హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 వెయిటింగ్ పీరియడ్ తగ్గించే ప్లాన్స్!

By Ravi

హ్యుందాయ్ మోటార్ ఇండియా నుంచి తాజాగా మార్కెట్లో వచ్చిన తొలి కాంపాక్ట్ డీజిల్ కారు 'హ్యుందాయ్ గ్రాండ్ ఐ10' దేశీయ విపణిలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న సంగతి తెలిసినదే. గ్రాండ్ ఐ10 కారుకు గిరాకీ బాగా పెరిగి, వెయిటింగ్ పీరియడ్ కూడా గణనీయంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో, ఈ మోడల్ వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

గ్రాండ్ ఐ10కు అశేష స్పందన లభిస్తోందని, కస్టమర్లకు వీలైనంత త్వరగా ఈ కారును చేరవేసేందుకు తాము ఈ మోడల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డివిజన్ హెడ్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేష్ శ్రీవాత్సవ తెలిపారు. అయితే, ఎంత పరిమాణంలో ఉత్పత్తిని పెంచనున్న విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదు.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారుకు సెప్టెంబర్ మొదటి వారంలోనే 1.31 లక్షల ఎంక్వైరీలు వచ్చాయి. కాగా.. ఇప్పటి వరకు ఈ మోడల్‌కు 13,000 బుకింగ్‌లకు పైగా వచ్చినట్లు సమాచారం. సెప్టెంబర్ నెలలో 8,411 ఐ10 కార్లను డెలివరీ చేశామని, ఇంకా సుమారు 4,500 యూనిట్లకు పైగా పెండింగ్ బుకింగ్‌లు ఉన్నాయని శ్రీవాత్సవ తెలిపారు. ప్రస్తుతం ఆస్టా, స్పోర్ట్స్ టాప్-ఎండ్ వేరియంట్లకు రెండు నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంటుండగా, ఎరా, మాగ్నా బేస్ వేరియంట్లకు ఒక నెల వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ధర మరియు ఇతర వివరాల కోసం క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

పెట్రోల్ వెర్షన్ వేరియంట్లు - ధరలు

పెట్రోల్ వెర్షన్ వేరియంట్లు - ధరలు

గ్రాండ్ ఐ10 ఎరా - రూ.4.29 లక్షలు

గ్రాండ్ ఐ10 మాగ్నా - రూ.4.49 లక్షలు

గ్రాండ్ ఐ10 స్పోర్ట్స్ - 4.88 లక్షలు

గ్రాండ్ ఐ10 ఆస్టా రూ.5.47 లక్షలు

డీజిల్ వెర్షన్ వేరియంట్లు - ధరలు

డీజిల్ వెర్షన్ వేరియంట్లు - ధరలు

గ్రాండ్ ఐ10 ఎరా - రూ.5.23 లక్షలు

గ్రాండ్ ఐ10 మాగ్నా - రూ.5.43 లక్షలు

గ్రాండ్ ఐ10 స్పోర్ట్స్ - 5.82 లక్షలు

గ్రాండ్ ఐ10 ఆస్టా రూ.6.41 లక్షలు

డీజిల్ ఇంజన్

డీజిల్ ఇంజన్

హ్యందాయ్ గ్రాండ్ ఐ10 కారులో 1.1 లీటర్ 2వ తరం యూ2 సిఆర్‌డిఐ(యూరో 5) డీజిల్ ఇంజన్ ఉపయోగించారు. ఇది గరిష్టంగా 71 పిఎస్‌ల శక్తిని, 163 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

డీజిల్ ఇంజన్ మైలేజ్

డీజిల్ ఇంజన్ మైలేజ్

డీజిల్ వెర్షన్ గ్రాండ్ ఐ10 కారు లీటరు డీజిలుకు 24 కిలోమీటర్ల మైలేజ్ (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన మైలేజ్)ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

పెట్రోల్ ఇంజన్

పెట్రోల్ ఇంజన్

హ్యందాయ్ గ్రాండ్ ఐ10 కారులో 1.2 లీటర్ కప్పా ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 82 పిఎస్‌ల శక్తిని, 116 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

పెట్రోల్ ఇంజన్ మైలేజ్

పెట్రోల్ ఇంజన్ మైలేజ్

పెట్రోల్ వెర్షన్ గ్రాండ్ ఐ10 కారు లీటరు పెట్రోలుకు 18.9 కిలోమీటర్ల మైలేజ్ (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన మైలేజ్)ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)

ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)

డీజిల్ వెర్షన్ గ్రాండ్ ఐ10 కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్ గ్రాండ్ ఐ10లో 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ అందుబాటులో ఉంది.

ఎక్స్టీరియర్

ఎక్స్టీరియర్

ఐ10, గ్రాండ్ 10 ఎక్స్టీరియర్లను గమనిస్తే, కొత్త హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారులో విభిన్నంగా స్టయిల్ చేయబడిన హెక్సాగనల్ ఫ్రంట్ ఎయిర్-ఇన్‌టేక్, పాగ్ ల్యాంప్ హౌసింగ్, హెడ్‌లైట్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

ఎక్స్టీరియర్

ఎక్స్టీరియర్

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారు పైభాగంలో అమర్చిన బ్లాక్ కలర్ రూఫ్ రెయిల్స్ ఈ కారుకు మరింత స్పోర్టీ లుక్‌నిస్తాయి. క్రోమ్ డోర్ హ్యాండిల్స్, మందపాటి ప్లాస్టిక్ స్క్రాచ్ గార్డ్స్, రియర్ వైపర్ అండ్ వాషర్ మరియు 14 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఇందులో అదనపు ఆకర్షనలు.

గ్రాండ్ ఫీచర్ హైలైట్స్

గ్రాండ్ ఫీచర్ హైలైట్స్

* రియర్ ఏసి వెంట్స్ (సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైనది)

* డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ - విశిష్టమైన 2 టోన్ డిజైన్ (సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైనది)

* ఇంటిగ్రేటెడ్ 2-డిన్ ఎమ్‌పి3 ఆడియో సిస్టమ్, 1 జిబి ఇన్‌బిల్ట్ మెమరీతో (సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైనది)

* స్మార్ట్ కీ పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఫంక్షన్

* బ్లూటూత్ కనెక్టివిటీ

* ఫ్రంట్, రియర్ పవర్ అవుట్‌లెట్స్

గ్రాండ్ ఫీచర్ హైలైట్స్

గ్రాండ్ ఫీచర్ హైలైట్స్

* మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ (బ్లూటూత్, ఆడియో, మరియు ట్రిప్ మీటర్ కంట్రోల్స్)

* ఆటో ఫోల్డింగ్ రియర్ వ్యూ మిర్రర్స్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్ ఫంక్షన్

* రియర్ పార్కింగ్ సెన్సార్స్

* అవుట్ సైడ్ మిర్రర్లపై టర్న్ ఇండికేటర్స్

* రియర్ డిఫాగ్గర్

* డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్

గ్రాండ్ ఫీచర్ హైలైట్స్

గ్రాండ్ ఫీచర్ హైలైట్స్

* కూల్డ్ గ్లవ్ బాక్స్

* టిల్ట్ స్టీరింగ్

* లెథర్ స్టీరింగ్ వీల్

* ఫ్రంట్ అండ్ రియర్ పవర్ విండోస్ (డ్రైవర్ ఆటో డౌన్ ఫంక్షన్‌తో)

* రియర్ స్పాయిలర్

సేఫ్టీ ఫీచర్లు

సేఫ్టీ ఫీచర్లు

డ్యుయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), సెంట్రల్ లాకింగ్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ వంటి సేఫ్టీ ఫీచర్లతో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారు లభ్యమవుతుంది.

కొలతలు (ఐ10 కారుతో పోల్చితే)

కొలతలు (ఐ10 కారుతో పోల్చితే)

గ్రాండ్ ఐ10 రెగ్యులర్ వెర్షన్ ఐ10 కన్నా 180 మి.మీ. ఎక్కువ పొడవును, 55 మి.మీ. ఎక్కువ వెడల్పును, 30 మి.మీ. ఎక్కువ ఎత్తును కలిగి ఉంటుంది. వీల్ బేస్ కూడా 45 మి.మీ. ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా గ్రాండ్ ఐ10 విశాలమైన ఇంటీరియర్ స్పేస్‌ను కలిగి ఉండి, 256 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Buoyed by robust response to its new compact car 'Grand i10', auto major Hyundai Motor India is looking to increase the output of the model to reduce waiting period for customers.
Story first published: Thursday, October 10, 2013, 13:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X