ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ, డి-మ్యాక్స్‌ పికప్‌ల విడుదల

భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి మరొక జపనీస్ కార్ బ్రాండ్ వచ్చి చేరింది. జపాన్‌ ఆటో దిగ్గజం 'ఇసుజు మోటార్స్' (Isuzu Motors) దేశీయ విపణిలో 'ఇసుజు ఎమ్‌యూ-7' ఎస్‌యూవీ మరియు 'ఇసుజు డి-మ్యాక్స్' పికప్ ట్రక్కులను విడుదల చేసింది. ప్రస్తుతం ఇసుజు మోటార్స్‌కు హైదరాబాద్, కోయంబత్తూర్‌లలో రెండు డీలర్‌షిప్ కేంద్రాలున్నాయి. భారత మార్కెట్లో వీటి ధరలు ఇలా ఉన్నాయి:

  • ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ ధర - రూ.24.16 లక్షలు
  • ఇసుజు డి-మ్యాక్స్ పికప్ (సింగిల్ క్యాబిన్) ధర - రూ.6.78 లక్షలు
  • ఇసుజు డి-మ్యాక్స్ పికప్ (డబుల్ క్యాబిన్) ధర - రూ.8.09 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ ఈ సెగ్మెంట్లోని టొయోటా ఫార్చ్యూనర్, మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది. ప్రస్తుతం ఇసుజు ఈ రెండు మోడళ్లను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో భారత్‌కు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయిస్తోంది. కాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు-చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీ సిటీలో ఇసుజు మోటార్స్ ఓ గ్రీన్‌ఫీల్డ్ ప్లాంటును ఏర్పాటు చేయటం ద్వారా ఈ మోడళ్లను భారత్‌లోనే ఉత్పత్తి చేయాలని కంపెనీ నిర్ణయించింది.

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ విడుదల

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ విడుదల

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీని విడుదల చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ విడుదల

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ విడుదల

ఇసుజు డి-మ్యాక్స్ పికప్ ట్రక్‌ను విడుదల చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ విడుదల

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు-చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీ సిటీలో ఇసుజు మోటార్స్ ఓ గ్రీన్‌ఫీల్డ్ ప్లాంటు ఏర్పాటు విషయమై అవగాహన ఒప్పందం (ఎమ్‌ఓయూ)ను మార్చుకుంటున్న ఇసుజు కంపెనీ మరియు ఆంధ్రప్రదేశ్ సర్కారు.

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ విడుదల

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ విడుదల

ఇసుజు ఎమ్‌యూ-7 విడుదల కార్యక్రమంలో జపాన్ అధికారులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు.

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు డి-మ్యాక్స్ పికప్

ఇసుజు డి-మ్యాక్స్ పికప్

ఇసుజు డి-మ్యాక్స్ పికప్

ఇసుజు డి-మ్యాక్స్ పికప్


ఈ మేరకు ఇసుజుతో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం (మార్చి 15, 2013) ఓ అవగాహన ఒప్పందం (ఎమ్‌ఓయూ)పై ఇరు పార్టీలు సంతకాలు చేశాయి. సుమారు రూ.1,500 కోట్ల పెట్టుబడులతో, దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో కంపెనీ ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇది 2015 నాటికి నిర్వహణలోకి రానుంది. ఈలోపుగా కంపెనీ తమ ఉత్పత్తులను భారత మార్కెట్లోనే అసెంబ్లింగ్ యోచిస్తోంది. ఇందుకు గాను హిందుస్థాన్ మోటార్స్ వంటి పటిష్ట కంపెనీలతో ఇసుజు చర్చలు జరుపుతోంది.

Most Read Articles

English summary
Japanese auto major Isuzu Motors has launched MU-7 SUV and D-Max pick-up in Hyderabad. The 7-seater Isuzu MU-7 SUV has been priced at Rs 23.75 lakh, the the single cab version D-Max pick-up priced at Rs 6.87 lakh and the double cab version D-Max pick-up has been priced at Rs 8.09 lakh. (All prices are ex-showroom, Hyderabad).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X