భారత్‌లో 2003 మోడల్ హోండా అకార్డ్, సిఆర్-వి కార్ల రీకాల్

By Ravi

హోండా కార్స్ ఇండియా తాజాగా భారత్‌లో మరో రీకాల్ చేసింది. జూన్ 2014లో హోండా ప్రకటించిన గ్లోబల్ రీకాల్‌లో భాగంగా, భారత మార్కెట్లో రెండు మోడళ్లలో ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌కు సంబంధించి ఈ వాలంటరీ రీకాల్ చేస్తున్నట్లు హోండా తెలిపింది.

గడచిన 2003లో ఉత్పత్తి చేసిన హోండా అకార్డ్ మరియు హోండా సిఆర్-విలలో ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లను రీప్లేస్ చేసేందుకు ఈ రీకాల్ చేస్తున్నామని హోండా వివరించింది. 2003లో తయారైన 1085 యూనిట్ల హోండా అకార్డ్ మరియు 252 యూనిట్ల సిఆర్-విలతో పాటుగా 2002లో తయారైన 1 యూనిట్ సిఆర్-వి కూడా ఈ రీకాల్‌కు వర్తించనున్నాయి.

Honda Recalls Accord

తమ ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలను మరింత పటిష్టం చేసేందుకు జపనీస్ హోండా మోటార్ కంపెనీ చేసిన గ్లోబల్ రీకాల్‌లో భాగంగానే, దాని పూర్తి భారతీయ అనుబంధ సంస్థ హోండా కార్స్ ఇండియా భారత్‌లో ఈ రీకాల్ చేసింది. ఈ సమస్య వలన భారత్‌లో ఇప్పటి వరకూ ఎలాంటి యాక్సిడెంట్ సంభవించినట్లు తమ ఫిర్యాదులు రాలేదని హోండా తెలిపింది.

రీకాల్‌కు వర్తించే కార్లను గుర్తించి, వారి యజమానులను సంప్రదించడం జరుగుతుందని, దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత హోండా కార్స్ ఇండియా డీలర్‌షిప్‌లలో ఈ ఎయిర్‌బ్యాగ్‌ను ఉచితంగా రీప్లేస్ చేయటం జరుగుతుందని కంపెనీ వివరించింది.


కస్టమర్లు తమ అకార్డ్ లేదా సిఆర్-వి కారు ఈ రీకాల్‌కు వర్తిస్తుందో లేదో తెలుసుకోవాలనుకుంటే, www.hondacarindia.com వెబ్‌సైట్‌ను సందర్శించి, తమ వాహనం యొక్క 17 అంకెలు-అక్షరాలతో కూడిన వెహికల్ ఐడెంటెఫికేషన్ నెంబర్ (విఐఎన్)ను ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.

ఈ సమస్యను సరిచేసుకోకుండా అలానే వదిలేస్తే, యాక్సిడెంట్ జరిగి ఎయిర్‌బ్యాగ్ విచ్చుకున్నప్పుడు ఇన్‌ఫ్లేటర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉన్నట్లు హోండా తెలిపింది.

టూ మచ్ హార్స్ పవర్.. ఆ తర్వాతేమైంది..?
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/XK3jWvNIqK4?rel=0" frameborder="0" allowfullscreen></iframe> /off-beat/video-give-an-ambulance-right-of-way-006787.html</center>

Most Read Articles

English summary
Honda Cars India Ltd (HCIL) today announced that it would carry out preventive replacement of Passenger Side Air Bag inflator of 1,085 units of Honda Accord and 252 units of Honda CR-V manufactured in Year 2003 & 1 unit of CR-V manufactured in Year 2002 as part of Honda’s global recall regarding the potential defect related to passenger air bag announced in June 2014.&#13;
Story first published: Wednesday, July 16, 2014, 17:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X