ఈకోస్పోర్ట్‌కు పోటీగా హ్యుందాయ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

By Ravi

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో రెనో డస్టర్, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వంటి మోడళ్లు మంచి సక్సెస్‌ను సాధించడంతో అన్ని కార్ కంపెనీలు ఇప్పుడు ఈ సెగ్మెంట్‌పై కన్నేశాయి. ఇప్పటికే నిస్సాన్ (టెర్రానో), హోండా (అర్బన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ), చెవర్లే (ట్రాక్స్), ఫోక్స్‌వ్యాగన్ (టైగన్), మారుతి సుజుకి (సుజుకి ఐవి-4) మోడళ్లను అభివృద్ధి చేస్తుంగా, తాజాగా ఈ సెగ్మెంట్లోకి కొరియన్ ఆటో దిగ్గజం హ్యుందాయ్ కూడా ఎంట్రీ ఇవ్వనుంది.

హ్యుందాయ్ కూడా ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే హ్యుందాయ్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన రహస్య చిత్రాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. బహుశా ఇది కూడా ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న ఫ్రాంక్‌ఫార్ట్ మోటార్‌షోలో విడుదలయ్యే ఆస్కారం ఉంది. ఈ ఫొటోలను గమనిస్తే, కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీలోను హ్యుందాయ్ పాపులర్ ఫ్లూయిడిక్ డిజైన్ థమ్ కనిపిస్తుంది.

హ్యుందాయ్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఐ20 స్టయిల్ హెడ్‌ల్యాంప్స్

ఐ20 స్టయిల్ హెడ్‌ల్యాంప్స్

కొత్త ఫ్లూయిడిక్ హ్యుందాయ్ ఐ20లో ఉపయోగించిన హెడ్‌లైట్స్ డిజైన్‌ను ఈ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఉపయోగించారు. దీన్నిబట్టి చూస్తుంటే, ఖర్చు తక్కువగా ఉంచేందుకు గాను దీనిని నెక్ట్స్ జనరేషన్ ఐ20 ప్లాట్‌ఫామ్‌ను కానీ లేదా శాంటాఫే ప్లాట్‌ఫామ్‌ను కానీ ఆధారంగా చేసుకొని రూపొందించినట్లు తెలుస్తోంది.

ఫ్లూయిడిక్ డిజైన్

ఫ్లూయిడిక్ డిజైన్

హ్యుందాయ్ నుంచి అత్యంత పాపులర్ అయిన ఫ్లూయిడిక్ డిజైన్ నుంచి స్ఫూర్తి ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. దీని డిజైన్‌లో ఫ్లూయిడిక్ స్టయిల్ బాడీ లైన్స్‌ను ఈ ఫొటోలో గమనించవచ్చు.

స్పైషాట్స్

స్పైషాట్స్

హ్యుందాయ్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన స్పైషాట్స్ ఇంటర్నెట్‌లో హట్ సెర్చ్‌గా ఉన్నాయి.

టెస్టింగ్

టెస్టింగ్

హ్యుందాయ్ ఈ బేబీ ఎస్‌యూవీని ప్రస్తుతం కొరియన్ రోడ్లపై టెస్టింగ్ నిర్వహిస్తోంది.

ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షో

ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షో

ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరబోయే ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో హ్యుందాయ్ ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Most Read Articles

English summary
Hyundai is developing a new compact SUV and the testing has already commenced. The spy shots have already hit the internet. Here is a rendering of the Hyundai Compact SUV with help from one of the designers of Hyundai.
Story first published: Wednesday, July 31, 2013, 16:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X