జనవరిలో కొత్త 2015 హ్యుందాయ్ ఎలాంట్రా విడుదల!?

By Ravi

హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న ప్రీమియం సెడాన్ ఎలాంట్రాలో కంపెనీ ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను 2015లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మా డ్రైవ్‍‌స్పార్క్ ప్రతినిధి ఓ స్థానిక హ్యుందాయ్ డీలరును సంప్రదించగా, జవరిలో కొత్త హ్యుందాయ్ ఎలాంట్రా విడుదల కానుందని తెలియజేశారు.

వాస్తవానికి ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ హ్యుందాయ్ ఎలాంట్రా గడచిన సంవత్సరంలోనే అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైంది. ఈ మోడల్‌ను 'అవాంటే' పేరుతో హ్యుందాయ్ అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తోంది. మునుపటి వెర్షన్ ఎలాంట్రాతో పోల్చుకుంటే మరింత ప్రీమియం లుక్, లగ్జరీ ఫీల్‌ను ఇచ్చేలా కొత్త ఎలాంట్రా కారును డిజైన్ చేశారు.

హ్యుందాయ్ నుంచి అత్యంత పాపులర్ అయిన ఫ్లూయిడిక్ డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా చేసుకొని కొత్త ఎలాంట్రాను డిజైన్ చేశారు. ఈ కారుకు సంబంధించిన కొంత సమాచారాన్ని తెలుసుకుందాం రండి..!

2015 హ్యుందాయ్ ఎలాంట్రా

తర్వాతి స్లైడ్‌లలో సరికొత్త 2015 హ్యుందాయ్ ఎలాంట్రాకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోండి.

2015 హ్యుందాయ్ ఎలాంట్రా

హ్యుందాయ్ ఎలాంట్రా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ఎక్స్టీరియర్ డిజైన్ పరంగా అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. మరింత ప్రీమియం లుక్‌నిచ్చేలా డేటైమ్ రన్నింగ్ లైట్స్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, కొత్త ఫాగ్ ల్యాంప్, బంపర్, గ్రిల్ డిజైన్‌ను అప్‌గ్రేడ్ చేశారు.

2015 హ్యుందాయ్ ఎలాంట్రా

ఫేస్‌లిఫ్ట్ ఎలాంట్రా పొడవును స్వల్పంగా పెంచారు. ప్రస్తుతం దీని మొత్తం పొడవు 4550 మి.మీ. ఫ్రంట్ బంపర్ వద్ద 5 మి.మీ., రియర్ బంపర్ వద్ద 15 మి.మీ. పొడవును పెంచారు.

2015 హ్యుందాయ్ ఎలాంట్రా

స్వల్పంగా రీడిజైన్ చేయబడిన బంపర్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, రివైజ్డ్ ఫ్రంట్ గ్రిల్, 17 ఇంచ్ టూ టోన్ అల్లాయ్ వీల్స్ ఈ ఫేస్‌లిఫ్ట్ 2014 హ్యుందాయ్ ఎలాంట్రా ప్రీమియం సెడాన్‌లో ప్రధానంగా చెప్పుకోదగిన మార్పులు.

2015 హ్యుందాయ్ ఎలాంట్రా

సెంటర్ ఎయిర్-వెంట్‌ను డ్యాష్‌బోర్డుపై రీపొజిషన్ చేశారు, అలాగే ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌‌రెస్ట్ ఎత్తును కొద్దిగా పెంచారు. వెనుక సీట్లకు చక్కగా వెంటిలేషన్ వచ్చే ఏర్పాటు చేశారు.

2015 హ్యుందాయ్ ఎలాంట్రా

ఎలక్ట్రానిక్ అప్‌గ్రేడ్స్ విషయానికి వస్తే, 3.5 ఇంచ్ ఓఎల్ఈడి డిస్‌ప్లే, స్మార్ట్ పార్కింగ్ అసిస్ట్ సిస్టమ్ ఇందులో ప్రధాన మార్పులు.

2015 హ్యుందాయ్ ఎలాంట్రా

కొత్త హ్యుందాయ్ ఎలాంట్రాలో సరికొత్త డీజిల్ ఇంజన్‌‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. ఇందులో అమర్చనున్న 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 126 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

English summary
According to the sources, South-Korean car maker Hyundai motors is planning to launch Elantra facelift in Indian market soon. 
Story first published: Wednesday, December 17, 2014, 11:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X