ఇండియాకు రానున్న కాంక్వెస్ట్ ఎవేడ్ ఎస్‌యూవీ విడుదల

By Ravi

టొరంటోకు చెందిన కాంక్వెస్ట్ వెహికల్స్ గడచిన ఆగస్ట్ నెలలో మార్కెట్లో ఓ సరికొత్త పవర్‌ఫుల్ ఎస్‌యూవీని విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, దేశీయ విపణిలో విడుదల చేయనున్న ఇండియన్ వెర్షన్ 'ఎవేడ్' (Evade) ఎస్‌యూవీని టొరంటోలో కాంక్వెస్ట్ విడుదల చేసింది. కంపెనీ త్వరోలోనే ఈ ఎస్‌యూవీలను భారత మార్కెట్‌కు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయించనుంది.

కాంక్వెస్ట్ వెహికల్స్ సాధారణంగా విఐపిలు, పారామిలటరీ బలగాల కోసం సాయుధాలతో కూడిన వాహనాలను తయారు చేస్తుంది. అయితే, ఈ కంపెనీ తొలిసారిగా సాధారణ ప్రజల వినియోగార్థం తయారు చేసిన కవచాలు లేని (అన్ఆర్మోర్డ్) 'కాంక్వెస్ట్ ఎవేడ్'ను తయారు చేసింది. ఇందులో ఆర్మోర్డ్ ఎస్‌యూవీని 'నైట్ ఎక్స్‌వి' (Knight XV) అనే పేరుతో కంపెనీ విక్రయిస్తోంది. భారత మార్కెట్లో కాంక్వెస్ట్ ఎవేడ్ ఎస్‌యూవీ ప్రారంభ ధర జస్ట్ రూ.8.5 కోట్లు (ఎక్స్-షోరూమ్) మాత్రమే.

కాంక్వెస్ట్ ఎవేడ్ ఎస్‌యూవీ

కాంక్వెస్ట్ ఎవేడ్ ఎస్‌యూవీ

కాంక్వెస్ట్ ఎవేడ్ ఎస్‌యూవీ

కాంక్వెస్ట్ ఎవేడ్ ఎస్‌యూవీ

కాంక్వెస్ట్ ఎవేడ్ ఎస్‌యూవీ

కాంక్వెస్ట్ ఎవేడ్ ఎస్‌యూవీ

కాంక్వెస్ట్ ఎవేడ్ ఎస్‌యూవీ

కాంక్వెస్ట్ ఎవేడ్ ఎస్‌యూవీ

కాంక్వెస్ట్ ఎవేడ్ ఎస్‌యూవీ

కాంక్వెస్ట్ ఎవేడ్ ఎస్‌యూవీ

కాంక్వెస్ట్ ఎవేడ్ ఎస్‌యూవీ

కాంక్వెస్ట్ ఎవేడ్ ఎస్‌యూవీ

కాంక్వెస్ట్ ఎవేడ్ ఎస్‌యూవీ

కాంక్వెస్ట్ ఎవేడ్ ఎస్‌యూవీ

కాంక్వెస్ట్ ఎవేడ్ ఎస్‌యూవీ

కాంక్వెస్ట్ ఎవేడ్ ఎస్‌యూవీ

కాంక్వెస్ట్ ఎవేడ్ ఎస్‌యూవీ

కాంక్వెస్ట్ ఎవేడ్ ఎస్‌యూవీ

కాంక్వెస్ట్ నైట్ ఎక్స్‌వి ఎస్‌యూవీ

కాంక్వెస్ట్ నైట్ ఎక్స్‌వి ఎస్‌యూవీ


కాంక్వెస్ట్ ఎవేడ్ సుమారు 400 ఘనపు అడుగుల ఇంటీరియర్ స్పేస్‌ను కలిగి ఉండి విశాలమైన రూమ్, విలాసవంతమైన అనుభూతిని అందిస్తుంది. ఇది 6.8 లీటర్ వి10 పెట్రోల్, 6.7 లీటర్ వి8 టర్బో డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో 4x4 వీల్ డ్రైవ్‌తో లభిస్తుంది. సరికొత్త బాడీ స్టయిల్, కొత్త హెడ్‌లైట్స్, సన్నటి ఫెండర్ గార్డ్స్, రీడిజైన్ చేయబడిన గ్రిల్, హుడ్ స్కూప్, విడెల్పాటి వెనుక డోర్, సన్‌రూఫ్ వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు. దీని బరువును తగ్గించేందుకు గానూ ఎక్స్టీరియర్లను తక్కువ బరువు కలిగిన అల్యూమినియం మెటీరియల్స్‌తో తయారు చేశారు.

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇది 2-2 లీమో స్టయిల్ సీటింగ్‌ను కలిగి ఉండి, స్ట్రెచ్ చేయడానికి వీలుగా ఉంచాయి. ల్యాప్‌టాప్ ట్రేలు, పెద్ద టెలివిజన్ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ వ్యవస్థలను చూడొచ్చు. మిలటరీ వాహనాల నుంచి స్ఫూర్తి పొంది దీని ఇంటీరియర్స్‌ను డిజైన్ చేశారు. డ్రైవర్, ప్యాసింజర్ కోసం వేర్వేరు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్, జాయ్‌స్టిక్ ద్వారా కంట్రోల్ చేయబడే సెర్చ్‌లైట్స్, ఎఫ్ఎల్ఐఆర్ నైట్ విజన్ కెమెరాలు వంటి అనేత అత్యాధునిక ఫీచర్లు కాంక్వెస్ట్ ఎవేడ్ సొంతం.

ఫోర్డ్ ఎఫ్-550 ఛాసిస్స్‌పై ఈ ఎస్‌యూవీని రూపొందించారు. దీని మొత్తం బరువు 7 టన్నులు. ఇందులోని ఇంటీరియర్లను వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మలచుకోవచ్చు. భారత మార్కెట్లో ఢిల్లీకు చెందిన మాగ్నస్ కార్స్ కాంక్వెస్ట్ ఎవేడ్ ఎస్‌యూవీని అధికారికంగా దిగుమతి చేసుకొని విక్రయించనుంది.

Most Read Articles

English summary
Toronto based Conquest Vehicles Inc. has revealed the Indian bound Evade SUV in its home city. Conquest Evade SUV is the unarmored version of its Knight XV. The Evade is priced at Rs. 8.5 crore (Ex-showroom) in India.
Story first published: Friday, March 29, 2013, 11:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X