కేరళలో కొచ్చి నగరానికి విస్తరించిన 'షి టాక్సీ' సేవలు

కేరళలో 'షి టాక్సీ' సేవలు విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతుండంతో వాటిని అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం షి టాక్సీ అనే సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే, మహిళల కోసం పూర్తిగా మహిళలే నిర్వహించే టాక్సీ సేవలను తొలుతగా గడచిన సంవత్సరం నవంబర్ నెలలో తిరువనంతపురంలో ప్రారంభించారు.

ఈ సేవలు మంచి సక్సెస్‌ను సాధించడంతో తాజాగా కొచ్చిలో కూడా ఈ సేవలను విస్తరించారు. 'షి టాక్సీ' పేరుతో పిలిచే ఈ టాక్సీల యజమానులు, డ్రైవర్లు, నిర్వాహకులు చివరకు ప్యాసింజర్లు వరకు అందరూ మహిళలే ఉంటారు. ఈ సేవలు రోజుకు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. జెండర్ పార్క్ అనే సంస్థ వీటిని నిర్వహిస్తోంది. ఇటీవలే షి టాక్సీ సేవలు మన రాష్ట్రం (హైదారాబాద్)లో కూడా ప్రారంభమయ్యాయి. ఈ సేవలకు సంబంధిచిన మరింత సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకోండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

స్త్రీల కోసం 'షి టాక్సీ' సేవలు..

మారుతి సుజికి ఇండియా, జెండర్ పార్క్ సంస్థకు ప్రత్యేకంగా తెలుపు, గులాబి రంగుతో కూడిన టాక్సీలను (స్విఫ్ట్ డిజైర్ టాక్సీ టూరర్) సరఫరా చేస్తోంది.

స్త్రీల కోసం 'షి టాక్సీ' సేవలు..

షి టాక్సీలలో జిపిఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్), అత్యవసర అలారం (ఎమర్జెన్సీ అలారం), వినోదం (ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్) వంటి సౌకర్యాలను కల్పిస్తున్నారు.

స్త్రీల కోసం 'షి టాక్సీ' సేవలు..

జెండర్ పార్క్ సంస్థ కొందరు లబ్ధిదారులను గుర్తించి, వారికి కేరళ రాష్ట్ర మహిళాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పిస్తుంది.

స్త్రీల కోసం 'షి టాక్సీ' సేవలు..

షి టాక్సీలను నిర్వహించే మహిళా డ్రైవర్లకు వైద్య బీమా కల్పించడంతో పాటుగా, ఆత్మరక్షణ పద్ధతులలో శిక్షణ కూడా ఇస్తున్నారు.

స్త్రీల కోసం 'షి టాక్సీ' సేవలు..

ఈ టాక్సీలు నడిపేవారికి నెలకు కనీసం రూ.20-40 వేల వరకు ఆదాయం లభిస్తుందని జెండర్ పార్క్ వర్గాలు చెబుతున్నాయి.

స్త్రీల కోసం 'షి టాక్సీ' సేవలు..

నెలకు 22 రోజుల పాటు రోజుకు 8 గంటల చొప్పున వీటిని నడిపించాల్సి ఉంటుందని, కార్లకు ఇరు వైపులా ప్రకటనలు, లోపల ఎల్‌సిడి సిస్టమ్‌లలో ప్రకటనల ద్వారా మరింత అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చని వారు చెబుతున్నారు.

స్త్రీల కోసం 'షి టాక్సీ' సేవలు..

తిరువనంతపురం, కొచ్చి రెండు నగరాల్లో షి టాక్సీకి క్యాబ్ నంబర్ ఒకటే - 8590000543. టెక్నో పార్క్‌లోని రెయిన్ కాన్సర్ట్ టెక్నాలజీస్‌తో ఈ నంబర్ కనెక్టవుతుంది. ఈ కేంద్రం నుంచే టాక్సీ సర్వీసులు సమన్వయం చేయబడి పర్యవేక్షించబడతాయి.

Most Read Articles

English summary
The Kerala government, on Wednesday, inaugurated the second women only taxi service in the state in Kochi. The only one of its kind in the county, the ‘She-Taxi' service is already operational in Thiruvananthapuram since November last year.
Story first published: Thursday, May 22, 2014, 16:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X