హైదరాబాద్‌లో హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ విడుదల

By Ravi

హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇటీవల దేశీయ విపణిలో విడుదల చేసిన సరికొత్త కాంపాక్ట్ సెడాన్ 'హ్యుందాయ్ ఎక్సెంట్' (Hyundai Xcent)ను కంపెనీ ఇప్పుడు రాష్ట్ర మార్కెట్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రాండ్ 10 హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్‌ను హ్యుందాయ్ సోమవారం నాడు హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసింది.

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ కూడా గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్‌లో 1.2 లీటర్ ఇంజన్‌ను మరియు డీజిల్ వెర్షన్‌లో 1.1 లీటర్ ఇంజను ఉపయోగించారు. (గ్రాండ్ ఐ10లోను ఇవే ఇంజన్లను ఉపయోగించారు).

రాష్ట్ర విపణిలో పెట్రోల్ వెర్షన్ ప్రారంభ ధర రూ.4.67 లక్షలు, డీజిల్ వెర్షన్ ప్రారంభ ధర రూ.5.63 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. హ్యుందాయ్ ఎక్సెంట్ ధర, వేరియంట్లు, ఇంజన్స్, మైలేజ్, ఫీచర్స్ మొదలైన పూర్తి వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

డిజైన్, డెవలప్‌మెంట్

డిజైన్, డెవలప్‌మెంట్

స్టైల్, స్పేస్, ఎకానమీ మరియు టెక్నలాజికల్ ఫీచర్లకు విలువిచ్చే కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్ కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకొని భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా ఎక్సెంట్‌ను అభివృద్ధి చేశామని కంపెనీ పేర్కొంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా, హ్యుందాయ్ మోటార్ కపెనీ నామ్‌యాంగ్ ఆర్ అండ్ డి ఇంజనీర్లు సంయుక్తంగా ఈ కారును కాన్సెప్ట్ స్టేజ్ నుంచి అభివృద్ధి స్టేజ్ వరకు కలిసి పనిచేశారు.

పెట్రోల్ ఇంజన్ వివరాలు

పెట్రోల్ ఇంజన్ వివరాలు

పెట్రోల్ వెర్షన్ హ్యుందాయ్ ఎక్సెంట్‌లో ఆల్-అల్యూమినియం 1.2 లీటర్ కప్పా డ్యూయెల్ విటివిటి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 83 పిఎస్‌ల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 11.6 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది.

డీజిల్ ఇంజన్ వివరాలు

డీజిల్ ఇంజన్ వివరాలు

డీజిల్ వెర్షన్ హ్యుందాయ్ ఎక్సెంట్‌లో 1.1 లీటర్ అడ్వాన్స్డ్ యూ2 సిఆర్‌డిఐ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 4000 ఆర్‌పిఎమ్ వద్ద 72 పిఎస్‌ల శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 18.4 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ డీజిల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌లో మాత్రమే లభిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ అందుబాటులో లేదు.

మైలేజ్ (పెట్రోల్ / డీజిల్)

మైలేజ్ (పెట్రోల్ / డీజిల్)

* పెట్రోల్ - 19.1 కెఎమ్‌పిఎల్ (ఏఆర్ఏఐ సర్టిఫైడ్)

* డీజిల్ - 24.4 కెఎమ్‌పిఎల్ (ఏఆర్ఏఐ సర్టిఫైడ్)

స్టయిలిష్ ఎక్స్టీరియర్స్

స్టయిలిష్ ఎక్స్టీరియర్స్

* స్వెప్ట్ బ్యాక్ హెడ్‌ల్యాంప్స్, క్రోమ్ ఇన్‌సెర్ట్‌తో కూడిన టెయిల్ ల్యాంప్స్

* క్రోమ్ ఫినిష్‌తో కూడిన హెక్సాగనల్ ఎయిర్ డ్యామ్

* స్టీప్లీ రేక్డ్ విండ్‌షీల్డ్

* వైడ్ డేలైట్ ఓపెనింగ్ ఏరియా

* ఫ్రంట్ బంపర్ విత్ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ డిజైన్

* స్పోర్టీ డ్యూయెల్ టోన్ రియర్ బంపర్ విత్ స్టయిలిష్ రిఫ్లెక్టర్స్

* డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, క్లాసీ క్రోమ్ డోర్ హ్యాండిల్స్

* స్టయిలిష్ అండ్ ఏరోడైనమిక్ కిక్-అప్ ట్రంక్ లిడ్ డిజైన్ విత్ క్రోమ్ గార్నిష్

* ఎల్ఈడి హై మౌంట్ స్టాప్ ల్యాంప్

ప్రీమియం ఇంటీరియర్స్

ప్రీమియం ఇంటీరియర్స్

* హై క్వాలిటీ ప్లాస్టిక్స్‌తో కూడిన బ్రైట్ డ్యూయెల్ టోన్ బీజ్ అండ్ బ్లాక్ ఇంటీరియర్స్

* ప్రీమియం డిజైన్డ్ డ్యాష్‌బోర్డ్ ఇంటిగ్రేటెడ్ విత్ హెక్సాగనల్ అవుట్‌లైన్డ్ ఆడియో

* ఎర్గోనమికల్లీ పొజిషన్డ్ కంట్రోల్స్

* ఫ్రంట్ అండ్ రియర్‌లో విశాలమైన లెగ్‌రూమ్, హెడ్‌రూమ్

* విశాలమైన బూట్ స్పేస్

* డోర్ ట్రిమ్స్‌లో, సెంటర్ కన్సోల్‌లో మల్టిపుల్ స్టోరేజ్ ఆప్షన్స్

* కంఫర్టబల్ సీటింగ్

* లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్

* లెథర్ వ్రాప్డ్ గేర్ షిఫ్ట్ నాబ్ విత్ క్రోమ్ ఇన్‌సెర్ట్

స్మార్ట్ ఫీచర్లు

స్మార్ట్ ఫీచర్లు

* రియర్ ఏసి వెంట్స్

* స్మార్ట్ కీ విత్ పుష్ బటన్ స్టార్ట్

* రియర్ పార్కింగ్ కెమెరా అండ్ సెన్సార్స్

* 15 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్

* 1 జిబి ఇంటర్నల్ మెమరీ

* ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్

* ఎలక్ట్రో-క్రోమిక్ మిర్రర్

* వన్ టచ్ ఎలక్ట్రిక్ ట్రక్ ఓపెనింగ్

కంఫర్ట్, కన్వీనెన్స్, సేఫ్టీ ఫీచర్స్

కంఫర్ట్, కన్వీనెన్స్, సేఫ్టీ ఫీచర్స్

* ఫుల్ ఆటోమేటిక్ ఏసి

* యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్)

* క్లస్టర్ ఐయోనౌజర్

* రియర్ ఆర్మ్-రెస్ట్ విత్ కప్ హోల్డర్స్

* గ్లవౌ బాక్స్ కూలింగ్

* స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్

* డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్

* రియర్ పార్కింగ్ అసిస్ట్

* రియర్ డిఫాగ్గర్

పెట్రోల్ వెర్షన్ వేరియంట్లు, ధరలు (మ్యాన్యువల్ మాత్రమే)

పెట్రోల్ వెర్షన్ వేరియంట్లు, ధరలు (మ్యాన్యువల్ మాత్రమే)

* హ్యుందాయ్ ఎక్సెంట్ బేస్ - రూ.4.66 లక్షలు

* హ్యుందాయ్ ఎక్సెంట్ ఎస్ - రూ.5.32 లక్షలు

* హ్యుందాయ్ ఎక్సెంట్ ఎస్ (ఆప్షనల్) - రూ.5.57 లక్షలు

* హ్యుందాయ్ ఎక్సెంట్ ఎస్ఎక్స్ - రూ.6.22 లక్షలు

* హ్యుందాయ్ ఎక్సెంట్ ఎస్ఎక్స్ (ఆప్షనల్) - రూ.6.47 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఆటోమేటిక్ వేరియంట్లు, ధరలు (పెట్రోల్ మాత్రమే)

ఆటోమేటిక్ వేరియంట్లు, ధరలు (పెట్రోల్ మాత్రమే)

* హ్యుందాయ్ ఎక్సెంట్ ఎస్ (ఆప్షనల్) - రూ.6.28 లక్షలు

* హ్యుందాయ్ ఎక్సెంట్ ఎస్ఎక్స్ (ఆప్షనల్) - రూ.7.19 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

డీజిల్ వెర్షన్ వేరియంట్లు, ధరలు (మ్యాన్యువల్ మాత్రమే)

డీజిల్ వెర్షన్ వేరియంట్లు, ధరలు (మ్యాన్యువల్ మాత్రమే)

* హ్యుందాయ్ ఎక్సెంట్ బేస్ - రూ.5.56 లక్షలు

* హ్యుందాయ్ ఎక్సెంట్ ఎస్ - రూ.6.23 లక్షలు

* హ్యుందాయ్ ఎక్సెంట్ ఎస్ (ఆప్షనల్) - రూ.6.48 లక్షలు

* హ్యుందాయ్ ఎక్సెంట్ ఎస్ఎక్స్ - రూ.7.13 లక్షలు

* హ్యుందాయ్ ఎక్సెంట్ ఎస్ఎక్స్ (ఆప్షనల్) - రూ.7.38 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

Most Read Articles

English summary
Hyundai Motor India has launched its highly anticipated compact family sedan Xcent in Hyderabad. Hyundai Xcent will further redefine Hyundai’s automotive excellence in India in the compact sedan segment for the aspirational, stylish and value-seeking Indian customer.
Story first published: Tuesday, March 25, 2014, 13:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X