హ్యుందాయ్ వెర్నాను బీట్ చేసిన హోండా సిటీ; సెగ్మెంట్ లీడర్

By Ravi

జపాన్‌కు చెందిన ఆటో దిగ్గజం హోండా కార్స్ ఇండియా రీసెంట్‌గా లాంచ్ చేసిన సరికొత్త '2014 హోండా సిటీ' సెడాన్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభిస్తుండటంతో, మార్కెట్లో ఈ మోడల్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

ఒకప్పుడు దాదాపు దశాబ్ధానికి పైగా మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లో రారాజుగా ఉన్న హోండా సిటీ సెడాన్, అప్పట్లో ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ లేకపోవటం, కాంపిటీటర్స్ నుంటి పోటీ పెరుగుతుండటంతో ఈ మోడల్ అమ్మకాలు సన్నగిల్లి, తన లీడర్‌షిప్ పొజిషన్ సిటీ కోల్పోవాల్సి వచ్చింది.


అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. హోండా సిటీకి తిరిగి మంచి రోజులు వచ్చాయి. ఎక్కడ పోగట్టుకుంటే, అక్కడే వెతుక్కోవాలన్నట్లుగా.. హోండా కార్స్ ఇండియా తమ సిటీ సెడాన్‌ను మరింత అధునాతనంగా అప్‌గ్రేడ్ చేసి, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో విడుదల చేయటంతో, ఈ సెగ్మెంట్లో సిటీ తిరిగి తన లీడర్‌షిప్ పొజిషన్‌ను దక్కించుకుంది.

జనవరి 2014లో విడుదలైన హోండా సిటీ మొదటి నెలలోనే 7,184 యూనిట్లను ఆ తర్వాతి నెలలో (ఫిబ్రవరిలో) 7,213 యూనిట్ల విక్రయాలను నమోదు చేసుకొని సత్వర విజయాన్ని దక్కించుకుంది. ఇప్పటి వరకు ఈ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా ఉన్న హ్యుందాయ్ వెర్నా మోడల్‌ను హోండా సిటీ ఓవర్‌టేక్ చేసింది.

Hyundai Verna

జనవరిలో హ్యుందాయ్ 3,803 వెర్నా కార్లను మరియు ఫిబ్రవరి 3,342 వెర్నా కార్లను మాత్రమే విక్రయించింది. ఇదే కాలంలో ఫోక్స్‌వ్యాగన్ వరుసగా 1294, 1191 వెంటో కార్లను విక్రయించగా, స్కొడా 1188, 961 ర్యాపిడ్ కార్లను విక్రయించింది. మొత్తమ్మీద చూస్తే, సరికొత్త డిజైన్, ప్రీమియం లుక్, అధునాతన డీజిల్ ఇంజన్, మెరుగైన మైలేజ్, బ్రాండ్ ఇమేజ్ వంటి అనేక అంశాలతో హోండా సిటీ తిరిగి తన మార్కెట్ లీడర్ స్థానాన్ని కైవసం చేసుకుంది.
Most Read Articles

English summary
Honda City has well and truly arrived, gaining back its right place in the ladder. The new Honda City, launched in January has become an instant hit with 7,184 units sold in the first month and 7,213 units in February.
Story first published: Wednesday, March 12, 2014, 10:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X