5 నిమిషాల్లోనే పూర్తి చార్జింగ్, 1000 కి.మీ. రేంజ్

By Ravi

ఎలక్ట్రిక్ కార్లు ఎక్కువ రేంజ్ ఇవ్వవని చాలా మంది భావిస్తుంటారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కారు మాత్రం ఏకంగా పూర్తి చార్జ్‌పై 1000 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. అంతేకాదు, ఇందులోని బ్యాటరీలు కేవలం 5 నిమిషాల్లోనే పూర్తిగా రీచార్జ్ అవుతాయట. వివరాల్లోకి వెళితే...

గుజరాత్‌కి చెందిన గోల్డెన్ యారో వైర్‌లెస్ అనే కంపెనీ ఇటీవలే గుజరాత్ రాష్ట్రంలో నిర్వహించిన ఆటో షోలో ఓ సరికొత్త ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు పేరు 'సూపర్ నోవా ఎలక్ట్రిక్' (ఎస్ఎన్ఈవి). ఈ కారుని కేవలం కాన్సెప్ట్‌కు మాత్రమే పరిమితం చేయకుండా, ఉత్పత్తి దశకు తీసుకువెళ్లాలని కంపెనీ యోచిస్తోంది.

ఈ అద్భుతమైన ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు, ఫొటోలను ఈ కథనంలో చూడండి.

సూపర్ నోవా ఎలక్ట్రిక్ వెహికల్

తర్వాతి స్లైడ్‌లలో సూపర్ నోవా ఎలక్ట్రిక్ వెహికల్‌కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

సూపర్ నోవా ఎలక్ట్రిక్ వెహికల్

గుజరాత్‌లో జరిగిన 2014 ఆటో షోలో గోల్డెన్ యారో వైర్‌లెస్ కంపెనీ ఈ సూపర్ నోవా ఎలక్ట్రిక్ వెహికల్‌ను ప్రదర్శనకు ఉంచింది. ఈ కారును ఉత్పత్తి చేసేందుకు గాను కంపెనీ 50 ఎకరా స్థలం కోసం అన్వేషిస్తోంది.

సూపర్ నోవా ఎలక్ట్రిక్ వెహికల్

సూపర్ నోవా ఎలక్ట్రిక్ వెహికల్ 3 బ్యాటరీ ఆప్షన్స్ (లీడ్ యాసిడ్, లిథియం అయాన్, సూపర్ కెపాసిటర్స్)తో లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ రేంజ్, రీచార్జ్ టైమ్ వలన ఇది ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టంగా ఉంటుంది.

సూపర్ నోవా ఎలక్ట్రిక్ వెహికల్

గోల్డెన్ యారో వైర్‌లెస్ కంపెనీ వ్యవస్థాపకుడు శశి వ్యాస్ పేర్కొన్న దాని ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ కారు ఫుల్ చార్జ్‌పై 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

సూపర్ నోవా ఎలక్ట్రిక్ వెహికల్

లీడ్ యాసిడ్ బ్యాటరీలను పూర్తిగా చార్జ్ చేయటానికి 8 గంటలు, లిథియం అయాన్ బ్యాటరీలను 2 గంటలు సమయం పడుతుంది. అయితే, సూపర్ కెపాసిటర్లను మాత్రం కేవలం ఐదే నిమిషాల్లో పూర్తిగా రీచార్జ్ చేసుకోవచ్చు.

సూపర్ నోవా ఎలక్ట్రిక్ వెహికల్

సూపర్ నోవా ఎలక్ట్రిక్ వెహికల్ గరిష్ట వేగం గంటకు 150 కిలోమీటర్లు. ఈ కారు ధరను మరియు దీనిని ఎప్పుడు మార్కెట్లో విడుదల చేస్తామనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

Most Read Articles

English summary
Gujarat will soon become home to a company called Golden Arrow Wireless which has already showcased its prototype, an Electric Sports Car called the SuperNova Electric Vehicle (SNEV).
Story first published: Wednesday, December 3, 2014, 11:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X