హోండా సిటీకి చెక్ పెట్టేందుకు కొత్త హ్యందాయ్ వెర్నా వేరియంట్స్

By Ravi

హోండా జోరుకు అడ్డుకట్ట వేసేందుకు హ్యుందాయ్ సన్నాహాలు ప్రారంభించింది. హోండా కార్స్ ఇండియా ఇటీవల విడుదల చేసిన సరికొత్త 2014 సిటీ సెడాన్‌కు పోటీ ఇచ్చేందుకు ఓ టాప్-ఎండ్ వేరియంట్ వెర్నా సెడాన్‌ను హ్యుందాయ్ విడుదల చేసింది.

హ్యుందాయ్ వెర్నా ఎస్ఎక్స్ (ఓ) (Hyundai Verna SX (O)) అనే కొత్త వేరియంట్‌ను హ్యుందాయ్ మోటార్ ఇండియా సైలెంట్‌గా మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 16-ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఇల్యుమినేటెడ్ పవర్ విండో స్విచెస్, సేఫ్టీ ఎస్కార్ట్ హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లతో ఈ కొత్త వెర్నా ఎక్స్ (ఆప్షనల్) వేరియంట్ లభ్యం కానుంది.

మరోవైపు హోండా సిటీ డీజిల్ వెర్షన్లకు పోటీగా, హ్యుందాయ్ తమ వెర్నాలో సిఎక్స్ (CX) అనే కొత్త వేరియంట్‌ను మరికొద్ది రోజుల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. హ్యుందాయ్ వెర్నా సిఎక్స్ వేరియంట్లో 1.4 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ వేరియంట్‌ను ప్రస్తుత కంపెనీ విక్రయిస్తున్న ఈఎక్స్, ఎస్ఎక్స్ వేరియంట్లలో ప్రవేశపెట్టనున్నారు.

Verna

ఈ కొత్త డీజిల్ వేరియంట్ వెర్నా సిఎక్స్‌లో ఎలక్ట్రో-క్రోమిక్ మిర్రర్, రియర్ పార్కింగ్ కెమెరా (పార్కింగ్ సెన్సార్లతో), 2 డిన్ ఆడియో సిస్టమ్ (బ్లూటూత్, స్టీరింగ్ కంట్రోల్స్‌తో), ఫుల్లీ ఆటోమేటిర్ టెంపరేచర్ కంట్రోల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ అండ్ ఫోల్డబల్ అవుట్‌సైడ్ మిర్రర్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ వంటి ఫీచర్లను ఆఫర్ చేయనున్నారు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌‌ను గమనిస్తూ ఉండండి.
Most Read Articles

English summary
Hyundai Motor India silently launched a new top-end variant of the Verna, called SX (O) to counter the appeal of New Honda City. The new Verna SX (O) comes with features such as projector headlamp, 16-inch diamond-cut alloy wheels, illuminated power window switches and safety escort headlamps.
Story first published: Wednesday, January 15, 2014, 16:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X