జీప్ విడుదల మళ్లీ వాయిదా; 2015 తర్వాతే లాంచ్

Written By:

ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్ తమ పాపులర్ ఎస్‌యూవీ బ్రాండ్ 'జీప్' (Jeep)ను వాస్తవానికి 2013లో విడుదల చేయాలని ప్రయత్నించినప్పటికీ, కొన్ని అనుకోని (అంతర్గత) కారణాల వలన ఈ బ్రాండ్ విడుదల జాప్యం అయ్యింది. అయితే, ఈ ఏడాది అన్నా జీప్ బ్రాండ్ ఇండియాకు వస్తుందనుకుంటే, అది కూడా జరిగే సూచనలు కనిపించడం లేదు.

ఇది కూడా చదవండి: ఫియట్ పుంటో ఇవో విడుదల

వచ్చే 2015 వరకూ ఫియట్ జీప్‌ను ఇండియాకు తీసుకురామని ఫియట్ స్పష్టం చేసింది. భారత మార్కెట్లోని ఆర్థిక మందగమనం, బలహీనంగా అమ్మకాల కారణంగా తమ జీప్ వాహనాలను విడుదల వాయిదా వేస్తున్నామని ఫియట్ చెప్పుకొస్తోంది. జీప్ బ్రాండ్‌ను భారత్‌లో ప్రవేశపెట్టడం గురించి ఫియట్ క్రైస్ల పలు అధ్యయనాలు చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.


ఫియట్ తమ జీప్ బ్రాండ్ వాహనాలను భారత్‌లో సరసమైన ధరకే అందుబాటులో ఉంచేందుకు గాను వాటిని ఇక్కడే తయారు చేయాలని భావిస్తోంది. ముందుగా జీప్ బ్రాండ్ క్రింద 2015లో వ్రాంగ్లర్ మరియు గ్రాండ్ చిరోకీ మోడళ్లను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో గ్రాండ్ చిరోకీ మోడల్‌ను మాత్రం స్థానికంగా భారత్‌లోనే ఉత్పత్తి చేస్తారు. వ్రాంగ్లర్‌ను సిబియూ రూట్లో దిగుమతి చేసుకుంటారు.

ఇది కూడా చదవండి: ఫియట్ పుంటో ఇవో టెస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇదిలా ఉండగా.. ఇటీవలే రిఫ్రెష్డ్ పుంటో ఇవో హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసిన ఫియట్ మరికొద్ది రోజుల్లో అవెంచురా క్రాసోవర్‌ను కూడా విడుదల చేయనుంది. డీలర్‌షిప్ నెట్‌వర్క్ విషయంలో టాటా మోటార్స్ నుంచి విడిపోయిన ఫియట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తమ స్వంత డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసుకునే పనిలో బిజీబిజీగా ఉంటోంది. నెట్‌వర్క్ విస్తరణతో ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో విస్తరణపై కూడా కంపెనీ దృష్టి పెట్టింది.


ఇందులో భాగంగనే, ఇటాలియన్-అమెరికన్ కంపెనీ ఫియట్ క్రైస్లర్ కంపెనీ రానున్న ఐదేళ్లలో మొత్తం 12 కొత్త మోడళ్లను భారత మార్కెట్‌కు పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో 9 మోడళ్లను భారత్‌లోనే అసెంబుల్ చేస్తామని, మిగిలిన 3 మోడళ్లను విదేశాల నుంచి భారత్‌కు దిగుమతి చేసుకుంటామని కంపెనీ పేర్కొంది.

ఈ వీడియో చూశారా..?
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/wR7e3B48JE4?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

కార్లను పోల్చు

ఫియట్ పుంటో ఇవో
ఫియట్ పుంటో ఇవో వేరియంట్‌ను ఎంచుకోండి
-- పోల్చడానికి కారును ఎంచుకోండి --

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Jeep is currently owned by Fiat Chrysler and had earlier announced that it would be launching the SUV brand in India by 2013. However, they have changed their mind and are planning to bring the Jeep brand next year in 2015.&#13;
Please Wait while comments are loading...

Latest Photos