ఇండోనేషియా: హోండా మొబిలో ఎమ్‌పివికి 4500 బుకింగ్స్

By Super

జపాన్ ఆటో దిగ్గజం హోండా తమ చిన్న కారు 'బ్రయో' హ్యాచ్‌‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ చేసుకొని అభివృద్ధి చేసిన హోండా మొబిలో (Honda Mobilio) ఎమ్‌పివిని ఇటీవలే ఇండోనేషియన్ మార్కెట్లో ఆవిష్కరించిన సంగతి తెలిసినదే.

ఈ నేపథ్యంలో హోండా మొబిలో ఎమ్‌పివిని చూసి అట్రాక్ట్ అయిన ఇండోనేషియన్లు ఇప్పటి నుంచే ఈ కారును బుక్ చేసుకోవటం ప్రారంభించారు. ఈ ఎమ్‌పివికే ఇప్పటికే 4500 యూనిట్లకు పైగా ప్రీ బుకింగ్‌లు వచ్చాయని, వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.

బ్రయో ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అమేజ్ సెడాన్‌ను రూపొందించినట్లుగా ఈ హోండా మొబిలో ఎమ్‌పివిని కూడా రూపొందించారు. అత్యున్న నాణ్యతా ప్రమాణాలు, స్పోర్టీ పెర్ఫామెన్స్‌లతో మొబిలోను తీర్చిదిద్దారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో హోండా తమ మొబిలో ఎమ్‌పివిని భారత్‌లో కూడా విడుదల చేసే అవకాశాలున్నాయి.

హోండో మొబిలో ఎమ్‌పివికి సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

హోండా మొబిలో ఎమ్‌పివి

హోండా మొబిలో కాంపాక్ట్ డిజైన్ కలిగిన ఓ ఫుల్‌సైజ్ ఎమ్‌పివి. లోపలి వైపు ప్రయాణికులకు పూర్థిస్థాయి సౌకర్యాన్ని అందించేలా హోండా ఇంజనీర్లు ఈ ఎమ్‌పివిని డిజైన్ చేశారు. దీని కొలతలు ఇలా ఉన్నాయి.

పొడవు: 4,390 మి.మీ.

వెడల్పు: 1,680 మి.మీ.

ఎత్తు: 1,610 మి.మీ.

వీల్‌బేస్: 2,650 మి.మీ.

గ్రౌండ్ క్లియరెన్స్: 185 మి.మీ.

టర్నింగ్ రేడియస్: 5.2 మీటర్లు

హోండా మొబిలో ఎమ్‌పివి

బ్రయో, అమేజ్‌లను డిజైన్‌ను చేసిన ప్లాట్‌ఫామ్ మీదనే మొబిలోను కూడా డిజైన్ చేశారు. అయితే, మొబిలో వీల్‌బేస్ అలాగే గ్రౌండ్ క్లియరెన్స్‌లు అమేజ్ కన్నా ఎక్కువగా ఉంటాయి. ముందు వైపు డిజైన్‌ను గమనిస్తే, ఇది బ్రయో, అమేజ్‌ల మాదిరిగానే కనిపిస్తుంది. మిగిలిన భాగాన్ని ప్రత్యేకించి పై భాగం మరియు వెనుక భాగాలను కొత్తగా డిజైన్ చేశారు.

హోండా మొబిలో ఎమ్‌పివి

ప్రారంభంలో భాగంగా, హోండా మొబిలో పెట్రోల్ వెర్షన్‌లో విడుదల కానుంది. ఇందులో 1.5 లీటర్ ఎస్ఓహెచ్‌సి, ఐ-విటెక్, 14-వాల్వ్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది గరిష్టంగా 118 పిఎస్‌‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే, భారత్ వంటి దేశాల కోసం ఇందులో డీజిల్ వెర్షన్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అమేజ్ డీజిల్‌లో ఉపయోగించిన ఇంజన్‌నే కాస్తంత రీట్యూన్ చేసి హోండా మొబిలో ఎమ్‌పివిలో కూడా ఉపయగించే ఆస్కారం ఉంది.

హోండా మొబిలో ఎమ్‌పివి

పెట్రోల్ వెర్షన్ హోండా మొబిలో ఎమ్‌పివిలో రెండు రకాల ట్రాన్సిమిన్లు (5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, సివిటి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్) అందుబాటులో ఉండనుంది.

హోండా మొబిలో ఎమ్‌పివి

హోండా మొబిలో ఎమ్‌పివి అధునాత సేఫ్టీ ఫీచర్లతో లభ్యం కానుంది. ఇందులో ప్రధానంగా జి-కాన్ (జి-ఫోర్స్ కంట్రోల్ టెక్నాలజీ), ఏసిఈటిఎమ్, ఏబిఎస్, ఈబిడి బ్రేకింగ్ సిస్టమ్, డ్యూయెల్ ఫ్రంట్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్, ప్రీటెన్షనర్ సీట్ బెల్ట్స్ విత్ లోడ్ లిమిటర్, ఇంపాక్ట్ మిటిగేటింగ్ హెడ్ రెస్ట్స్, సెర్టా పెడస్టేరియన్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.

హోండా మొబిలో ఎమ్‌పివి

హోండా మొబిలో ఎమ్‌పివి తొలుతగా ఇండోనేషియన్ మార్కెట్లో విడుదల కానుంది. అక్కడి మార్కెట్లో దీని ధర 150-180 మిలియన్ రుపయ్య (మన దేశ కరెన్సీలో సుమారు రూ.8.41 లక్షల నుంచి 10.09 లక్షల మధ్యలో) ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
According to recent reports, the Brio based Honda Mobilio MPV, which was unveiled at the 2013 Indonesia International Motor Show earlier this year, has bagged as many as 4,500 pre-bookings. The deliveries of the new Honda Mobilio MPV will commence in Indonesia in February next year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X