మార్చ్‌లో హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ విడుదల!

హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఎలైట్ ఐ20లో 'ఐ20 యాక్టివ్' అనే క్రాసోవర్ మోడల్ స్కెచ్‌ను ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా.. ఇప్పుడు ఈ మోడల్‌ను వచ్చే నెలలో మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు హ్యుందాయ్ పేర్కొంది.

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ క్రాసోవర్ మోడల్‌ను జర్మనీలోని రస్సెల్స్‌హీమ్ వద్ద ఉన్న హ్యుందాయ్ డిజైన్ సెంటర్‌లో డిజైన్ చేశారు. ఈ కొత్త మోడల్ ఇంజన్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించకపోయినప్పటికీ, ప్రస్తుత ఎలైట్ ఐ20 మోడల్‌లో ఉపయోగిస్తున్న ఇంజన్లనే ఇందులోను ఉపయోగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

hyundai active i20 india launch soon

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఇంజన్ ఆప్షన్లు:

  • పెట్రోల్ వెర్షన్ హ్యుందాయ్ ఎలైట్ ఐ20లో 1197సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 82 హెచ్‌పిల శక్తిని, 115 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీని సర్టిఫైడ్ మైలేజ్ 18.6 కెఎంపిఎల్.
  • డీజిల్ వెర్షన్ హ్యుందాయ్ ఎలైట్ ఐ20లో 1396సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 89 హెచ్‌పిల శక్తిని, 220 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీని సర్టిఫైడ్ మైలేజ్ 22.54 కెఎంపిఎల్.

ఈ టీజర్ స్కెచ్‌ను బట్టి గమనిస్తే హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ మరింత ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ను, ప్రొటెక్టివ్ క్లాడింగ్‌ను కలిగి ఉంటుంది. క్రాసోవర్ లుక్ కోసం దీని బంపర్లను కూడా రీడిజైన్ చేశారు. అలాగే, ఇందులో కొత్త అల్లాయ్ వీల్స్‌ను కూడా ఆఫర్ చేయనున్నారు. ఐ20 యాక్టివ్ ఇంటీరియర్లలో కూడా కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Hyundai India has also confirmed that they will be launching their first crossover for India in March, 2015. It will also be the global debut of i20 Active, just as they did with their Elite i20 hatchback.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X