యాపిల్ కార్ ప్లేకి పోటీగా ఆండ్రాయిడ్ ఆటో కార్ ఇన్ఫోటైన్‌మెంట్

By Ravi

టెక్నాలజీ దిగ్గజం యాపిల్ స్మార్ట్ ఫోన్లతో పాటుగా ఆటోమొబైల్ యాక్ససరీ మార్కెట్లో కూడా తమ సత్తా ఏంటో చూపేందుకు కార్ ప్లే అనే కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసినదే. కాగా.. యాపిల్ ఐఓఎస్‌కు ఇప్పటికే గట్టి పోటీ ఇస్తున్న ఆండ్రాయిస్ ఆపరేటింగ్ సిస్టమ్ 'ఆండ్రాయిడ్ ఆటో' (Android Auto) పేరిట కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పరిచయం చేసింది.

యాపిల్ సంస్థ మెర్సిడెస్ బెంజ్, ఫెరారీ, వోల్వో వంటి ఖరీదైన కార్ కంపెనీలను టార్గెట్ చేసుకొని తమ కార్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తుంటే, అండ్రాయిడ్ మాత్రం జనరల్ మోటార్స్, హోండా, హ్యుందాయ్ వంటి మాస్ మార్కెట్ బ్రాండ్‌లను టార్గెట్‌గా చేసుకొని తమ ఆండ్రాయిడ్ ఆటో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆఫర్ చేయనుంది.

Android Auto

ఆండ్రాయిడ్ సిస్టమ్‌ను కార్లలో కూడా పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో ఇప్పటికే ఏర్పాటు చేయబడిన ఓఏఏ (ఓపెన్ ఆటోమోటివ్ అలయన్స్) అనే గ్రూపులో కొన్ని కార్ కంపెనీలు సభ్యులుగా చేరిపోయాయి. యాపిల్ సంస్థ తమ కార్ ప్లే ఇన్-కార్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ప్రకటించిన అతికొద్ది సమయంలో ఆండ్రాయిడ్ సంస్థ తమ ఆండ్రాయిడ్ ఆటోను ప్రకటించడం గమనార్హం.

ఆండ్రాయిడ్ ఆటో కూడా కార్ ప్లే మాదిరిగానే మ్యూజిక్, మ్యాప్స్, యాప్స్, హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్, జిపిఎస్ ట్రాకింగ్ వంటి అనేక అంశాలతో లభ్యం కానుంది. మొత్తమ్మీద ఈ అధునాతన కార్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్ సాయంతో కారులో ప్రయాణం మరింత సౌకర్యవంతంగాను, సురక్షితంగాను మారిపోనుందనేది మాత్రం ఖాయం.

Most Read Articles

English summary
Audi, GM, Honda, Hyundai and Volvo have announced that they will be incorporating Android Auto into their future models. These carmakers are all members of the OAA (Open Automotive Alliance), a group founded recently to bring Android to cars. This announcement comes soon after the launch of Apple's CarPlay. Both systems will allow users access to normally-used apps through the car's infotainment system.
Story first published: Monday, June 30, 2014, 10:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X