హోండా బ్రయో, అమేజ్‌లలో బ్రేక్ సమస్య; రీకాల్

హోండా కార్స్ ఇండియా భారత్‌లో విక్రయించిన బ్రయో హ్యాచ్‌బ్యాక్, అమేజ్ కాంపాక్ట్ సెడాన్లలో బ్రేక్ సమస్య కారణంగా వాటిని రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. బ్రేక్ సిస్టమ్‌లో లోపం తలెత్తే నెపంతో ఈ మోడళ్లలో కొన్ని వేరియంట్లను రీకాల్ చేస్తున్నారు.

ఫిబ్రవరి 28, 2013 మరియు జనవరి 16, 2014 మధ్య కాలంలో ఉత్పత్తి అయిన హోండా బ్రయో, హోండా అమేజ్‌లలోని నాన్-ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లేని) వేరియంట్లలో ఈ సమస్య ఉందేమోనని తనిఖీ చేసేందుకు గాను వీటిని రీకాల్ చేస్తున్నారు.

ఈ రీకాల్‌కు వర్తించే కార్లలో 15,623 బ్రయో హ్యాచ్‌బ్యాక్‌లు, 15,603 అమేజ్ సెడాన్లు ఉన్నాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. బ్రేకింగ్ సిస్టమ్‌లో కీలకమైన ప్రపోర్షనింగ్ వాల్వ్ సమస్య వలన వీటిని రీకాల్ చేస్తున్నట్లు హోండా వివరించింది.

Honda Brio And Amaze Recall

ప్రపోర్షనింగ్ వాల్వ్ అనేది చక్రాలకు బ్రేకింగి డిస్ట్రిబ్యూషన్‌ను అడ్జస్ట్ చేస్తుంది. రీకాల్‌కు వర్తించే కార్లను హోండా చెక్ చేసి, లోపపూరితమైన భాగాన్ని ఉచితంగా రీప్లేస్ చేస్తుంది. ఈ రీకాల్‌కు సంబంధించి బ్రయో, అమేజ్ ఓనర్లను కంపెనీ ప్రత్యేకంగా కాల్ చేయనుంది.

ఒకవేళ మీరు బ్రయో లేదా అమేజ్ కారును ఉపయోగిస్తూ ఉండి, మీ కారు కూడా ఈ రీకాల్ వర్తిస్తుందో లేదో తెలుసుకోవాలంటే సింపుల్‌గా ఇలా చేస్తే సరిపోతుంది. మీ కారు ఛాస్సిస్ నెంబర్‌ను నోట్ చేసుకొని (మీ వాహన రిజిస్ట్రేషన్ బుక్‌/పేపర్‌లో దీనిని చూడొచ్చు), హోండా కార్స్ ఇండియా అఫీషియల్ వెబ్‌సైట్ https://www.hondacarindia.com లో ఇచ్చిన కస్టమర్ అలెర్ట్ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత అందులో మీ కార్ చాస్సిస్ నెంబర్‌ను ఎంటర్ చేస్తే, మీ కారు కూడా రీకాల్‌కు వర్తిస్తుందో లేదో ఇట్టే తెలిసిపోతుంది.

Most Read Articles

English summary
Honda Cars India Limited today announced a recall of certain variants of the Amaze sedan and Brio hatchback for a possible defect in thee brak system.The company wants to undertake inspection of the proportioning valve of non-ABS variants of the Amaze and Brio manufactured between February 28 and January 16, 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X