హిటాచీ రోపిట్స్: సింగిల్ సీట్, డ్రైవర్‌లెస్ ఆటోమేటిక్ కార్

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ కంపెనీ హిటాచీ 'రోపిట్స్' (ROPITS - Robot for Personal Intelligent Transport System) అనే విశిష్టమైన సింగిల్-ప్యాసింజర్ ఆటోమేటిక్ వాహనాన్ని రూపొందించింది. ఈ వాహనాన్ని మనం నడపాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక రోబోట్ కారు. ఇది బ్యాటరీ పవర్‌తో నడుస్తుంది. మనం చేరుకోవాల్సిన గమ్యాన్యి ఇందులో ఫిక్స్ చేస్తే చాలు, మనల్ని సురక్షితంగా ఆ ప్రాంతానికి చేరవేస్తుంది ఈ హిటాచీ రోపిట్స్.

హిటాచీ రోపిట్స్ వాహనంలో శాటిలైట్‌కు అనుసంధానం చేయబడిన జిపిఎస్ వ్యవస్థ, గైరో సెన్సార్స్ మరియు లేజర్ సెన్సార్స్ ఉంటాయి. వీటి సాయంతో ఆటోమేటిక్‌గా డ్రైవర్ అవసరం లేకుండానే ముందుకు సాగిపోయి, అడ్డువచ్చే అవాంతరాలను దాటుకుంటూ పోతుంది. ఒకవేళ దీనిని మ్యాన్యువల్‌గా కంట్రోల్ చేయాలనుకుంటే, ఇందులో జాయ్‌స్టిక్ సాయంతో కంట్రోల్ చేయవచ్చు. హిటాచీ రోపిట్స్ గరిష్టంగా గంటకు 3.7 మైళ్ల వేగం (5.9 కి.మీ.)తో మాత్రమే ప్రయాణిస్తుంది.

హిటాచీ రోపిట్స్ తక్కువ వేగంతో, ఫుట్‌పాత్‌లు, పేవ్‌మెంట్‌ల పైనే వెళ్తుంది కాబట్టి, సాధారణ ఆటోమేటిక్ కార్లతో (సెల్ఫ్-డ్రైవింగ్ కార్లు) సేఫ్టీ ఫీచర్లతో రోపిట్స్‌కు పనిలేదు. హిటాచీ రోపిట్స్‌ను ఇప్పటికే జపాన్‌లో టెస్టింగ్ నిర్వహించారు. మరికొద్ది రోజుల్లోనే ఇది వాణిజ్య పరంగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తమ వాహనం కేవలం ప్యాసింజర్లను తరలించేందుకు మాత్రమే కాకుండా, వివిధ సర్వీసుల కోసం డెలివరీ వెహికల్‌గా ఉపయోగపడుతుందని హిటాచీ పేర్కొంది. బాగుంది కదూ ఈ బుజ్జి రోబో కారు..!

హిటాచీ రోపిట్స్

హిటాచీ రోపిట్స్

హిటాచీ రోపిట్స్

హిటాచీ రోపిట్స్

హిటాచీ రోపిట్స్

హిటాచీ రోపిట్స్

హిటాచీ రోపిట్స్

హిటాచీ రోపిట్స్

హిటాచీ రోపిట్స్

హిటాచీ రోపిట్స్

హిటాచీ రోపిట్స్

హిటాచీ రోపిట్స్

హిటాచీ రోపిట్స్

హిటాచీ రోపిట్స్

Most Read Articles

English summary
Hitachi has designed a eco-friendly single-seater urban vehicle called as ROPITS (Robot for Personal Intelligent Transport System). Hitachi ROPITS is a single-passenger autonomous vehicle meant to travel on sidewalks with a maximum speed of 5.9 kmph. It is equipped with GPS, gyro sensor and laser sensors.
Story first published: Thursday, March 21, 2013, 11:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X