30 రోజుల్లో 10,000 లకు బుకింగ్‌లను దక్కించుకున్న 'ఎక్సెంట్'

By Ravi

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఇటీవలే భారత విపణిలో విడుదల చేసిన ఫ్యామిలీ సెడాన్ 'హ్యుందాయ్ ఎక్సెంట్' మార్కెట్లో మంచి సక్సెస్‌ను సొంతం చేసుకుంది. ఈ కారు మార్కెట్లోకి విడుదలై కేవలం నెల రోజులు మాత్రమే అయినప్పటికీ, ఈ మోడల్‌కు ఇప్పటి వరకు 10,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చాయని, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల నుంచి 1,00,000కు పైగా ఎంక్వైరీలు వచ్చాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇది కూడా చదవండి: హ్యుందాయ్ ఎక్సెంట్ రివ్యూ

హ్యుందాయ్ ఎక్సెంట్‌కు మెట్రో నగరాలు అలాగే టైర్ 2 నగరాల్లో నివసిస్తున్న యువ కుటుంబాల నుంచి ఎక్కువగా ఆదరణ లభిస్తోంది. ఈ సందర్భంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేష్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. హ్యుందాయ్ బ్రాండ్ బలమైన నమ్మకాన్ని కనబరుస్తున్నందుక మరియు ఎక్సెంట్‌కు గొప్ప విజయం చేకూర్చడంలో భాగమైన తమ వినియోగదారులందరికీ అభినందనలు మరియు ధన్యవాదములు తెలియజేస్తున్నాని చెప్పారు.


నాణ్యత, ఫీచర్లు, సాంకేతిక మొదలైన అంశాల్లో హ్యుందాయ్ ఎక్సెంట్ ఓ కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించిందని, అతి తక్కువ సమయంలోనే ఇది ఓ సక్సెస్‌ఫుల్ మోడల్‌గా ఎదిగిందని ఆయన అన్నారు. హ్యుందాయ్ ఎక్సెంట్ విషయంలో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, వెయింటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు నిర్వాహక సామర్థ్యాలను పెంచే విషయంపై తాము పనిచేస్తున్నామని తెలిపారు.

హ్యుందాయ్ గ్రాండ్ 10 హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్‌ను తయారు చేశారు. హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ కూడా గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్‌లో 1.2 లీటర్ ఇంజన్‌ను మరియు డీజిల్ వెర్షన్‌లో 1.1 లీటర్ ఇంజను ఉపయోగించారు. (గ్రాండ్ ఐ10లోను ఇవే ఇంజన్లను ఉపయోగించారు).


పెట్రోల్ వెర్షన్ హ్యుందాయ్ ఎక్సెంట్‌లో ఆల్-అల్యూమినియం 1.2 లీటర్ కప్పా డ్యూయెల్ విటివిటి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 83 పిఎస్‌ల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 11.6 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది.

డీజిల్ వెర్షన్ హ్యుందాయ్ ఎక్సెంట్‌లో 1.1 లీటర్ అడ్వాన్స్డ్ యూ2 సిఆర్‌డిఐ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 4000 ఆర్‌పిఎమ్ వద్ద 72 పిఎస్‌ల శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 18.4 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ డీజిల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌లో మాత్రమే లభిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ అందుబాటులో లేదు.

Xcent Interior

పెట్రోల్ వెర్షన్ ఎక్సెంట్ 19.1 కెఎమ్‌పిఎల్ (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) మైలేజీని, డీజిల్ వెర్షన్ ఎక్సెంట్ 24.4 కెఎమ్‌పిఎల్ (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) మైలేజీనిస్తాయని కంపెనీ పేర్కొంది. రాష్ట్ర విపణిలో పెట్రోల్ వెర్షన్ ప్రారంభ ధర రూ.4.67 లక్షలు, డీజిల్ వెర్షన్ ప్రారంభ ధర రూ.5.63 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.
Most Read Articles

English summary
Hyundai Motor India Limited (HMIL), the country’s largest exporter and the second-largest car manufacturer, has received an overwhelming response of its newly launched model ‘Xcent’. Over 10,000 units have already been booked across India within just 30 days of its national launch in March 2014. 
Story first published: Monday, April 14, 2014, 16:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X