2015లో భారత్‌కు వస్తున్న ఫియట్ జీప్ ఎస్‌యూవీలు!

By Ravi

ఇటాలియన్-అమెరికన్ కంపెనీ ఫియట్ క్రైస్లర్ ఆటోమొబైల్స్ రానున్న 2015లో తమ పాపులర్ 'జీప్' (JEEP) బ్రాండ్ వాహనాలను భారత మార్కెట్లో విడుదల చేస్తామని పేర్కొంది. ఆ సంస్థ అంతర్జాతీయ వ్యవహరాల అధినేత మైక్ మ్యాన్లీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

వాస్తవానికి జీప్ బ్రాండ్ వాహనాలను ఈ ఏడాదే మార్కెట్లో విడుదల కావల్సి ఉన్నప్పటికీ కరెన్సీ ఒడిదుడుకుల కారణంగా కంపెనీ వీటి విడుదలను మరో ఏడాది కాలం పాటు వాయిదా వేసిందని, అయితే 2015లో మాత్రం ఖచ్చితంగా వీటిని ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టగలమనే ధీమా తనకుందని మ్యాన్లీ తెలిపారు.


జీప్ బ్రాండ్ ఇప్పటికే తమ గ్రాండ్ చిరోకీ, వ్రాంగ్లర్ ఎస్‌యూవీలను ఇండియాకు తీసుకు వచ్చి, ఇక్కడి రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. టెస్టింగ్ దశ దాదాపు పూర్తయినప్పటికీ, వీటి విడుదల మాత్యం జాప్యం అవుతోంది. గడచిన ఫిబ్రవరి నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలోనైనా ఈ రెండు మోడళ్లు ఆవిష్కరిస్తారనుకుంటే, కార్ ప్రియులకు మాత్రం నిరాశే ఎదురైంది.

జీప్ బ్రాండ్ వాహనాలను భారత్‌లో తయారు చేయాలని ఫియట్ భావిస్తోంది. జీప్ బ్రాండ్ క్రింద 2015లో వ్రాంగ్లర్ మరియు గ్రాండ్ చిరోకీ మోడళ్లను ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. ఇందులో గ్రాండ్ చిరోకీ మోడల్‌ను స్థానికంగా ఉత్పత్తి చేస్తామని, వ్రాంగ్లర్‌ను మాత్రం దిగుమతి చేసుకుంటామని మైక్ మ్యాన్లీ వివరించారు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Jeep Cherokee
Most Read Articles

English summary
Fiat Chrysler had earlier planned to launch the Jeep brand of Utility Vehicles in India in 2014. However, due to certain factors their entry into the Indian market has been delayed. It was believed that India is not a favourable market and the economic slowdown was blamed too.
Story first published: Tuesday, July 1, 2014, 16:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X