హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ ఆవిష్కరణ - వివరాలు

By Ravi

భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా, గడచిన సంవత్సరం మార్కెట్లో విడుదల చేసిన గ్రాండ్ 10 హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని, కంపెనీ ఇందులో ఓ కాంపాక్ట్ సెడాన్‌ను అభివృద్ధి చేస్తోందని, ఈ మోడల్‌ను ఫిబ్రవరి 4, 2014వ తేదీన న్యూఢిల్లీ విడుదల చేయనుందని మేము ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే.

ఇది కూడా చదవండి: టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్ - వివరాలు

తాజాగా హ్యుందాయ్ తమ గ్రాండ్ ఐ10 కాంపాక్ట్ సెడాన్‌ను నేను ఢిల్లీలోని హోటల్ తాజ్ ప్యాలెస్‌లో ఆవిష్కరించింది. కంపెనీ ఈ కాంపాక్ట్ సెడాన్‌కు 'హ్యుందాయ్ ఎక్సెంట్' (Hyundai Xcent) అనే పేరును ఖరారు చేసింది. ఇది ఈ సెగ్మెంట్లో ఇప్పటికే విడుదలైన మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్ వంటి మోడళ్లతో పాటుగా త్వరలో మార్కెట్లోకి రానున్న టాటా జెస్ట్, ఫోర్డ్ ఫిగో వంటి కాంపాక్ట్ సెడాన్లకు పోటీగా నిలువనుంది.

ఇది కూడా చదవండి: ఫోర్డ్ ఫిగో కాంపాక్ట్ సెడాన్ - వివరాలు

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన మరింత సమాచారాన్ని, ఫొటోలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్

హ్యుందాయ్ మోటార్ ఇండియా నిలిపి వేసిన పెట్రోల్ సెడాన్ 'హ్యుందాయ్ అసెంట్' స్థానాన్ని భర్తీ చేసేందుకు కంపెనీ గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా చేసుకొని ఈ 'హ్యుందాయ్ ఎక్సెంట్' సెడాన్‌ను తయారు చేసింది.

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్‌కు మరియు ఈ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్‌కు పొడగించబడిన బూట్ స్పేస్ తప్ప బేసిక్ డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజన్ ఆప్షన్లలో పెద్దగా చెప్పుకోదగిన మార్పులేవీ లేవు.

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్

ఎక్స్టీరియర్స్‌‌లో స్మోక్డ్ హెడ్‌ల్యాంప్స్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, హెక్సాగనల్ ఎయిర్ డ్యామ్ విత్ క్రోమ్ ఫినిషింగ్, రియర్ క్రోమ్ గార్నిష్, టెయిల్ ల్యాంప్ చుట్టూ క్రోమ్ టచ్ వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు.

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్

ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. డ్యూయెల్ టోన్ బీజ్ అండ్ బ్లాక్ థీమ్ (సీట్, డ్యాష్‌బోర్డుతో కలిపి). స్మార్ట్ ఇంటీరియర్ స్టోరేజ్ స్పేస్, కూలింగ్ గ్లౌ బాక్స్, రియర్ ఆర్మ్‌రెస్ట్, కప్ హోల్డర్ వంటి కొత్త ఫీచర్లు ఇందులో ఉంటాయి.

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్

కన్వీనెంట్ ఫీచర్స్‌లో.. ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్, స్మార్ట్ కీ విత్ పుష్ బటన్ ఇగ్నిషన్, ఎలక్ట్రికల్లీ కంట్రోల్డ్ ఓవిఆర్ఎమ్స్ విత్ రియర్ కెమెరా డిస్‌ప్లే అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ మొదలైనవి ఉన్నాయి.

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్

ఎలక్ట్రానిక్ ఫీచర్లలో.. గ్రాండ్ ఐ10లో ఆఫర్ చేసినట్లుగా 1 జిబి మెమరీతో కూడిన 2-డిన్ ఆడియో సిస్టమ్ విత్ యూఎస్‌బి కనెక్టివిటీ, ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్, వన్-చట్ ఎలక్ట్రిక్ ట్రంక్ ఓపెనింగ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ విత్ బ్లూటూత్ టెలిఫోనీ మొదలైనవి ఉన్నాి.

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే.. ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, రియర్ పార్కింగ్ అసిస్ట్ విత్ కెమెరా, రియర్ డిఫాగ్గర్ వంటి ఫీచర్లున్నాయి.

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్

హ్యుందాయ్ ఎక్సెంట్ కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. డీజిల్ వెర్షన్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తోను, పెట్రోల్ వెర్షన్లో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్లో కూడా లభ్యం కానుంది.

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్

ఉత్పత్తి వ్యయాన్ని తక్కువగా ఉంచేందుకు, ఈ కాంపాక్ట్ సెడాన్‌ను పూర్తిగా గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తున్నారు. భారత మార్కెట్లో హ్యుందాయ్‌కు ఇది తొలి కాంపాక్ట్ సెడాన్ కానుంది.

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్

చిన్న కార్లపై భారత ప్రభుత్వం అందిస్తున్న ఎక్సైజ్ రాయితీలను పొంది, తద్వారా సరమైన ధరకే ఈ మోడల్‌ను అందించేందుకు వీలుగా, హ్యుందాయ్ ఎక్సెంట్‌ను పొడవులో 4 మీటర్ల కన్నా తక్కువగా ఉండేలా డిజైన్ చేశారు.

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్

ఉత్పత్తిని ఖర్చును దృష్టిలో ఉంచుకొని అలాగే సరమైన ధరకే దీనిని ఆఫర్ చేసేందుకు, ఇందులో ఇంజన్ల పరంగా కూడా ఎలాంటి మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపించడం లేదు.

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్

ప్రస్తుతం హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగిస్తున్న 1.2 లీటర్ పెట్రోల్, 1.1 లీటర్ డీజిల్ ఇంజన్లనే ఈ కాంపాక్ట్ సెడాన్‌లోను ఉపయోగించనున్నారు.

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్

అంతేకాకుండా, హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగిస్తున్న అనేక రకాల విడిభాగాలను (ఇంటీరియర్ పార్ట్స్‌తో కలిపి) ఈ కాంపాక్ట్ సెడాన్‌లో కూడా ఉపయోగించనున్నారు. ఇలా చేయటం అత్యంత సరమైన ధరకే ఈ కారును ఆఫర్ చేసే ఆస్కారం ఉంటుంది.

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్

ఫిబ్రవరి 5, 2014వ తేది నుంచి జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కూడా ఈ హ్యుందాయ్ ఎక్సెంట్ మోడల్‌ను ప్రదర్శించనున్నారు. తాజా అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ రియర్ సీట్

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ కూల్డ్ గ్లవ్ బాక్స్

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ స్మార్ట్ స్టోరేజ్ స్పేస్

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ రియర్ సీట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ విత్ స్టోరేజ్ స్పేస్

Most Read Articles

English summary
The global unveiling of the Hyundai Xcent compact sedan has taken place in New Delhi. As you can notice, the automaker is trying to cash in on the legacy of the now discontinued Accent sedan by bringing back the name.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X