ఇండియన్ వెర్షన్ రెనో లాజీ ఎమ్‌పివి అధికారిక ఫొటో; 2015లో విడుదల

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా (Renault India) ఎమ్‌పివి సెగ్మెంట్లో 'లాజీ' (Lodgy) అనే పేరుతో ఓ సరికొత్త మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో చదువుకున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, ఇండియన్ వెర్షన్ రెనో లాజీ ఎమ్‌పివి అధికారిక ఫొటోని కంపెనీ నేడు (డిసెంబర్ 22, 2014) విడుదల చేసింది.

ఈ సరికొత్త రెనో ఎమ్‌పివి లాజీ వచ్చే ఏడాది (2015) ఆరంభంలో భారత మార్కెట్లో విడుదల కానుంది. వాస్తవానికి లాజీ ఎమ్‌పివి ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో డాసియా బ్యాడ్జ్ క్రింద విక్రయిస్తున్నారు. రెనో లాజీ ఒక 7-సీటర్ ఎమ్‌పివి. చెన్నైకి సమీపంలో ఓరగడం వద్ద ఉన్న రెనో-నిస్సాన్ ఉత్పత్తి కేంద్రంలో లాజీ ఎమ్‌పివిని తయారు చేయనున్నారు.

India Spec Renault Lodgy MPV

ఈ మోడల్ ఇంజన్ ఆప్షన్స్ ఇంకా వెల్లడి కాలేదు. అయితే, ఇందులో నిస్సాన్ అందిస్తున్న పాపులర్ 1.5 లీటర్ కె9కె డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 84 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. అలాగే, పెట్రోల్ వెర్షన్ రెనో లాజీ ఎమ్‌పివిలో 1.6 లీటర్, 84 బిహెచ్‌పి ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం.

దేశీయ విపణిలో దీని ధర రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని అంచనా. భారత మార్కెట్లో ఇది ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి ఎర్టిగా, నిస్సాన్ ఇవాలియా, షెవర్లే ఎంజాయ్, మహీంద్రా జైలో వంటి మోడళ్లతో పోటీ పడనుంది. రెనో లాజీ ఎమ్‌పివికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
French carmaker, Renault has revealed the first official picture of its yet to launch MPV Lodgy for Indian market. The vehicle will be rolled out in the early 2015. Stay tuned for latest updates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X