బ్రయోలో కొత్త వేరియంట్‍‌ను విడుదల చేయనున్న హోండా

By Ravi

జపనీస్ కార్ కంపెనీ హోండా కార్స్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ హోండా బ్రయోలో మరో సరికొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. బ్రయోలో ఇటీవలే ఆటోమేటిక్ వేరియంట్‌ను విడుదల చేసిన కంపెనీ ఇప్పుడు తాజాగా ఇందులో ఓ కొత్త టాప్-ఎండ్ వేరియంట్‌ను అందించనుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టాప్-ఎండ్ వేరియంట్ (వి)కు మరిన్ని అదనపు ఫీచర్లను జోడించిన ఓ కొత్త వేరియంట్‌ను (విఎక్స్) హోండా కార్స్ ఇండియా విడుదల చేయనుంది.

ఈ అధనపు ఫీచర్లలో రియర్ డిఫాగ్గర్, డ్రైవర్ సీట్ అడ్జస్ట్‌మెంట్‌లు చెప్పుకోదగినవి. హోండా బ్రయో వెనుక భాగం పూర్తిగా విండ్‌షీల్డ్‌తో తయారు చేయబడి ఉంది కాబట్టి, దీనికి రియర్ వైపర్‌ను ఏర్పాటు చేసేందుకు అవకాశం లేదు. కాబట్టి, కొత్త బ్రయో వేరియంట్‌లో రియర్ వైపర్ ఉండకపోవచ్చు. మరికొన్ని ఆసక్తికరమైన ఇంటీరియర్ ఫీచర్లను ఈ కొత్త టాప్-ఎండ్ వేరియంట్‌లో మనం చూసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం లభిస్తున్న టాప్-ఎండ్ వేరియంట్ ధర (బ్రయో వి) కన్నా ఈ కొత్త టాప్ ఎండ్ వేరియంట్ ధర (బ్రయో విఎక్స్) కాస్తంత అధికంగా ఉండొచ్చని అంచనా.

హోండా బ్రయో

హోండా బ్రయో

బ్రయోలో ఇటీవలే ఆటోమేటిక్ వేరియంట్‌ను విడుదల చేసిన హోండా ఇప్పుడు తాజాగా ఇందులో ఓ కొత్త టాప్-ఎండ్ వేరియంట్‌ను అందించనుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టాప్-ఎండ్ వేరియంట్ (వి)కు మరిన్ని అదనపు ఫీచర్లను జోడించిన ఓ కొత్త వేరియంట్‌ను (విఎక్స్) హోండా కార్స్ ఇండియా విడుదల చేయనుంది.

హోండా బ్రయో లైఫ్ కాన్సెప్ట్

హోండా బ్రయో లైఫ్ కాన్సెప్ట్

హోండా బ్రయో లైఫ్ కాన్సెప్ట్

హోండా బ్రయో లైఫ్ కాన్సెప్ట్

హోండా బ్రయో లైఫ్ కాన్సెప్ట్

హోండా బ్రయో లైఫ్ కాన్సెప్ట్

హోండా బ్రయో లైఫ్ కాన్సెప్ట్

హోండా బ్రయో లైఫ్ కాన్సెప్ట్

హోండా బ్రయో ఆటోమేటిక్

హోండా బ్రయో ఆటోమేటిక్

హోండా బ్రయో ఆటోమేటిక్ ఫీచర్స్

హోండా బ్రయో ఆటోమేటిక్ ఫీచర్స్

హోండా బ్రయో ఆటోమేటిక్ ఇంటీరియర్ వ్యూ

హోండా బ్రయో ఆటోమేటిక్ ఇంటీరియర్ వ్యూ


హోండా బ్రయోలో ఉపయోగించిన 4-సిలిండర్, 1.2 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 88 పిఎస్‌ల శక్తిని, 4500 ఆర్‌పిఎమ్ వద్ద 109 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ వెర్షన్ బ్రయో లీటర్ పెట్రోల్‌కు 19.4 కి.మీ. మైలేజీని, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వెర్షన్ బ్రయో లీటరుకు 16.5 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం హోండా బ్రయో 7 వేరియంట్లలో (అన్ని పెట్రోల్ వేరియంట్లే) లభిస్తుంది, వాటి వివరాలు ఇలా ఉన్నాయి:

  • హోండా బ్రయో ఈ ఎమ్‌టి - రూ. 4.10 లక్షలు
  • హోండా బ్రయో ఈఎక్స్ ఎమ్‌టి - రూ. 4.26 లక్షలు
  • హోండా బ్రయో ఎస్ ఎమ్‌టి - రూ. 4.55 లక్షలు
  • హోండా బ్రయో ఎస్(ఓ) ఎమ్‌టి - రూ. 5.04 లక్షలు
  • హోండా బ్రయో ఎస్(ఓ) ఏటి - రూ. 5.74 లక్షలు
  • హోండా బ్రయో వి ఎమ్‌టి - రూ. 5.29 లక్షలు
  • హోండా బ్రయో వి ఏటి - రూ. 5.99 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ. మెటాలిక్ కలర్ కోసం రూ.3500 అదనం)

Most Read Articles

English summary
Honda Cars India Limited (HCIL) is expected to introduce a new top-end variant for its first budget hatchback Brio. The new top-end variant (Brio VX) will boost a rear de-fogger, driver seat height adjustment and few additional features.
Story first published: Thursday, January 31, 2013, 11:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X