హ్యుందాయ్ ఐ10 గ్రాండ్ ఆవిష్కరణ; సెప్టెంబర్ 3న విడుదల

కొరియన్ ఆటో దిగ్గజం హ్యుందాయ్ బిఏ (BA) అనే కోడ్‌నేమ్‌తో ఓ చిన్న డీజిల్ కారును అభివృద్ధి చేస్తున్నట్లు గతంలో పలు కథనాల్లో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. తాజాగా హ్యుందాయ్ పూర్తిగా అభివృద్ధి చేసిన ఈ చిన్న డీజిల్ కారును ఆవిష్కరించింది. హ్యుందాయ్ ఐ10 గ్రాండ్ (Hyundai i10 Grand) పేరుతో ఇది రానున్న సెప్టెంబర్ నెల నుంచి మార్కెట్లో లభ్యం కానుంది. ఈ కారును సెప్టెంబర్ 3, 2013వ తేదీన ఉదయం 11.30 గంటలకు న్యూఢిల్లీలోని ఓ కార్యక్రమంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు మీడియాకు ఆహ్వానాలు కూడా పంపింది.

ప్రస్తుతం హ్యుందాయ్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఐ10 మరియు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20 మోడళ్లకు మధ్యలో ఐ10 గ్రాండ్ హ్యాచ్‌బ్యాక్‍‌‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది అందరూ ఊహించినప్పటికీ, ఈ కారు పేరుకు ఐ10 సిరీస్‌ను ఉపయోగిస్తారని ఎవ్వరూ ఊహించలేదు. ఈ ఐ10 పేరుకు చివర్లో గ్రాండ్ అని చేర్చారు. హ్యుందాయ్ ఐ10 గ్రాండ్ పేరుకు తగినట్లుగానే గ్రాండ్‌గా ఉంటుంది.

ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరగనున్న 2013వ అంతర్జాతీయ ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో కూడా హ్యుందాయ్ ఐ10 గ్రాండ్ హ్యాచ్‌బ్యాక్‌ను ప్రదర్శించనున్నారు. మంచి స్పేస్, ఉత్తమ మెటీరియల్స్, స్పోర్టీయర్ స్టయిల్ తదితర అంశాలతో ఈ కారును అభివృద్ధి చేశారు. ఈ బుజ్జి డీజిల్ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది పొటోఫీచర్‌లో పరిశీలించండి.

ఎక్స్టీరియర్స్‌

ఎక్స్టీరియర్స్‌

ముందుగా ఎక్స్టీరియర్స్‌ను గమనిస్తే.. కొత్త హెక్సాగనల్ ఫ్రంట్ గ్రిల్, డేటైమ్ రన్నింగ్ ఎల్ఈడి లైట్లను కలిగి ఉండే ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ (యూరోపియన్ వెర్షన్‌లో), 14 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, మందపాటి సైడ్ గార్డ్‌లతో హ్యుందాయ్ ఐ10 గ్రాండ్ మంచి స్పోర్టీ లుక్‌ను కలిగి ఉంటుంది.

ఎక్స్టీరియర్స్‌

ఎక్స్టీరియర్స్‌

అంతేకాకుండా, ఆకర్షనీయమైన విండో/రూఫ్ లైన్ (యూరోపియన్ వెర్షన్ సన్నటి రియర్ విండో స్పోర్టీయర్ లుక్‌ని కలిగి ఉంటుంది) మరొక ప్రత్యేకత. సరికొత్త హెడ్‌లైట్స్, రియర్ టెయిల్ ల్యాంప్స్ డిజైన్, రూఫ్ రెయిల్స్ హ్యుందాయ్ ఐ10 గ్రాండ్‌లో ప్రధాన ఆకర్షణలుగా నిలువనున్నాయి.

కొత్త ప్లాట్‌ఫామ్

కొత్త ప్లాట్‌ఫామ్

హ్యుందాయ్ ఐ10 గ్రాండ్ పేరులో ఐ10 ఉన్నప్పటికీ, ఈ కొత్త కారును మాత్రం సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై రూపొందించారు (ఐ10 ప్లాట్‌ఫామ్‌పై కాదు). ఇది ప్రస్తుతం మార్కెట్లోలభిస్తున్న పెట్రోల్ వెర్షన్ ఐ10 కారు కన్నా 100 మి.మీ. ఎక్కువ పొడవును, 70 మి.మీ ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్సును కలిగి ఉంటుంది.

పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్స్

పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్స్

హ్యుందాయ్ ఐ10 గ్రాండ్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్‌లో 1.2 లీటర్ కప్పా ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. డీజిల్ వెర్షన్‌లో సరికొత్త 1.1 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు (ఈ ఇంజన్ వివరాలు తెలియాల్సి ఉంది). భారత్‌లో హ్యుందాయ్ నుంచి లభిస్తున్న డీజిల్ కార్లలో కెల్లా ఐ10 గ్రాండ్ చవకదిగా ఉండనుంది.

ఫీచర్స్

ఫీచర్స్

హ్యుందాయ్ ఐ10 గ్రాండ్‌లో అనేక ఫీచర్లు ఉండనున్నాయి. 1జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో కూడిన మ్యూజిక్ సిస్టమ్, రియర్ ఏసి వెంట్స్, ఎయిర్ కండిషన్డ్ గ్లౌ బాక్స్ వంటి ఫీచర్లున్నాయి. అంతేకాకుండా, స్టార్ట్/స్టాప్ బటన్, స్మార్ట్ కీ ఫీచర్లు కూడా ఈ కారు సొంతం.

ఇంటీరియర్స్

ఇంటీరియర్స్

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న ఐ10 కన్నా మరింత ప్రీమియంగా ఉండనున్నాయి. నాణ్యమైన ప్లాస్టిక్స్, డ్యూయెల్ టోన్ బీజ్ ఇంటీరియర్స్, విశాలమైన రియర్ లెగ్‌రూమ్, విభిన్న డిజైన్ కలిగిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యాష్‌బోర్డ్ వంటి ఇంటీరియర్లు ఉండనున్నాయి.

సేఫ్టీ ఫీచర్స్

సేఫ్టీ ఫీచర్స్

హ్యుందాయ్ ఐ10 గ్రాండ్ హ్యాచ్‌బ్యాక్‌లో రియర్ పార్కింగ్ సెన్సార్స్, ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉండనున్నాయి.

Most Read Articles

English summary
The new Hyundai hatchback which we have all been expecting for months has finally been revealed. Hyundai has made public the first images of the car codenamed named BA. It is called Hyundai i10 Grand. Hyundai i10 Grand will be launched in September, post its public reveal at Frankfurt Auto Show.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X