థాయ్‌లాండ్‌లో హోండా జాజ్ విడుదల; నెక్స్ట్ ఇండియానే..

By Ravi

జపనీస్ కార్ కంపెనీ హోండా తమ అధునాతన 2014 హోండా జాజ్ ప్రీమియం హ్యాచ్‌‌బ్యాక్‌ను థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదల చేసింది. థాయ్ మార్కెట్లో 2014 జాజ్ ధర రూ.5.55 లక్షల భాట్స్‌గా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.9.97 లక్షలు) ఉంది.

ఈ సరికొత్త హోండా జాజ్ హ్యాచ్‌బ్యాక్ వచ్చే ఏడాది ఆరంభంలో కానీ లేదా ఈ ఏడాది చివర్లో కానీ ఇండియన్ మార్కెట్లో విడుదల కానుంది. బెస్ట్ ఇన్ క్లాస్ ప్రీమియం ఫీచర్లతో ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టంగా ఉండేలా హోండా తమ మోడ్రన్ జాజ్ కారును తయారు చేసింది.


హోండా థాయ్‌‍లాండ్ విభాగం సాలీనా 20,000 జాజ్ కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. జాజ్ బేసిక్ డిజైన్‌ను అలానే ఉంచుతూ, ఇదివరకటి తరం జాజ్ కన్నా మరింత షార్పర్‌గా, అగ్రెసివ్ లుక్‌ని కలిగి ఉండేలా కొత్త జాజ్‌ను డిజైన్ చేశారు.

ఈ కొత్త 2014 హోండా జాజ్ ప్రీమియం బ్యాచ్‌బ్యాక్ కారులో ఏబిఎస్, ఈబిడి, జి-కాన్ (జి ఫోర్స్ కంట్రోల్ సిస్టమ్), హిల్ స్టార్ట్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు లభ్యం కానున్నాయి. ఇందులో 7-ఇంచ్ టిఎఫ్‌టి ఆడియో సిస్టమ్‌ను ఆఫర్ చేస్తున్నారు. దీనిని స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు.


థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదలైన 2014 జాజ్ ప్రస్తుతానికి పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లో మాత్రమే లభ్యం కానుంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 117 హెచ్‌పిల శక్తిని, 146 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఇండియన్ మార్కెట్ విషయానికి వస్తే.. హోండా జాజ్ ప్రస్తుత తరం హోండా సిటీ సెడాన్ మాదిరిగానే 1.5 లీటర్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Honda Jazz 2014
Most Read Articles

English summary
Honda has been selling their Jazz in India for a while now the hatchback has been a bit on the expensive side. The Japanese manufacturer has launched a new Jazz in Thailand and we expect it to come to India in the beginning of 2015. The 2014 Jazz has been launched at a price of 5,55,000 Baht, which roughly translates to INR 9,97,806.
Story first published: Friday, May 23, 2014, 16:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X