ఆటో ఎక్స్‌పో 2014: హోండా మొబిలియో ఎమ్‌పివి ఆవిష్కరణ

By Ravi

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ అందిస్తున్న చిన్న కారు 'బ్రయో' హ్యాచ్‌‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసిన బహుళ ప్రయోజన వాహన (ఎమ్‌పివి - మల్టీ పర్పస్ వెహికల్) 'హోండా మొబిలియో' (Honda Mobilo)ని కంపెనీ నేడు (ఫిబ్రవరి 5, 2014) గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది.

మార్చ్ 2014 నుంచి రాజస్థాన్‌లోని తపుకరా వద్ద హోండా కొత్తగా ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో హోండా మొబిలియో ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఏప్రిల్ చివర్లో కానీ లేదా మే నెల ఆరంభంలో కానీ ఇది వాణిజ్య పరంగా వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. హోండా మొబిలియో పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభ్యం కానుంది.

హోండో మొబిలియో ఎమ్‌పివికి సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

డిజైన్

డిజైన్

బ్రయో, అమేజ్‌లను డిజైన్‌ను చేసిన ప్లాట్‌ఫామ్ మీదనే మొబిలియోను కూడా డిజైన్ చేశారు. అయితే, మొబిలియో వీల్‌బేస్ అలాగే గ్రౌండ్ క్లియరెన్స్‌లు అమేజ్ కన్నా ఎక్కువగా ఉంటాయి. ముందు వైపు డిజైన్‌ను గమనిస్తే, ఇది బ్రయో, అమేజ్‌ల మాదిరిగానే కనిపిస్తుంది. మిగిలిన భాగాన్ని ప్రత్యేకించి పై భాగం మరియు వెనుక భాగాలను కొత్తగా డిజైన్ చేశారు.

ఇంజన్

ఇంజన్

ప్రారంభంలో భాగంగా, హోండా మొబిలియో పెట్రోల్ వెర్షన్‌లో విడుదల కానుంది. ఇందులో 1.5 లీటర్ ఎస్ఓహెచ్‌సి, ఐ-విటెక్, 14-వాల్వ్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది గరిష్టంగా 118 పిఎస్‌‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే, భారత్ వంటి దేశాల కోసం ఇందులో డీజిల్ వెర్షన్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అమేజ్ డీజిల్‌లో ఉపయోగించిన ఇంజన్‌నే కాస్తంత రీట్యూన్ చేసి హోండా మొబిలియో ఎమ్‌పివిలో కూడా ఉపయగించే ఆస్కారం ఉంది.

ట్రాన్సిమిషన్

ట్రాన్సిమిషన్

పెట్రోల్ వెర్షన్ హోండా మొబిలియో ఎమ్‌పివిలో రెండు రకాల ట్రాన్సిమిన్లు (5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, సివిటి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్) అందుబాటులో ఉండనుంది. డీజిల్ వెర్షన్‌లో మాత్రం కేవలం మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ మాత్రమే అందుబాటులో ఉంటుందని అంచనా.

సేఫ్టీ ఫీచర్లు

సేఫ్టీ ఫీచర్లు

హోండా మొబిలియో ఎమ్‌పివి అధునాత సేఫ్టీ ఫీచర్లతో లభ్యం కానుంది. ఇందులో ప్రధానంగా జి-కాన్ (జి-ఫోర్స్ కంట్రోల్ టెక్నాలజీ), ఏసిఈటిఎమ్, ఏబిఎస్, ఈబిడి బ్రేకింగ్ సిస్టమ్, డ్యూయెల్ ఫ్రంట్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్, ప్రీటెన్షనర్ సీట్ బెల్ట్స్ విత్ లోడ్ లిమిటర్, ఇంపాక్ట్ మిటిగేటింగ్ హెడ్ రెస్ట్స్, సెర్టా పెడస్టేరియన్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.

 
Most Read Articles
English summary
Honda Cars India has showcased its Mobilio MPV in India for the first time at 2014 Delhi auto Expo in Greater Noida. Honda will start production of Mobilio MPV in India at its Tapukara, Rajasthan, facility starting from March and deliveries will reportedly commence soon after, possibly in the months of April
Please Wait while comments are loading...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X