ఎస్‌యూవీ అభివృద్ధిపై దృష్టి సారించిన జాగ్వార్

ఇప్పటి వరకు పెర్ఫామెన్స్ సెడాన్లను, స్పోర్ట్స్ కార్లను రూపొందిస్తూ వచ్చిన బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ 'జాగ్వార్' ఇప్పుడు ఎస్‌యూవీ తయారీపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా జాగ్వార్ 2015 నాటికి ఓ సరికొత్త ఎస్‌యూవీని ఆవిష్కరించే ఆస్కారం ఉంది. జాగ్వార్ అభివృద్ధి చేస్తున్న తమ తొలి ఎస్‌యూవీకి క్యూ టైప్ లేదా ఎక్స్‌క్యూ టైప్ అనే పేరును పెట్టే అవకాశం ఉందని, ఈ పేర్ల కోసం కంపెనీ ఇప్పటికే పేటెంట్లకు కూడా ధరఖాస్తు చేసుకున్నట్లు పరిశ్రమ వర్గాల సమాచారం.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రిటీష్ కంపెనీ జాగ్వార్ బ్రాండ్ క్రింద లగ్జరీ సెడాన్లను, స్పోర్ట్స్ కార్లను తయారు చేస్తుండగా, ల్యాండ్ రోవర్ బ్రాండ్ క్రింద యుటిలిటీ వాహనాలను ఉత్పత్తి చేస్తుంది. అయితే జాగ్వార్ క్రింద యుటిలిటీ వాహనాలను తయారు చేయటం ఇదే మొదటిసారి.

ప్రస్తుతం ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతుండటంతో జాగ్వార్ బ్రాండ్‌లో కూడా యుటిలిటీ వాహనాలను ఆఫర్ చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, జాగ్వార్ మరో వైపు ఆడి ఏ4, బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ వంటి ఎంట్రీ లెవల్ లగ్జరీ కార్లకు పోటీగా ఓ సెడాన్‌ను ఉత్పత్తి చేస్తోంది. కొత్తగా రానున్న ఈ సెడాన్, ఎస్‌యూవీలలో ఉపయోగించేందుకు గాను కంపెనీ సరికొత్త 2.0 లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ కొత్త సెడాన్, ఎస్‌యూవీలు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభ్యమయ్యే ఆస్కారం ఉంది. జాగ్వార్ ఎంట్రీ లెవల్ సెడాన్, మొట్టమొదటి ఎస్‌యూవీలకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

జాగ్వార్ ఎస్‌యూవీ

జాగ్వార్ ఎస్‌యూవీ

జాగ్వార్ ఎస్‌యూవీ

జాగ్వార్ ఎస్‌యూవీ

జాగ్వార్ ఎస్‌యూవీ

జాగ్వార్ ఎస్‌యూవీ

Most Read Articles

English summary
According to sources, British luxury sedan and sports carmaker Jaguar has been working on their first SUV. The rumor of names - Q type and XQ type already been patented, as per the sources.
Story first published: Monday, July 15, 2013, 11:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X