ఆల్టో, ఇయాన్, నానో కార్లకు పోటీగా హోండా చిన్న కారు

By Ravi

మారుతి సుజుకి ఆల్టో 800, హ్యుందాయ్ ఇయాన్, టాటా నానో వంటి చిన్న కార్లకు సవాలుగా జపనీస్ కార్ కంపెనీ హోండా ఓ చిన్న కారును భారత మార్కెట్లో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో ఎంట్రీ లెవల్ కార్లకు మంచి గిరాకీ ఉందని, భవిష్యత్తులో కూడా ఇది ఇలానే కొనసాగుతుందని, ఈ సెగ్మెంట్లో ప్రవేశించేందుకు గల అవకాశాలను తమ కంపెపనీ పరిశీలిస్తోందని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ హిరోనోరి కనయమా తెలిపారు.

ప్రస్తుతం ఈ విషయంపై హోండా మార్కెట్ అధ్యయనం చేస్తోందని, అయితే ఇక్కడి మార్కెట్‌కు సరిపోయే విధంగా తమ వద్ద చిన్న ఇంజన్లను లేవని, జపనీస్ మార్కెట్లలో కీ కార్లలో (Kei Cars) అందిస్తున్న 660సీసీ ఇంజన్లు మాత్రమే ఉన్నాయని ఆయన తెలిపారు. జపాన్ వినియోగదారులు, భారతీయ వినియోగదారుల అభిరుచి పూర్తిగా విభిన్నంగా ఉంటుందని, ఈ నేపథ్యంలో ఈ మోడళ్లను (కీ కార్లను) భారత్‌కు తీసుకురావటం లాభదాయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

హోండా కార్స్ ఇండియా ప్రస్తుతం భారత మార్కెట్లో అందిస్తున్న ఎంట్రీ లెవల్ కారు బ్రయో (ప్రారంభ ధర రూ.4 లక్షలకు పైమాటే)కు దిగువన ఈ చిన్న కారును ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం హోండా స్వతహాగా ఓ చిన్న ఇంజన్‌ను తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. మార్కెట్లో దీని ధర రూ.3 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. హోండా తమ డీజిల్ కారు అమేజ్‌తో మార్కెట్లో మంచి హైప్‌ను సంపాధించుకుంది. ఈ పరిస్థితుల్లో ఓ కాంపాక్ట్ కారును కూడా కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చినట్లయితే భారత్‌లో హోండా మార్కెట్ వాటా భారీగా పెరిగే ఆస్కారం ఉంది. మీరేమంటారు..?

హోండా ఎన్-వన్ కీ కార్

హోండా ఎన్-వన్ కీ కార్

హోండా ఎన్-వన్ కీ కార్

హోండా ఎన్-వన్ కీ కార్

హోండా ఎన్-వన్ కీ కార్

హోండా ఎన్-వన్ కీ కార్

హోండా ఎన్-వన్ కీ కార్

హోండా ఎన్-వన్ కీ కార్

హోండా ఎన్-వన్ కీ కార్

హోండా ఎన్-వన్ కీ కార్

హోండా ఎన్-వన్ కీ కార్

హోండా ఎన్-వన్ కీ కార్

హోండా ఎన్-వన్ కీ కార్

హోండా ఎన్-వన్ కీ కార్

హోండా ఎన్-వన్ కీ కార్

హోండా ఎన్-వన్ కీ కార్

హోండా ఎన్-వన్ కీ కార్

హోండా ఎన్-వన్ కీ కార్

హోండా ఎన్-వన్ కీ కార్

హోండా ఎన్-వన్ కీ కార్

Most Read Articles

English summary
Honda is mulling over the possibility of a sub Brio model for Indian. The new entry level hatchback will be in the same segment as Maruti Suzuki Alto and Hyundai Eon. This was confirmed by Hironori Kanayama, president & CEO of Honda Cars India. The Japanese automaker is set to launch its entry level compact sedan, Amaze on April 11.
Story first published: Monday, April 8, 2013, 11:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X