మేడ్ ఇన్ ఇండియా జాగ్వార్ ఎక్స్‌జె విడుదల

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ స్థానికంగా భారత్‌లో అసెంబ్లింగ్ చేసిన ఎక్స్‌జే లగ్జరీ కారును విడుదల చేసింది. గడచిన సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో జాగ్వార్ తొలిసారిగా ఈ కారును ప్రదర్శించింది. సికెడి రూపంలో విడిభాగాలను ఇండియాకు దిగుమతి చేసుకొని, ఇక్కడే దీనిని అసెంబ్లింగ్ చేశారు.

జాగ్వార్ ఎక్స్‌జే కారును స్థానికంగా భారత్‌లో అసెంబ్లిగ్ చేయటం వలన దీని ధర భారీగా తగ్గింది. దేశీయ విపణిలో దీని ప్రారంభ ధర రూ.92.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉంది. టాటా మోటార్స్‌కు సంబంధించిన పూనే ప్లాంట్‌లోని ఓ భాగంలో ఈ కొత్త జాగ్వార్ ఎక్స్‌జే కారును అసెంబ్లింగ్ చేస్తున్నారు.

Jaguar XJ Made In India

జాగ్వార్ ఇప్పటికే తమ ఎక్స్ఎఫ్ సెడాన్‌ను స్థానికంగా భారత్‌లో అసెంబుల్ చేస్తోంది. కాగా.. జాగ్వార్ ఎక్స్‌జే మోడల్‌కు ఇండియన్ మార్కెట్ నుంచి మంచి గిరాకీ లభిస్తున్న నేపథ్యంలో, ఈ మోడల్‌ను కూడా ఇండియాలో అసెంబుల్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఇదివరకు జాగ్వార్ తమ ఎక్స్‌జే మోడల్‌ను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని, ఇక్కడి మార్కెట్లో విక్రయించేంది. అధిక దిగుమతి సుంఖాల కారణంగా దీని ధర రూ.1.16 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉండేది.

జాగ్వార్ స్థానికంగా అసెంబుల్ చేస్తున్న డీజిల్ వెర్షన్ ఎక్స్‌జే వేరియంట్‌లో 2993సీసీ, 6-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 275 పిఎస్‌ల శక్తిని, 600 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6.4 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ జెడ్ఎఫ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉటుంది. ఇతర జాగ్వార్ కార్ల మాదిరిగానే ఇది కూడా అనేక అధునాత టెక్నికల్ మరియు సేఫ్టీ ఫీచర్లతో లభిస్తుంది.

Most Read Articles

English summary
Jaguar Land Rover is part of an Indian company Tata Motors Group. The British Icon had showcased its XJ at the 2014 Auto Expo which, was held in New Delhi. They had then showed intent to assemble their XJ premium luxury sedan locally in India. This means the will get their vehicle as a Completely Knocked Down unit(CKD), making it a tad more affordable.
Story first published: Friday, May 23, 2014, 10:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X