందుస్థాన్ మోటార్స్ తమ అంబాసిడర్ పోర్ట్‌ఫోలియోను విస్తరించుకోవాలని యోచిస్తుంది. ఇందులో భాగంగానే, అంబాసిడర్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఓ పికప్ ట్రక్కును, ఓ కాంపాక్ట్ కారును అలాగే ఓ బిఎస్4 వెర్షన్ రెగ్యులర్ వెర్షన్ అంబాసిడర్‌ను మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం.

కాంపాక్ట్ అంబాసిడర్ గురించి మరింత సమాచారం కోసం క్రింది ఫొటో ఫీచర్‌‍ను పరిశీలించండి.

ఫొటో: రిస్ ఆక్స్‌‌ఫర్డ్

ఫొటో: రిస్ ఆక్స్‌‌ఫర్డ్

ఇతర భారతీయ కార్ కంపెనీల మాదిరిగానే హిందుస్థాన్ మోటార్స్ కూడా సబ్-ఫోర్ మీటర్ కాంపాక్ట్ కార్ సెగ్మెంట్లోని అవకాశాలను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఉత్తమ్ బోస్ తెలిపిన దాని ప్రకారం, కాంపాక్ట్ అంబాసిడర్ బూట్ స్పేస్‌ను తగ్గించనున్నామని అయితే, ఇది హ్యాచ్‌బ్యాక్ మాత్రం కాదని తెలిపారు. బహుశా ఇది కాంపాక్ట్ సెడాన్ అయి ఉండొచ్చని తెలుస్తోంది.

ఫొటో: డిసి డిజైన్స్ అంబాసిడర్ కారు

ఫొటో: డిసి డిజైన్స్ అంబాసిడర్ కారు

ప్రస్తుతం హిందూస్థాన్ మోటార్స్ దేశీయ విపణిలో అందిస్తున్న రెగ్యులర్ వెర్షన్ అంబాసిడర్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని మార్కెట్లో రానున్న ఈ కాంపాక్ట్ అంబాసిడర్ పొడవును 4 మీటర్ల కన్నా తక్కువగా ఉండేలా డిజైన్ చేయటం ద్వారా ఎక్సైజ్ సుంకపు రాయితీలను పొంది సరసమైన ధరకే ఈ కారును అందించాలని కంపెనీ యోచిస్తోంది.

ఫొటో: కలకత్తాలో అంబాసిడర్ టాక్సీ

ఫొటో: కలకత్తాలో అంబాసిడర్ టాక్సీ

ఈ కాంపాక్ట్ అంబాసిడర్ కారుకు సంబంధించిన పేరు, విడుదల తేది వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. వెరిటో, వెరిటో వైబ్ పేర్ల మాదిరిగానే అంబాసిడర్ కాంపాక్ట్ కారు పేరు కూడా, అంబాసిండర్ తర్వాత మరొక పేరు కలయికతో ఉండనుంది.

కొత్త ఫీచర్లు, మోడ్రన్ లుక్

కొత్త ఫీచర్లు, మోడ్రన్ లుక్

బోస్ తెలిపిన సమాచారం ప్రకారం, ప్రస్తుత తరం కార్లలో లభిస్తున్న అనేక అధునాత ఫీచర్లను ఈ కాంపాక్ట్ అంబాసిడర్ కారులోను చూడొచ్చట. దీని లుక్ కూడా మోడ్రన్‌గానే ఉంటుందని ఆయన అన్నారు. దీన్నిబట్టి చూస్తుంటే, యువతను టార్గెట్‌గా చేసుకొని ఈ కారును విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఫొటో: డిసి డిజైన్స్ అంబాసిడర్

ఫొటో: డిసి డిజైన్స్ అంబాసిడర్

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అంబాసిడర్ ఓ విఐపి కారు లాంటిది. ఈ మార్కెట్లలో ప్రస్తుతం అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో ప్రధానంగా సదరు మార్కెట్లలోని కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని ఈ కారును ఉండబోతుందని చెప్పారు.

Most Read Articles

English summary
The king of Indian roads, the mighty HM Ambassador will soon be accompanied by a compact version of itself. The update comes straight from the mouth of Uttam Bose, CEO of Hindustan Motors, as reported by TOI.
Story first published: Tuesday, July 23, 2013, 13:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X