2000వ అవెంటేడర్‌ను ఉత్పత్తి చేసిన లాంబోర్గినీ

By Ravi

ఇటలీకు చెందిన ప్రముఖ సూపర్ కార్ల తయారీ సంస్థ లాంబోర్గినీ అందిస్తున్న అవెంటేడర్ సూపర్ కారు 2000 యూనిట్ల ఉత్పత్తిని చేరుకుంది. 2011 ఆరంభంలో విడుదలైన ఈ మోడల్ అనతి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులారిటీని దక్కించుకుంది. 700 హార్స్ పవర్, వి12 ఇంజన్, ఆల్-వీల్ డ్రైవ్ కలిగిన ఈ ఇటాలియన్ రేసింగ్ ఎద్దు (రేసింగ్ బుల్‌)ను సగటున రోజు 5 యూనిట్లను మాత్రమే కంపెనీ ఉత్పత్తి చేస్తోంది.

అంటే, సగటున నెలకు 150, ఏడాదికి 1800 అవెంటేడర్ కార్లను మాత్రమే లాంబోర్గినీ ఉత్పత్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో, లాంబోర్గినీ తమ 2000వ అవెంటేడర్ ఎల్‌పి 700-4 కూపే మోడల్‌ను ఈ గురువారం ఉత్పత్తి చేసింది. శాంట్అగటా బొలోగ్నాలోని ప్లాంటులో ఈ సూపర్‌కారును లాంబోర్గినీ ఉత్పత్తి చేస్తుంది. దీనికి ముందు మోడల్ అయిన లాంబోర్గినీ ముర్సిలాగో మాదిరిగానే ఇది మార్కెట్లో మంచి సక్సెస్‌ను సాధించింది.

లాంబోర్గినీ ముర్సిలాగోను 2001లో ఉత్పత్తి చేయటం ప్రారంభించారు. 2006లో ఇది 2000 యూనిట్ల మైలురాయిని చేరుకుంది. ముర్సిలాగో ఈ 2000 యూనిట్స్ మార్కును చేరుకోవటానికి 4 ఏళ్ల సమయం పట్టగా, అవెంటేడర్‌ మాత్రం కేవలం 2 ఏళ్ల సమయంలోనే ఈ విజయాన్ని సాధించింది. ఇప్పటికీ అవెంటేడర్‌కు పటిష్టమైన డిమాండ్ ఉంది. ఎవరైనా లాంబోర్గినీ అవెంటేడర్‌ను సొంతం చేసుకోవాలంటే కనీసం ఒక సంవత్సరం పాటు వేచి ఉండాల్సిందే.

కాగా.. 2000వ లాంబోర్గినీ అవెంటేడర్‌ను సొంతం చేసుకున్నది ఏటి అండ్ టి సంస్థకు ఛీఫ్ ఇంటలిజెన్స్ ఆఫీసర్‌‌గా పనిచేస్తున్న థాడ్డెయిస్ అర్రోయో. లాంబోర్గినీ కార్లంటే క్రేజ్ ఉన్న అర్రోయో వద్ద ఇప్పటికే ఓ లాంబోర్గినీ గల్లార్డో ఎల్‌పి 550-2 స్పైడర్ కారు ఉంది. ఈయన పామ్ బీచ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అవెంటేడర్‌ను తొలిసారిగా రైడ్ చేసి, అప్పటి నుంచి ఇలాంటి ఓ కారును సొంతం చేసుకోవాలని పట్టుబట్టాడు. అతని కల ఇప్పటికి నెరవేరింది.

లాంబోర్గినీ అవెంటేడర్‌ 2000
గల్‌వింగ్ డోర్స్

గల్‌వింగ్ డోర్స్

ఇంటీరియర్ వ్యూ

ఇంటీరియర్ వ్యూ

సైడ్ వ్యూ

సైడ్ వ్యూ

ఫ్రంట్ వ్యూ

ఫ్రంట్ వ్యూ

రియర్ వ్యూ

రియర్ వ్యూ

షార్ప్ హెడ్‌ల్యాంప్స్

షార్ప్ హెడ్‌ల్యాంప్స్

హనీకోంబ్ ఎయిర్ ఇన్‌టేక్

హనీకోంబ్ ఎయిర్ ఇన్‌టేక్

స్టయిలిష్ అల్లాయ్ వీల్స్

స్టయిలిష్ అల్లాయ్ వీల్స్

సైడ్ వ్యూ - వింగ్ మిర్రర్స్

సైడ్ వ్యూ - వింగ్ మిర్రర్స్

లాంబోర్గినీ అవెంటేడర్‌ వార్షికోత్సవ ఎడిషన్

Most Read Articles

English summary
Aventador, the 700HP, V12, all-wheel drive Italian raging bull came into being in early 2011. Since then Lamborghini been producing, on an average, five Aventador supercars everyday. One Thursday the 2000th Aventador LP 700-4 coupe model rolled out of the production line in Sant'Agata Bologna.
Story first published: Saturday, June 8, 2013, 10:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X